స‌బ్ క‌లెక్ట‌ర్‌… ఎమ్మెల్యే… ప్రేమించుకున్నారు..! ఇదొక వెరైటీ పొలిటిక‌ల్ ల‌వ్ స్టోరీ..!

రొమాంటిక్ లవ్ స్టోరీ… క్రైమ్ ల‌వ్ స్టోరీ… కామెడీ ల‌వ్ స్టోరీ… ఇలా మ‌నం వివిధ ర‌కాలైన ప్రేమ క‌థ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూశాం. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది మాత్రం వెరైటీ ల‌వ్ స్టోరీ..! అదొక పొలిటిక‌ల్ ప్రేమ క‌థ‌..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగినికి, ఎమ్మెల్యేకు మ‌ధ్య న‌డిచిన ల‌వ్ స్టోరీ ఇది. అయితే ఇది సినిమా క‌థో, క‌ల్పిత క‌థో కాదు, రియ‌ల్ ల‌వ్ స్టోరీ..! పెద్ద‌లు ఒప్పుకోవ‌డంతో ఈ స్టోరీ సక్సెస్ కూడా అయింది. ఇంత‌కీ ఇది జ‌రిగింది ఎక్క‌డంటే..?

అది కేర‌ళలోని తిరువ‌నంతపురం. ఆయ‌న పేరు కేఎస్ శ‌బ‌రినాథ‌న్‌. 2016 ఎన్నిక‌ల్లో అక్క‌డి అరువిక్క‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అయితే తిరువ‌నంత‌పురంకే చెందిన స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య ఎస్ అయ్య‌ర్ తో ఈయ‌న ప్రేమ‌లో ప‌డ్డారు. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్నా అది బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. కేవ‌లం పుకారులా ప్ర‌చార‌మైంది. అయితే ఆ వార్త‌ల‌కు ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్ తెర దించారు. తాజాగా త‌న ల‌వ్ స్టోరీ గురించి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటోల‌తో స‌హా పోస్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాను తిరువ‌నంత‌పురం స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య ఇద్ద‌రం గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నామ‌ని, త‌మ ప్రేమ విష‌యం ఇంట్లో చెప్ప‌గా అందుకు త‌మ పెద్ద‌లు కూడా అంగీక‌రించార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడీ వార్త సెన్సేష‌న‌ల్ అయింది.

దివ్య సీఎంసీ వెల్లూర్‌లో ఎంబీబీఎస్ చేసి అనంత‌రం సివిల్స్ రాసి ఐఏఎస్‌గా ఎంపికైంది. 2013లో ఆమె ఆ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టింది. ఆ త‌రువాత ఓ కార్య‌క్ర‌మంలో క‌లిసిన ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య ఇద్దరూ ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో వారి కుటుంబ స‌భ్యులు కూడా అందుకు అడ్డు చెప్ప‌క‌పోవ‌డంతో ఇప్పుడు వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. అయితే మీకో విష‌యం తెలుసా..? శ‌బరినాథ‌న్ తండ్రి కార్తికేయ‌న్ ది కూడా ప్రేమ వివాహ‌మే. కాక‌పోతే అప్ప‌ట్లో ఆయ‌న ప్రేమ‌కు పెద్ద‌లు అడ్డు చెప్పారు. దీంతో ఆయ‌న ప్రేమించిన యువ‌తితో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడా స‌మ‌స్య అత‌ని కొడుక్కి ఎదురు కాలేదు. ఈ క్ర‌మంలో కార్తికేయ‌న్ ప్రేమ క‌థ‌ను కేర‌ళ‌లో సినిమాగా తీశారు కూడా. దాని పేరు న‌య‌మ్ వ్య‌క్త‌మ‌క్కున్న. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ఆ సినిమాలో హీరో. కార్తికేయ‌న్ కూడా రాజ‌కీయాల్లో రాణించారు. ఆయ‌న కేర‌ళ అసెంబ్లీ స్పీక‌ర్ గా కూడా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలోనే తండ్రి కొడుకులిద్దరి ల‌వ్ స్టోరీలు మ్యాచ్ కావ‌డం, ఇద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉండడం యాదృచ్ఛికంగానే జ‌రిగిపోయాయి. దీంతో ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్ ల‌వ్ స్టోరీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

comments

Share this post

scroll to top