లవ్ వైరస్ ఎపిసోడ్…. 10

వెంకట్ హైదరాబాద్ చేరుకుంటాడు. హాస్టల్ కు వెళ్లి ఫ్రెష్ అప్ అవుతాడు. తనకు స్టాబింగ్ జరిగిన చోట పెయిన్ గా ఉన్నా లెక్క చేయకుండా, శైలజ గురించి కనుక్కోవాలని శైలజ కంపెనీకి వెళతాడు. అక్కడ ఆమె కొలిగ్స్ ను కలిసి అక్కడ ఎప్పుడైనా బ్లడ్ క్యాంప్ ఏదైనా జరిగిందా, లేకపోతే ఎవరైనా శైలజకు బ్లడ్ ఇచ్చారా అని కనుక్కుంటాడు. కాని అలాంటిదేమి జరగలేదని తెలుస్తుంది. అక్కన్నుంచి శైలజ కు హెచ్.ఐ.వి. పాజిటివ్ అని ముందుగా చెప్పిన హాస్పిటల్ కు వెళతాడు. అక్కడ వాళ్లతో మాట్లాడుతూ ఇదెలా వచ్చిందో తెలుసుకోవచ్చా అనడుగుతాడు. అది కుదరదని చెబుతారు వాళ్లు. వెంకట్ కు ఏ చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా మారిపోతాడు. పిచ్చిగా ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచిస్తూ పరధ్యానంగా బైక్ మీద తన హాస్టల్ దగ్గరికి వస్తాడు వెంకట్. అక్కడ అంతా గుంపుగా నిలబడి ఉంటారు. వెంకట్ అక్కడికెళ్లగానే తన ఫ్రెండ్ మనోహర్ కూడా అక్కడే ఉంటాడు.

ఏం జరిగిందని అతన్ని అడుగుతాడు వెంకట్. హాస్టల్ ముందు పార్కింగ్ లో ఉన్న బైక్ పొయ్యిందిరా, బైక్ ఓనర్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎంక్వైరీలో మన హాస్టల్ సిసి ఫుటేజ్ చూశారు, బైక్ ను దొంగతనం చేసింది మన హాస్టల్ వాడే అని తెలిసింది. వాన్ని పట్టుకుని తీసుకెళ్లారు ఇప్పుడే, అందరూ నుంచుని దాని గురించే మాట్లాడుకుంటున్నారు అని చెబుతాడు మనోహర్. వెంకట్ తన రూంకి వెళ్లి శైలజ తల్లికి కాల్ చేసి ఆంటీ ఇంతకుముందు శైలజకు ఎప్పుడైనా బ్లడ్ ఎక్కించారా, లేకపోతే తను ఎవరికైనా బ్లడ్ ఇవ్వడం జరిగిందా అని అడుగుతాడు. లేదు వెంకట్ తనకు ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా మా తమ్ముడి హాస్పిటల్ లోనే చూపించేవాళ్లం బట్ తనకు బ్లడ్ టెస్ట్ కూడా చెయ్యలేదు అంటుంది. అంతలోనే మనోహర్ వచ్చి సిసి ఫుటేజ్ భలే పట్టించిందిరా వాన్ని, ఈ సిసి కెమెరాలు వుండడం బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా క్రైం ఎంక్వైరీలకు అని అంటాడు. వెంటనే వెంకట్ కు ఏదో ఆలోచన వచ్చినట్టుగా లేచి బైక్ తీసుకుని శైలజను ట్రీట్ చేసిన హాస్పిటల్ కు వెళతాడు. అక్కడ శైలజ యాక్సిడెంట్ అయ్యి జాయిన్ అయిన రోజు సిసి ఫుటేజ్ చూస్తాడు. ఏమీ క్లూ దొరకదు.

నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫుటేజ్ చూసేసరికి వెంకట్ షాక్ అవుతాడు. ఆ ఫుటేజ్ లో రాకేశ్, డిస్పెన్సరీ నుండి మందులు తీసుకువస్తున్న సిస్టర్ తో మాట్లాడటం, తన దగ్గర ఉన్న ఏదో చిన్న బాటిల్ ను ఆమెకివ్వడం చూస్తాడు. వెంటనే వెంకట్ అక్కడ చీఫ్ డాక్టర్ దగ్గరకెళ్లి ఆ విషయం చెప్పి ఆ నర్స్ ను పిలిపించమంటాడు. బట్ నర్స్ అక్కడ జాబ్ మానేస్తుంది. అక్కడున్న వారి ద్వారా ఆమె అడ్రస్ కనుక్కుని ఆమె దగ్గరికెళతాడు. వెంకట్ ను చూసిన నర్స్ అక్కన్నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను పట్టుకుని బెదిరించిన వెంకట్ కు విషయం చెబుతుంది నర్స్. ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి నాక ఒక బ్లడ్ శాంపిల్ ఇచ్చాడు నాకు పది లక్షలు ఇస్తానని ఆ శాంపిల్ ను శైలజకు ఇచ్చే ఇంజక్షన్ లో కలిపి ఇవ్వమన్నాడు.

అంత డబ్బు నేను లైఫ్ లో ఒకేసారి ఎప్పుడూ చూడలేదు, నా ఫ్యామిలీ పొజీషన్ కూడా నేను ఆ డబ్బు తీసుకోడానికి కారణం అని, సార్ ప్లీజ్ నన్ను వదిలెయ్యండి నేను ఒప్పుకోకపోతే వేరే వాళ్లతో ఇప్పించేవాడు, ప్లీజ్ సార్ నన్ను వదిలెయ్యండి అని అంటుంది. వెంకట్ సీరియస్ గా అంతకుముందు రాకేశ్ ను అరెస్ట్ చేసిన స్టేషన్ కు వెళ్లి ఎస్.ఐ. ను కలిసి రాకేశ్ అనే వాన్ని ఎందుకు రిలీజ్ చేశారు. ఒక వైపు నిర్భయ కేస్ లు అని చిన్న ఈవ్ టీజింగ్ లకే పెద్ద శిక్ష అని చెబుతుంటే మీరు వాన్నెలా వదిలిపెడతారు. మీరు వాన్ని వదిలిపెట్టడం వల్ల ఒక అమ్మాయి చావుకు కారణం అయ్యాడు వాడు అని నిలదీస్తాడు. సారీ సార్ వాడు చాలా ఇన్ ఫ్లూయెన్స్ ఉన్న క్యాండేట్ సార్, వాళ్ల ప్రెజర్ వల్ల వాన్ని విడిచి
పెట్టవలసి వచ్చింది. ఏంటండి సారీ …? మీ ప్రెజర్ లు మీ రీజన్స్ మీరు చెప్పుకుంటూ పోతే మా జీవితాలు నాశనం అయ్యాయి సార్, నేను ఇప్పుడే ఇదంతా మీడియాలో చెబుతాను. మిమ్మల్ని, వాన్ని వదిలిపెట్టను అని అరుస్తాడు వెంకట్.

సార్.. ప్లీజ్ మీరు నా పరిస్థితి అర్థం చేసుకోండి, నేను కూడా చాలా ట్రై చేశాను బట్ నా వల్ల కాలేదు, కాని నేను మీకు ఒక హెల్ప్ చేయగలను అనంటాడు ఎస్.ఐ. ఏంటి అది అనంటాడు వెంకట్. సార్ , మీరు ఎన్ని ప్రూఫ్ లతో వాన్ని పట్టించినా వాడు ఏదో రకంగా బయటపడగలడు, అసలు వాడు డిపార్ట్
మెంట్ కు దొరకకుండా కూడా పారిపోగలడు. వెంకట్ మధ్యలో అందుకని అయితే వాడిని వదిలిస్తే మీరు వాడికి నాకు సెటిల్ మెంట్ చేస్తానంటారు అంతేనా ఎందుకండి ఇంత చచ్చు వెదవలు పోలీసులు అవడం అంటాడు. నో.. సార్ మొత్తం వినండి, మీరు వాన్ని పట్టుకుందామంటే కూడా వాడు
మీకు దొరకడు బట్ తీసుకువచ్చి మీకు అప్పజెబుతాను అనంటాడు. సరే అని చెప్పిన వెంకట్ ఎస్.ఐ. కాల్ కోసం ఎదురు చూస్తుంటాడు.

love 10

ఒక రోజు ఈవినింగ్ ఎస్.ఐ. వెంకట్ కు కాల్ చేసి సార్ వాడు దొరికాడు అని చెబుతాడు. హైదరాబాద్ శివార్లలో చీకటి సమయంలో ఎస్.ఐ., రాకేశ్ ను ఇంచు కూడా కదల్లేని స్థితిలో బందించి వెంకట్ దగ్గరకు తీసకువస్తాడు.  రాకేష్ ను చూడగానే ఆవేశం ఆపుకోలేని వెంకట్ ఇష్టం వచ్చినట్టు కొడతాడు..చావు దెబ్బలు తిన్న రాకేష్ వికృతంగా నవ్వి అది ఎవ్వరికీ దక్కొద్దని క్వాలీస్ తో గుద్దాను అయినా బ్రతికిపోయింది. కానీ  ఒక్కసారిగా చంపడం కన్నా…HIV బ్లడ్ ఎక్కించి… నరకం చూపాలనుకున్నా..జీవితాంతం కుమిలికుమిలి చచ్చిపోయేలా ప్లాన్ చేశా..కానీ పిరికిది ఆత్మహత్య చేసుకొని బతికిపోయింది. అని ఏదో గర్వంతో అంటాడు రాకేష్..ఈ మాటలకు మరింత కోపోద్రిక్తుడైన వెంకట్ మరో సారి ఓపికున్నంత వరకు రాకేష్ ను కొడతాడు. అలా కొట్టిీ కొట్టీ సార్  నాతో పాటు కొచ్చిన్ వరకు వస్తారా అని  S. I ని అడుగుతాడు వెంకట్ . వస్తా అంటాడు ఎస్.ఐ.. రాకేశ్ ను వెహికిల్ లో కొచ్చిన్ కు తీసుకెళ్లి కసి తీరా కొట్టిన వెంకట్ చివరకు శైలజ తల్లి ఇచ్చిన కత్తితో పొడిచి చంపి శైలజ సమాధి ముందు కాల్చి బూడిద చేస్తారు. శైలజ సమాధి దగ్గర ఏడుస్తూ కూర్చుండిపోతాడు వెంకట్. వెంకట్ ను అక్కన్నుండి తీసుకెళతారు ఎస్.ఐ. , శైలజ తల్లి. శైలజ ఇంటి నుండి హైదరాబాద్ కు బయలుదేరుతున్న వెంకట్ ను శైలజ తల్లి, వెంకట్, శైలజ కు సంబంధించిన ఏ వస్తువులు గాని, ఫోటోస్ గాని నీ దగ్గరుంటే అవి నీ దగ్గర లేకుండా నాకిచ్చేసి వెళ్లు అంటుంది. ఆంటీ ఏంటలా మాట్లాడుతున్నారు అంటాడు వెంకట్. అవును వెంకట్ తనను నువ్వు మర్చిపోవాలి. ఆమె ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి, కొత్త జీవితంలోకి వెళ్లాలి ఎందుకంటే నిన్ను నమ్ముకుని నీ కుటుంబం ఉంది అంటుంది శైలజ తల్లి.

శైలజ కు సంబంధించిన ఫోటోస్, వస్తువులిస్తూ, ఆంటీ ఇవైతే ఇవ్వగలను కాని తనను మరిచిపోవడం నా వల్ల కాదు అంటాడు వెంకట్. ఒక్కసారి ఇంటికి వెళ్లి మీ అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడు వెంకట్ తరువాత ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది అంటుంది శైలజ తల్లి. వెంకట్ అక్కన్నుండి వెళ్లిపోతాడు. ప్రేమించే మనుషులు దూరమవ్వచ్చు గాని ప్రేమ ఎప్పటికి దూరం అవదు, మనమే దూరమయ్యిందని బాధపడతాం, మళ్లీ ఎక్కడో ప్రేమను పొంది దగ్గరయ్యిందనుకుంటాం.( సమాప్తం)

Previous Episodes Click :HERE

రచయిత గురించి: ఆదిత్య…యువ కథా రచయిత. రెండేళ్లు మీడియా రంగంలో పనిచేసిన ఆదిత్య తనకిష్టమైన సినిమా రంగంలోకి వెళ్లడానికి తన పెన్ కు పనిచెప్పాడు. ఎన్నో కథలను రాసుకున్నాడు. ప్రతి కథలో వైవిధ్యం ఇతడి ప్రత్యేకత. ఇతడి కథలలో ప్రాధాన విశిష్టత ఏంటంటే… ఇతను కథ చెబుతుంటే పాత్రలు సజీవంగా  కళ్ళముందు కదలాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇటువంటి ఫ్రెష్ స్టోరీ రైటర్ల ల కథలతో పూర్తి స్థాయి సినిమాలు తెరకెక్కితే….తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ ఫ్రెష్ లుక్ వస్తుంది. కోట్లకు కోట్లు బడ్జెట్ లు పెట్టాల్సిన అవసరం లేని  ఫీల్ గుడ్ మూవీని అందించే కథలు ఇలాంటి ఎందరో యువ రచయితల  వద్ద ఉంటాయి. డైరెక్టర్లు వీరిని ప్రోత్సాహిస్తే సినిమా బాగుపడుతుంది. అండ్  త్వరలోనే యువ రచయిత ఆదిత్య రాసిన  రెండు జంటల అందమైన ప్రేమ కథ అయిన              (బొమ్మల కథ )  ను మీ ముందుకు తీసుకువస్తాం.

 Aditya :  9848362586

Note: త్వరలోనే లవ్ వైరస్ స్టోరికి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ Pdf ద్వారా మీ వాట్సాప్ కు పంపాలనుకుంటున్నాం.  మీకు లవ్ వైరస్ పూర్తి స్టోరి కావాలనుకుంటే..మీ వాట్సాప్ నెంబర్ నుండి 7997192411 అనే మా నెంబర్  కు START అని వాట్సాప్ మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top