మెట్రోలో పర్సు పోగొట్టుకున్నాడు…10 రోజుల త‌రువాత అతనికి ఏమని లెటర్ వచ్చిందో తెలుసా..?

సాధార‌ణంగా మ‌నం ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు లేదా బ‌య‌ట తిరిగేట‌ప్పుడు ప‌ర్సులు, ఫోన్లు, బ్యాగ్‌లు, డ‌బ్బు తదిత‌ర వ‌స్తువుల‌ను పోగొట్టుకుంటే ఇక అప్పుడు మ‌న‌కు క‌లిగే బాధ గురించి మాటల్లో చెప్ప‌లేం. కొంత జాగ్ర‌త్త‌గా ఉంటే అవి పోయి ఉండేవి కాదు క‌దా అనిపిస్తుంది. దీంతో ఒకింత మాన‌సిక ఆందోళ‌న‌కు కూడా మ‌నం గుర‌వుతుంటాం. అయితే అలా పోయిన వ‌స్తువులు ఏవీ కూడా దాదాపుగా మ‌న‌కు మ‌ళ్లీ దొర‌క‌వు. అలా దొరికాయంటే ఇక మ‌న‌కు ల‌క్ బాగా ఉన్న‌ట్లే లెక్క‌. ఢిల్లీకి చెందిన ఆ వ్య‌క్తికి కూడా ల‌క్ బాగా ఉంది. క‌నుక‌నే తాను పోగొట్టుకున్న వ‌స్తువుల‌ను తిరిగి పొందాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అత‌ని పేరు గుర్‌ప్రీత్ సింగ్‌. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలోని సెంట్రల్ సెక్ర‌టేరియట్ నుంచి ల‌జ్‌ప‌త్‌న‌గ‌ర్ కు మెట్రో రైల్‌లో ప్ర‌యాణం చేశాడు. అయితే ట్రెయిన్‌లో అత‌ను త‌న ప‌ర్సును పోగొట్టుకున్నాడు. ఆ విష‌యం అత‌నికి ట్రెయిన్ దిగాక తెలిసింది. దీంతో మెట్రో అధికారుల‌కు విష‌యం చెప్ప‌గా వారు ట్రెయిన్‌లో సిబ్బందితో వెదికించారు. అయినా గుర్‌ప్రీత్ సింగ్ ప‌ర్సు దొర‌క‌లేదు. దీంతో అత‌ను చేసేది లేక వెనుదిరిగాడు. త‌న ప‌ర్సు ఇక పోయిన‌ట్టేన‌ని అనుకుని ఇంటికి చేరుకున్నాడు.

అలా గుర్‌ప్రీత్ సింగ్ ప‌ర్సును పోగొట్టుకున్నాక‌, 10 రోజుల‌కు తాజాగా అతనికి ఇండియా పోస్టులో ఓ పార్శిల్ వ‌చ్చింది. అందులో తాను పోగొట్టుకున్న ప‌ర్సు ఉంది. ప‌ర్సులో డెబిట్ కార్డులు, రూ.516 న‌గ‌దు, మెట్రో కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉన్నాయి. త‌న ఐట‌మ్స్ అన్నీ ప‌ర్సులో అలాగే ఉన్నాయి. ఏవీ మిస్ కాలేదు. దీంతో థాంక్ గాడ్ అనుకున్నాడు. త‌న ప‌ర్సును పంపిన వ్య‌క్తి సిద్ధార్థ మెహ‌తాకు అత‌ను కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. అయితే పార్శిల్‌లో సిద్ధార్థ మెహ‌తా ఓ లెట‌ర్‌ను పెట్టాడు. తన‌కు దొరికిన వ‌స్తువుల లిస్ట్‌ను లెట‌ర్‌లో రాయ‌డంతోపాటు ఇంకోసారి ప‌ర్సు పోగొట్టుకోకు, జాగ్ర‌త్త‌గా ఉండు మిత్ర‌మా అంటూ అత‌ను గుర్‌ప్రీత్ సింగ్‌కు లెట‌ర్ రాశాడు. దీంతో ఇదే విష‌యాన్ని గుర్‌ప్రీత్ సింగ్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది. ఏది ఏమైనా పోగొట్టుకున్న ప‌ర్సు మ‌ళ్లీ దొర‌కడం అంటే.. నిజంగా గుర్‌ప్రీత్ సింగ్‌కు ల‌క్ బాగా ఉన్న‌ట్లే క‌దా.

Comments

comments

Share this post

scroll to top