30 వేల రూపాయలకు లవర్ పాత కార్ ను అమ్మేయాలని ఓ వీడియో తీసాడు..! చివరికి కోటి రూపాయలు ఎలా వచ్చాయో తెలుసా.?

అది 1996లో త‌యారు చేయ‌బ‌డిన హోండా కంపెనీ అక్కార్డ్ కారు. దాన్ని ఓన‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు వాడారు. ఇప్పుడు దాని ధ‌ర 499 డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.32వేలు. ఇక కారు ఇప్ప‌టి వ‌ర‌కు 1.41 ల‌క్ష‌ల మైళ్ల వ‌ర‌కు తిరిగింది. 21 సంవ‌త్స‌రాలు అయింది. ఇప్పుడు మీరు చెప్పండి. ఆ కారును మీరు అయితే ఎంత‌కు కొంటారు ? ఏముందీ… రూ.32వేలు కూడా ఆ కారుకు ఎక్కువే. అన్ని ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు అన్నేళ్ల పాటు తిరిగిన కారు అంటే దానికి ఆ ధ‌ర ఎక్కువే. రూ.20వేలు అయితే ఓకే.. అంటారా..! అయితే మీ గెస్ క‌రెక్టే. కానీ ఆ కారును ఇప్పుడు చాలా మంది రూ.1కోటి ఇచ్చి మ‌రీ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏంటీ.. షాక్ అయ్యారా..! అయినా మేం చెబుతోంది నిజ‌మే.

మాక్స్ లాన్‌మ‌న్ అనే వ్య‌క్తి త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ కారు అమ్మ‌కానికి పెట్టింద‌ని తెలుసుకుని ఆమెకు ఎలాగైనా హెల్ప్ చేయాల‌ని అనుకున్నాడు. దానికి ఎక్కువ ధ‌ర వ‌స్తే ఆమెకు స‌హాయం అవుతుంద‌ని భావించాడు. అయితే కారు ధ‌ర 499 డాల‌ర్లు మాత్ర‌మే. కానీ అత‌ను క్రియేటివ్‌గా ఓ ప‌నిచేశాడు. అదేమిటంటే… త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఆ కారు న‌డుపుతూ ఉంటుంది. ఆ సమ‌యంలో ఆ డ్రైవింగ్ షాట్స్‌ను అత‌ను తీశాడు. డ్రోన్ కెమెరాల స‌హాయంతో కారు డ్రైవింగ్ వీడియోను చిత్రీక‌రించాడు. అనంతరం దాన్ని సినిమా ట్రైల‌ర్‌లా ఎడిట్ చేశాడు. అనంత‌రం ఆన్‌లైన్‌లో కారు ఫొటోల‌తో స‌హా ఆ ఈ వీడియోను ఉంచి దాని రేటు 499 డాల‌ర్లు అని ఫిక్స్ చేసి అమ్మ‌కానికి పెట్టాడు.

అయితే మాక్స్ పెట్టిన ఆ వీడియోను కొన్ని ల‌క్ష‌ల మంది వీక్షించారు. దీంతో ఆ కారు సేల్ గురించిన వార్త వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలో చాలా మంది ఆ కారును ఏకంగా రూ.1 కోటి వ‌రకు ఇచ్చి కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఆ కారు బిడ్డింగ్ ధ‌ర 1.35 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు చేరుకుంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.87.50 ల‌క్ష‌ల‌న్న‌మాట‌. దీంతో ఇప్పుడు మాక్స్‌, అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. ఇక మ‌రి వారు ఆ కారును ఎవ‌రికి ఎంత మొత్తంలో అమ్ముతారో వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా 21 ఏళ్ల ఆ కారుకు అంత‌టి భారీ ధ‌ర వ‌చ్చిందంటే.. అది మాక్స్ వీడియో వ‌ల్లే. అవును క‌దా..!

Comments

comments

Share this post

scroll to top