లవ్ వైరస్ ఎపిసోడ్…. 8

వెంకట్ ఎన్నిసార్లు కాల్ చేసినా శైలజ లిఫ్ట్ చెయకపోవడంతో మళ్లీ ఫ్లాట్ కు వచ్చిన వెంకట్ కు ఫ్లాట్ లాక్ చేసి కనబడుతుంది. వాచ్ మెన్ ను అడిగితేఆవిడ నిన్ననే వెళ్లిపోయారు అని చెప్తాడు. వెంకట్ కు శైలజ ఇల్లు కొచ్చిన్ లో అని తెలుసు గాని ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ల పేరెంట్స్ వివరాలు కూడా అంతాగా తెలియవు పేర్లు మాత్రమే తెలుసు. కొచ్చిన్ పెద్ద సిటీ అవడంతో వెంకట్ అక్కడికి వెళ్లి వెతికే ప్రయత్నం చేసినా శైలజ అడ్రస్ కనుక్కోలేక తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాడు. శైలజ ఫోన్ కు కాల్ చేయడం, కాల్ కనెక్ట్ కాకపోవడంతో వెంకట్ ఏ చేయాలో తెలియక, తను ఎందుకు అలా వెళ్లిందో అర్థం కాక ఎప్పుడూ తన గురించి, తను చివరిగా అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు.

ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న వెంకట్ శైలు.. శైలు… అని కలవరిస్తూ ఉంటాడు. డాక్టర్ వచ్చి అతనిని పరీక్షించి నర్స్ ను పిలిచి అతనికి ఇవ్వాల్సిన మెడిసిన్ గురించి చెప్పి వెళతాడు. వెంకట్ ను ట్రీట్ చేసిన డాక్టర్ శైలజ తల్లి దగ్గరకు వస్తాడు. ఆ డాక్టర్ శైలజ తల్లికి తమ్ముడు. అతనికి శైలజ,వెంకట్ ల విషయం తెలుసు. వెంకట్ గురించి శైలజ తల్లిని రూంలోకి తీసుకెళ్లి ఏదో మాట్లాడతాడు. తరువాత డాక్టర్, శైలజ తల్లి కలిసి హాస్పిటల్ కు వెళతారు. అప్పటికే వెంకట్ కాన్షియస్ లోకి వస్తాడు. డాక్టర్ ఒక్కడే వెంకట్ రూంకు వెళ్లి అతన్ని టెస్ట్ చేసి రెండు రోజులు హాస్పిటల్ లోనే ఉండాలి.
మీ వాళ్లు ఎవరైనా ఉంటే కబురు చెయ్యి అంటాడు. హైదరాబాద్ నుండి వచ్చానని, ఎవరికి చెప్పాలసిన అవసరం లేదు , ఒక్కన్నే ఉంటానని చెప్తాడు వెంకట్.

డాక్టర్ కూడా అతని గురించి ఏమీ తెలియనట్టు విని సరే అయితే ప్రస్తుతం నువ్వు కదలకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి వెళతాడు. శైలజ తల్లి దూరం నుండి ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటుంది. తరువాత డాక్టర్, శైలజ తల్లి డాక్టర్ రూంకి వెళతారు. వెంకట్ పొజిషన్ ఏంటని ఆమె డాక్టర్ ను అడుగుతుంది. స్టాబింగ్ జరిగినా కూడా లోపల ఏ ఆర్గాన్ కు తగలకపోవడంతో అతనికి ఏం అవలేదు, బ్లడ్ ఎక్కువగా పొయ్యింది, ఎక్కించాం రికవర్ అవుతాడు అని చెప్తాడు డాక్టర్. అలాగా సరే అతని బిల్ నేను పే చేస్తాను, అతన్ని మూడు రోజులు అయిపోయిన తర్వాత హైదరాబాద్ పంపించేయండి, దానికి కావల్సిన డబ్బు పంపిస్తాను అని వెళ్లిపోయింది. మూడు రోజులు వెంకట్ హాస్పిటల్ లో ఉంటాడు. అక్కడున్న వారి ద్వారా శైలజ తల్లి గురించి, ఆ కుటుంబం గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కాని అతనికి ఎవరూ ఏం చెప్పరు. త్రీ డేస్ తర్వాత డాక్టర్ వచ్చి వెంకట్ ను వెళ్లవచ్చని, నువ్వు హైదరాబాద్ వెళ్లాలంటే మేము ఏర్పాట్లు చేస్తామని అంటాడు. నేను హైదరాబాద్ వెళ్లను డాక్టర్ నాకు ఇక్కడే పనుంది అనంటాడు వెంకట్. చూడు నువ్వు ఈ పరిస్థితుల్లో మీ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవడం ముఖ్యం, ఏ పని పెట్టుకోవద్దు అనంటాడు డాక్టర్. లేదు డాక్టర్, నాకు చాలా ఇంపార్టెంట్ పనుంది, నేను ఈ ఊర్లోనే ఉండాలి, బిల్ఎంతయ్యిందో చెబితే పే చేసి వెళ్లిపోతాను అంటాడు వెంకట్. నో ప్రాబ్లమ్ బిల్ అక్కర్లేదు బట్ నువ్వు హైదరాబాద్ వెళ్లడం మంచిది అని చెప్తాడు డాక్టర్. థ్యాంక్యు, డాక్టర్ అని చెప్పి అక్కన్నుండి వెళ్లిపోతాడు వెంకట్. వెంటనే డాక్టర్ ఈ విషయం శైలజ తల్లికి ఫోన్ చేసి చెప్తాడు. వెంకట్ మళ్లీ సరాసరి శైలజ ఇంటికి వెళతాడు.

ఏంటి మళ్లీ వచ్చావ్ జరిగింది చాల్లేదా అనంటుంది శైలజ తల్లి. లేదు, చాలదు, నాకు శైలజ కనిపించేంత వరకు ఇక్కన్నుండి వెళ్లేది లేదు అని అంటాడు వెంకట్. చూడు ఇప్పటికే ఒకసారి దెబ్బతిని ఉన్నావ్ వెళ్లిపో అంటుంది శైలజ తల్లి. నేను శైలజను కలవాలి అప్పటిదాక
ఇక్కన్నుంచి వెళ్లదే లేదు అంటాడు వెంకట్. శైలజ నిన్ను కలవదు, తనకు నిన్ను కలవడం ఇష్టం లేదు అంటుంది శైలజ తల్లి. నో తను నాకు మెసేజ్ చేసింది, తనకు మీరు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నాకు తెలుసు అంటాడు వెంకట్. ఏయ్, నువ్వు ఏం చేసినా శైలజను
కలవడం కుదరదు అని చెప్పానుగా అని అంటుంది శైలజ తల్లి. నో…నేను తనను కలిసి తీరతాను, ఎక్కడ దాచారు తనని అంటూ వెంకట్, వేగంగా ఇంట్లోకి వెళ్లి అన్ని గదుల్లో వెతుకుతున్న వెంకట్ ఒక గదిలో శైలజ ఫోటోకు దండ వేసి కనబడుతుంది. వెంకట్ షాక్ అయ్యి చూస్తుంటాడు. వెనక నుండి వచ్చిన శైలజ తల్లి వైపు చూసి ఏంటిది అని అడుగుతాడు. ఆమె గట్టిగా ఏడుస్తూ అవును శైలజ చనిపోయింది అని అంటుంది. వెంటనే వెంకట్ అక్కడ గోడకు కూలబడిపోతాడు.( ఇంకా ఉంది)

Next Episode: Friday.

For Previous Episodes CLick: HERE

Comments

comments

Share this post

scroll to top