గర్ల్ ఫ్రెండ్ తో వాట్సాప్ వీడియో చాట్ చేస్తూనే…షూట్ చేసుకున్నాడు ఆ 19 ఏళ్ల అబ్బాయి..! ఎందుకో తెలుసా..?

నేటి త‌రుణంలో యంగ్ జ‌నరేష‌న్ ఎలా త‌యారైందంటే.. చిన్న చిన్న విష‌యాల‌కే తీవ్ర మ‌న‌స్థాపానికి లోనై ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. కార‌ణం ఏదైనా కావ‌చ్చు, స‌మ‌స్య ఎలాంటిదైనా అయి ఉండ‌వ‌చ్చు. కానీ వారిక‌వి పెద్ద‌గా అనిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు పెరిగాయనే చెప్ప‌వ‌చ్చు. పాట్నాలోనూ స‌రిగ్గా ఇలాంటి ఓ ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఇందులో షాకింగ్ అయిన విష‌యం ఏమిటంటే.. ఓ వైపు వాట్సాప్‌లో లైవ్ వీడియో కాల్ లో మాట్లాడుతూనే మ‌రో వైపు ఆ యువ‌కుడు గ‌న్‌తో కాల్చుకుని చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

పాట్నాలోని సాయిచ‌క్‌లో నివాసం ఉండే ఆకాష్ కుమార్ అలియాస్ బంటీ (19) స్థానికంగా పాట్నా కాలేజీలో ఇంట‌ర్ విద్య‌ను అభ్య‌సిస్తున్నాడు. ఇత‌ను గ‌త కొంత కాలంగా స్థానికంగా ఉన్న అదే ప్రాంతానికి చెందిన ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. అయితే బంటీ త‌రచూ స‌ద‌రు యువతిని పెళ్లి చేసుకుందామ‌ని అడిగేవాడు. అందుకు ఆ యువ‌తి ఒప్పుకునేది కాదు. మ‌రికొంత కాలం వేచి ఉన్నాక చూద్దామ‌ని చెప్పేది. అయితే ఇదే విష‌యంపై అనేక సార్లు వాట్సాప్ చాటింగ్‌లోనూ బంటీ ఆ యువ‌తిని అడిగాడు. అప్పుడు కూడా అత‌నికి ఆమె నుంచి అదే స‌మాధానం వ‌చ్చింది.

అయితే ఈ జ‌న‌వ‌రి 28వ తేదీన ఆదివారం అర్థ‌రాత్రి పూట బంటీ, ఆ యువ‌తి ఎప్ప‌టిలాగే వాట్సాప్‌లో చాటింగ్ మొద‌లు పెట్టారు. త‌రువాత వీడియో కాలింగ్‌లో మాట్లాడుకోవ‌డం ప్రారంభించారు. అప్పుడు మ‌రో సారి బంటీ పెళ్లి చేసుకుందామ‌ని అడిగాడు. లేదంటే చ‌నిపోతాన‌ని బెదిరించాడు. అయితే ఆ యువ‌తి మాత్రం అప్పుడు కూడా కొంత కాలం ఆగాక త‌ల్లిదండ్రుల‌తో చెప్పి పెళ్లి చేసుకుందామ‌ని అత‌నితో అన్న‌ది. అయినా అత‌ను వినిపించుకోలేదు. ప‌ట్టుబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో ఆ యువ‌తి ఎంత సేప‌టికీ పెళ్లికి స‌సేమిరా అంటుండ‌డంతో బంటీ ఒక్క‌సారిగా లేచి అప్ప‌టికే సిద్ధం చేసుకుని పెట్టుకున్న గ‌న్‌తో త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు స‌మాచారం తెలుసుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. చూశారుగా, నేటి యువ‌త ఎలా మారిపోయారో. ఏది ఏమైనా ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇక‌పై జ‌ర‌గ‌కుండా ఉండాల‌నే ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top