సెలవుల్లో ఊరికి వచ్చా…అప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ చెల్లిని చూసా..! ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా ఇద్ద‌రం క‌లిసి

”నా పేరు నరసింహ. హైద‌రాబాద్‌లోని ఇఫ్లూలో ఇంగ్లిష్‌లో ఎంఫిల్ పూర్తి చేశా. పీహెచ్‌డీ చేయాల‌నేది నా క‌ల‌. అయితే అందుకు కొంత స‌మ‌యం ఉండ‌డంతో ఆ గ్యాప్‌లో మా ఊరు వెళ్లా. మాది ఓ ప‌ల్లెటూరు. చాలా అంద‌మైన గ్రామం. ప‌చ్చ‌ని ప్ర‌కృతి వాతావ‌ర‌ణానికి నెలవుగా ఉంటుంది. మా ఊర్లో ఉంటే నాకు అస్స‌లు స‌మ‌య‌మే తెలియ‌దు. నాకు ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో రాజు అనే అత‌ను నాకు క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడూ మేమిద్దరం క‌లిసే తిరిగే వాళ్లం. అత‌నికి ఓ చెల్లి ఉండేది. ఆమె పేరు ర‌జిత‌. నేను కాలేజీ చ‌దివే రోజుల్లో ఆమె స్కూల్‌లో చ‌దివేది. అప్ప‌ట్లో ఆమె నాకు అంత‌గా ప‌రిచయం లేదు. అయితే ఉన్న‌త చ‌దువుల‌కు నేను న‌గ‌రానికి వెళ్లాక అప్ప‌డ‌ప్పుడు ఊరికి వ‌చ్చి రాజుతో తిరుగుతుంటే ర‌జితతో నాకు ప‌రిచయం ఏర్ప‌డింది. అది కాస్తా స్నేహంగా మారింది.

రాజుతో వెళ్లిన‌ప్పుడ‌ల్లా ర‌జిత న‌న్ను అదో ర‌కంగా చూసేది. చూస్తుంటే ఆమె న‌న్ను ప్రేమిస్తుంది కాబోలు అనుకునే వాన్ని. అదే నిజ‌మైంది. మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం ప్రేమ‌గా మారింది. ఓ రోజున వ‌చ్చి నాకు ఐ ల‌వ్ యూ చెప్పింది. అందుకు నేను స్పందించ‌లేదు. ఆ త‌రువాత ఆమె ఎప్పుడు క‌న‌బ‌డినా నాకు ఐ ల‌వ్ యూ చెప్పేది. కానీ నేను ఏమీ మాట్లాడ‌లేక‌పోయేవాన్ని. ఎందుకంటే ఆమె అన్న‌య్య రాజు నా క్లోజ్ ఫ్రెండ్ క‌నుక ఆమెను ప్రేమిస్తే ఆ విష‌యం అత‌నికి తెలిస్తే నాకు, అత‌నికి మ‌ధ్య ఉన్న స్నేహం పోతుంద‌ని అనుకునేవాన్ని. ఓ రోజున అదే విష‌యం ర‌జిత‌కు చెప్పా. రోజూ ఐ ల‌వ్ యూ చెబుతున్నా నువ్వు ఎందుకు స్పందించ‌డం లేదు అని ఆమె అడిగే స‌రికి అందుకు ఆ విష‌యం చెప్పేశా. దీంతో ఆమె కంట‌త‌డి పెట్టుకుంది. అది చూసి నాకు మ‌న‌స్సు చ‌లించిపోయింది.

అలా కొన్ని రోజులు గ‌డిచాక ఎందుకో నాకు ర‌జిత‌ను చూడ‌కుండా ఉండ‌బుద్ది కాలేదు. ఆమెతో మాట్లాడాల‌ని, ఆమెతో ఉండాల‌ని అనిపించింది. రాజుతో వెళ్లిన‌ప్పుడు టైం దొరికితే ఆమెతో మాట్లాడేవాన్ని. ఒక్కోసారి ఆమె మా ఇంటికి వ‌చ్చేది. కొన్నిసార్లు ఇద్ద‌రం బ‌య‌ట క‌లుసుకునేవాళ్ల‌. గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుకునే వాళ్లం. ఫోన్‌లో సంభాష‌ణ‌లు స‌రే స‌రి. చివ‌ర‌కు ఓ రోజున త‌న స‌ర్వ‌స్వం ఆమె నాకు స‌మ‌ర్పించింది. అలా కొన్నిరోజులు గ‌డిచాయి. చివ‌ర‌కు మా ప్రేమ విష‌యం ఇద్దరి ఇండ్ల‌లో తెలిసింది.

అప్పుడే ఇద్ద‌రం ఎక్క‌డికైనా వెళ్లిపోదామ‌నుకున్నాం. ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా ఇద్ద‌రం క‌లిసి బ‌స్ ఎక్కి హైద‌రాబాద్ చేరుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. పెద్ద‌ల‌ను ఎదరించి వ‌చ్చినందున మా వైపు, అటు ర‌జిత వైపు కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రూ మాతో మాట్లాడ‌లేదు. దీంతో రజిత మ‌న‌స్సు చివుక్కుమంది. మ‌రో వైపు నా ప్రాణ స్నేహితుడు అయిన రాజు కూడా నాతో మాట్లాడ‌డం మానేశాడు. అయినా ఏం చేస్తాం. పెద్ద‌లు కాదంటే మ‌న జీవితాల‌ను నాశ‌నం చేసుకోలేం క‌దా. ఎవ‌రినో ఒక‌ర్ని పెళ్లి చేసుకుని జీవితాంతం న‌ర‌కం అనుభ‌వించ‌లేం క‌దా. అందుకే ఇద్ద‌రం ధైర్యం చేశాం. పెళ్లి చేసుకున్నాం. నేను ప్ర‌స్తుతం పీహెచ్‌డీ చేస్తున్నా. నా భార్య ర‌జిత స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. ప్ర‌స్తుతం ఇద్ద‌రం చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఒక్క‌టే బాధ‌. మా ఇద్ద‌రికీ ఇప్పుడు నా అన్న‌వారు ఎవ‌రూ లేరు. నాకు ర‌జిత‌, ర‌జిత‌కు నేను. అంతే. ఎప్ప‌టికైనా ఇరు వ‌ర్గాల పెద్ద‌ల నుంచి పిలుపు అందదా అన్న ఆశతో ఎదురు చూస్తున్నాం. వారిని క‌లిసే రోజు త్వ‌ర‌లోనే రావాల‌ని కోరుకుంటున్నా.”

Comments

comments

Share this post

scroll to top