అమ్మ‌త‌నం చాటే….ప్ర‌తి చార‌ను ప్రేమించండి.!

తండ్రిగా మారిన భ‌ర్త‌ల‌కు……
మీ భార్య పొత్తిక‌డుపు మీద క‌నిపించే చార‌ల‌ను చూసి అస‌హ్యించుకోకండి…అవి పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం కోసం మీ భార్య ప‌డ్డ ప్ర‌స‌వ వేద‌న తాలూకు గుర్తుల‌వి.! మీ ప్రేమకు- రేప‌టి మీ జీవితానికి తీయ్య‌ని జ్ఞాప‌కాల‌వి .!! అమ్మ‌త‌నం చాటే….ప్ర‌తి చార‌ను ప్రేమించండి.

గుర్తుంచుకొండి పెళ్ళికి ముందు …మీ భార్య ఎంత అందంగా ఉందో , ఇప్పుడూ అంతే అందంగా ఉంది అమ్మ‌త‌నంతో….! ప్రెగ్నెన్సీ త‌ర్వాత లావెక్కింద‌ని మీ భార్య ప‌ట్ల చుల‌క‌న‌గా మాట్లాడ‌కండి…జ‌స్ట్ గుర్తుంచుకోండి…. అది మీ తాలూకు జ‌న్యువును 9 నెల‌లుగా మోసిన కార‌ణంగా వ‌చ్చిన లావ‌ని.!!

ఎప్ప‌టికీ మ‌ర‌వ‌కండి…. లేబ‌ర్ రూమ్ లో డెలివ‌రీ టైమ్ లో తాను అరిచే అరుపులు మీ ప‌ట్ల ప్రేమ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నాల‌ని..
ఇప్ప‌టికే మీ కోసం ఇన్ని క‌ష్టాల‌ను ఇష్టంగా భ‌రిస్తున్న మీ భార్య‌ల‌ను ఏ విష‌యంలోనైనా బాధ‌పెట్ట‌కండి. భ‌రోసాగా ఉండండి…అంద‌మైన భ‌విష్య‌త్ మీ  కాళ్ల‌ కిందే ఉంటుంది.

#అమ్మ‌లంద‌రికీ అంకింతం.

Comments

comments

Share this post

scroll to top