లవ్ వైరస్….. ఎపిసోడ్-1,2 & 3.

“నువ్వెందుకు మారావే శైలజ” అనే పాట రిపీటెడ్ గా వస్తూనే ఉంటుంది. వీడొకడు ప్రతిరోజూ ఇదే పాటను పెట్టి పెట్టి అరగదీసి చంపుతున్నాడు అనుకుంటూ స్నానానికి బకెట్, సోప్ తీసుకుని వెళతారు ఇద్దరు యువకులు.అమీర్ పేట్ లోని సాయి మెన్ హాస్టల్ లోని రెండవ అంతస్థులోని ఒక రూం నుండి వినిపిస్తూ ఉంది ఆ పాట. అదే పాటను తిప్పి తిప్పి వింటున్నాడు వెంకట్. ఈ పాటను DSP, నీ కోసమే కంపోజ్ చేసినట్టున్నాడు రా… ఆయన కూడా ఇన్నిసార్లు వినుండడు. అయినా ఫస్ట్ డే స్కూల్ కెళ్లిన పిల్లాడి లాగా ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుంటావేంట్రా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఒకసారి రోడ్ మీదకొచ్చి చూడు మనం లవ్ చేయడానికే అమ్మాయిలు తిరుగుతున్నట్టనిపిస్తుంది.  అంతమంది అమ్మాయిలున్నారు, నా మాట విని అన్ని మర్చిపొయ్యి మళ్లీ రెగ్యులర్ లైఫ్ లీడ్ చెయ్యి అంటూ హడావుడిగా రెడీ అయ్యి ఆఫీస్ కు వెళ్లిపోతాడు మనోహర్.

addtext_com_MDgyMjMxMjIyMTAz

వెంకట్ మాత్రం మనో చెప్పినవి ఏవి పట్టించుకోడు. అతనికి “నన్నెందుకు ఇంత మోసం చేశావ్, నేను నీకేం అన్యాయం చేశాను, నువ్వు నా కళ్ల ముందు నుండి వెళ్లిపో “అన్న ఆ అమ్మాయి మాటలే వినిపిస్తున్నాయి. తనెందుకు అలా అంది, నన్ను విడిచి ఎందుకు వెళ్లిపోయిందని ఆలోచనలోనే ఉంటాడు వెంకట్.అంతలోనే అతని మొబైల్ కు ఏదో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే కళ్లు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. I am sorry venkat నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను బట్ నాకర్థమైంది నువ్వు లేకుండా నేనుండలేనని , నాకు నిన్ను చూడాలని ఉంది కాని నేను రాలేకపోతున్నాను, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. బహుశా నా మొబైల్ కూడా నా దగ్గర ఉండకపోవచ్చు, నువ్వు వెంటనే కొచ్చిన్ వచ్చెయ్ అంటూ తన ఇంటి అడ్రస్ పంపుతూ మెసేజ్ చేస్తుంది శైలజ.
అది చదివిన వెంకట్ వెంటనే శైలజ ఫోన్ కు కాల్ చేస్తాడు బట్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంకట్ వెంటనే ఏమి ఆలోచించకుండా లగేజ్ ప్యాక్ చేసుకుని కొచ్చిన్ బయలుదేరుతాడు. మరుసటి రోజు ఉదయం అడ్రస్ వెతుక్కుంటూ శైలజ ఇంటికి వెళ్తాడు వెంకట్. ఆ ఇల్లు పూర్తి కేరళ సంప్రదాయంలో కట్టబడి ఉంటుంది. లోపలికి వెళుతుండగానే దాదాపు 22 ఏళ్ల వయసు గల కుర్రాడు ఎవరు కావాలి అంటూ అడుగుతాడు. ( గమనిక ఇక్కడ కేరళ పాత్రలు అయినప్పటికి మనకు అర్థం కావటం కోసం వాళ్ల మాటలను తెలుగులోనే చెప్పడం జరుగుతుంది.)
వెంకట్ తను శైలజ కోసం వచ్చానని చెప్తాడు . ఆ కుర్రాడు వెంకట్ ని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్తాడు. కాసేపటికి లోపలి నుండి ఒకావిడ బయటకు వస్తుంది. తను శైలజ తల్లిని అని చెప్తుంది. నువ్వేనా వెంకట్ అంటే అని అడుగుతుంది. అవునని సమాధానం చెప్తాడు వెంకట్. అంతలోనే లోపలికి వెళ్లిన కుర్రాడు ఒక పొడవాటి కత్తితో బయటకు వస్తాడు. అది చూసిన వెంకట్ ఆశ్చర్యంతో లేచి నిలబడతాడు.  ఆ కుర్రాడి చేతిలో కత్తి తీసుకుని నా కూతురికి ఎందుకురా ఇంత అన్యాయం చేశావ్ అంటూ శైలజ తల్లి వెంకట్ ని రెండు సార్లు బలంగా అతని పొట్టలో పొడుస్తుంది.
అంతే వెంకట్ అమ్మా…. అని అరుస్తూ కింద పడిపోతాడు………..( ఇంకా ఉంది)

CLICK HERE: Episode(2) 

Written By : Aditya Telukuntla. (9848362586)

Comments

comments

Share this post

2 Replies to “లవ్ వైరస్….. ఎపిసోడ్-1,2 & 3.”

Comments are closed.

scroll to top