లవ్ వైరస్ ..ఎపిసోడ్-2

వెంకట్ ను తీసుకెళ్లి ఊరి శివార్లో ఒక కాలువ ఒడ్డున పడేస్తారు.కాసేపటి తర్వాత అటుగా ఒక వ్యక్తి పడవలో వెళుతూ వెంకట్ బాడీని చూస్తాడు. అతనికి అనుమానం వచ్చి పడవను ఆపి వెంకట్ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని చూస్తాడు. పల్స్ ఉండడంతో ఇంకా ప్రాణం పోలదనుకుని వెంటనే మరో ఇద్దరు ముగ్గురు సహాయంతో హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.వెంకట్ ను ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లి వైద్యం చేయడం మొదలు పెడతారు. ఆక్సిజన్ పెట్టి, ఎకో మిషన్ కనెక్ట్ చేసి, బ్లడ్ అంతా క్లీన్ చేస్తుంటారు. త్వర త్వరగా ట్రీట్ మెంట్ జరిగిపోతుంటుంది.

హాస్పిటల్ లో ఎవరు లేని వ్యక్తి లా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వెంకట్ గతంలో కెళితే ఒక సంవత్సరం క్రితం…………….కొత్త గా హైదరాబాద్ కు వచ్చిన వెంకట్ అమీర్ పేట్ లోని సాయి మెన్ హాస్టల్ లో ఉంటూ జాబ్ ట్రయల్స్ చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఒకరోజు హడావుడిగా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి బయలుదేరతాడు. హైటెక్ సిటీలో అతను బస్సు రోడ్ దాటుతున్న సమయంలో ఒక కళ్లు లేని వ్యక్తి తనను రోడ్డు దాటించమని వెంకట్ ను అడగడంతో ఆ బ్లైండ్ పర్సన్ ను చేయి పట్టుకుని రోడ్డు దాటుతుంటాడు వెంకట్.ఆ టైంలో ఆ కళ్లు లేని వ్యక్తి బాబు నన్ను కాస్త కొండాపూర్ వరకు తీసుకెళ్లగలరా ప్లీజ్ అంటూ అడుగుతాడు.

addtext_com_MDIzNDQyNDgyODEw

వెంకట్, ఆ వ్యక్తితో సారీ అండి నేను అర్జెంట్ గా ఇంటర్వ్యూకి వెళ్లాలి అని చెప్తూ అతన్ని పట్టుకుని రోడ్డు దాటి అక్కడే ఉన్న అందమైన అమ్మాయి దగ్గరికెళ్లి ఏమండి చూడటానికి చాలా మంచివారిలాగున్నారు, అలాగే ఖాళీగా నిలబడున్నారు కొంచెం ఈయన్ని కొండాపూర్ వరకు తీసుకెళ్లండి అంటూ ఆ వ్యక్తిని ఆ అమ్మాయికి అప్పగించి వెళ్లిపోతాడు వెంకట్. ఏయ్…. హలో… ఏంటిది అని అరుస్తూ వెంకట్ ను పిలుస్తుంటుంది ఆ అమ్మాయి. కాని వెంకట్ అప్పటికే చాలా దూరం వెళ్లిపోతాడు.
ప్లీజ్ అమ్మ కాస్త తీసుకెళ్లవా… ఆ అబ్బాయి ఏదో ఇంటర్వ్యూ ఉందని అని అన్నాడు అని అడుగుతాడు ఆ బ్లైండ్ పర్సన్. సరే అంటుంది అమ్మాయి.వెంకట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. సంతోషంగా ఇంటికి కాల్ చేసి విషయం చెబుతాడు. అలా జాబ్ లో జాయిన్ అయిన వెంకట్ కు నెల రోజులయ్యేటప్పటికి కొంతమంది కొలిగ్స్ ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు వారంతా కలిసి వారి ఆఫీస్ దగ్గర్లో ఉన్న కాఫీషాప్ కు వెళతారు.కాఫీ షాప్ లోపలికి వెళుతుండగా వెంకట్ తన కొలిగ్స్ తో , మన టీం లీడర్ నాకు ఐ లవ్ యూ అని మెసేజ్ చేసిందిరా అని చెప్తాడు. వెంటనే వారంతా నవ్వుతారు. వెంకట్ పక్కనే ఉన్న అరుణ్ మరి నువ్వేం రిప్లే ఇచ్చావ్ అని నవ్వు ఆపుకుంటూ అడుగుతాడు. నేనింకా ఏం చెప్పలేదు అంటాడు వెంకట్. ఓకే చెప్పి చూడురా నీకే తెలుస్తుంది అని నవ్వుతుంటాడు అరుణ్.
ఏ ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేసి వాడితో ఆడుకుందా అనంటాడు వెంకట్. ఎవరినైనా ఏంట్రా కనపడ్డ ప్రతి మగాడికి ఆ మెసేజ్ వెళుతుంది ఆ ఫోన్ నుండి అంటూ మళ్లీ నవ్వుతుంటాడు అరుణ్.
అదేంటి, అయినా ఎందుకు రా అంతగా నవ్వుతున్నారు అని అడుగుతాడు వెంకట్. మన టీం లీడర్ పేరేంటి అని అడుగుతాడు అరుణ్. కిరణ్మయి అని చెబుతాడు వెంకట్. కిరణ్ వరకు కరెక్టే కాని మయి మాత్రం తగిలించుకున్నది అని అంటాడు అరుణ్. అదేంటి అని అంటాడు వెంకట్.
అది కుమరి 21 F కాదు M కాదు మధ్యలో ఉండి F లా బిహేవ్ చేస్తుంది అంతే అనంటాడు అరుణ్. వ్వాట్… అని ఆశ్చర్యపోతాడు వెంకట్. పాపం మనోడు డిసప్పాయింట్ అయినట్టున్నాడు రా ఓకే చెప్దామనుకున్నావా అని అరుణ్ అండ్ బ్యాచ్ వెంకట్ ను చూసి నవ్వుతుంటారు. ఛీ…ఛీ… నేనే ఓకే చేద్దాం అనుకోలేదు అయినా నేనొక అమ్మాయిని చూశాను ఇంటర్వ్యూకి వచ్చే రోజు అమ్మాయి అంటే అలా ఉండాలి, కాని ఇంటర్వ్యూ తొందర్లో మాట్లాడకుండా వచ్చేశాను అని అంటాడు వెంకట్.
ఆల్రెడీ లుక్స్ అయిపోయాయన్నమాట అని అంటాడు అరుణ్.
ఏ అలా అని కాదు అంటూ కాఫీ షాప్ లో అడుగుపెడుతున్న వెంకట్ కు ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్ తో కలిసి అక్కడ కూర్చుని కాఫీ తాగుతుంటుంది. ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టిన వెంకట్ అమ్మాయి వైపు చూసి హాయ్ అన్నట్టుగా చెయ్యి ఊపుతాడు. ఆ అమ్మాయి మాత్రం వెంకట్ ను గుర్తుపట్టనట్టుగా చూస్తుంది. వెంకట్ ఆ అమ్మాయి దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటాడు.
ఆ అమ్మాయి ఏదో ఫోన్ మాట్లాడుతూ వెంకట్ తన వద్దకు రావడం గమనిస్తుంది. వెంకట్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి హాయ్ అండి గుర్తుపట్టారా అంటూ ఆ రోజు జరిగిన విషయం గురించి చెబుతాడు.
వెంటనే ఆ అమ్మాయి ఏంటి ఆ రోజు అతన్ని అలా వదిలేసి వెళ్లారు, నాకు సడెన్ గా ఏం అర్థం కాలేదు అని అంటుంది.
సారీ అండి రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు, అది కూడా షాపింగ్ మాల్ ముందు ఎలాగూ ఖాళీగానే ఉంటారు కదా మహా అయితే షాపింగ్ కు వెళ్లడమే కదా అని అతన్ని మీకు అప్పగించాను అని అంటాడు వెంకట్. అంటే షాపింగ్ మాల్ ముందు నిల్చుంటే షాపింగ్ కు వెళుతున్నాననేనా , మీకు మీరే డిసైడ్ అవుతారా అని అంటుంది ఆ అమ్మాయి. అది కాదండి అని వెంకట్ ఏదో చెప్పబోతుండగానే వెనక నుండి వచ్చిన పోలీసులు వెంకట్ ను పట్టుకుని, ఇప్పటికి దొరికావు పదరా అంటూ అరెస్ట్ చేసి తీసుకెళతారు……(ఇంకా ఉంది.)

CLICK HERE: EPISODE-3

CLICK HERE : Episode (1)

Comments

comments

Share this post

One Reply to “లవ్ వైరస్ ..ఎపిసోడ్-2”

Comments are closed.

scroll to top