కైలాస‌గిరి కొండ‌ల్లో శివుడి ముఖం ప్ర‌త్య‌క్షం.!? శాటిలైట్ ఫొటోల‌ను తీసిన గూగుల్‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో అనేక మ‌తాల‌కు చెందిన దేవుళ్ల‌ను ఆరాధించే ప్ర‌జ‌లు ఉన్నారు. కొంద‌రు నాస్తికులు కూడా ఉన్నార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే భూమిపై జీవిస్తున్న‌ చాలా మందిలో ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా ఏదో ఒక దేవున్ని పూజిస్తారు. ఇక మ‌న ద‌గ్గ‌ర ప్ర‌ధానంగా హిందువుల విష‌యానికి వ‌స్తే శివుడు, విష్ణువు లాంటి దేవుళ్ల‌ను ఆరాధించే వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఎవ‌రు ఎవ‌ర్ని పూజించినా తమ కష్టాల‌ను పార‌దోల‌మని, త‌మ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండాల‌ని దేవున్ని వేడుకుంటారు. దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై వ‌రాలు ఇవ్వ‌డ‌ని తెలిసినా పూజిస్తారు. ఎందుకంటే అదో న‌మ్మ‌కం. కానీ నిజంగా దేవుడు ప్ర‌త్య‌క్ష‌మైతే..? అవును, మీరు విన్నది నిజ‌మే. దేవుడు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అదెవ‌రో కాదు శివుడు. అలా అని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కొన్ని ఫొటోలు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌కీ ఏంటా ఫొటోలు..?

shivas-face

టిబెట్‌లో ఉన్న మౌంట్ కైలాష్ ప‌ర్వ‌త శ్రేణి గురించి తెలుసు క‌దా. దాదాపు 6718 మీట‌ర్ల ఎత్తు ఉంటాయి ఆ ప‌ర్వ‌తాలు. ఈ ప్ర‌దేశాన్ని సాక్షాత్తూ శివుడి నివాస స్థ‌లంగా కూడా పేర్కొంటారు. ఎంతో మంది హిందువులు, బుద్ధ స‌న్యాసులు, జైనులు ఈ ప‌ర్వ‌తాల‌కు వ‌చ్చి కొద్ది రోజులు గ‌డిపి త‌మ ఇష్ట‌దైవ‌మైన శివున్ని ప్రార్థించి మ‌రీ వెళ్తుంటారు. అయితే ఈ ప‌ర్వ‌తాల‌ను గూగుల్ మ్యాప్స్ శాటిలైట్లు ఇటీవ‌ల ఫొటో తీశాయి. ఆ ఫొటోల్లో ఓ అద్భుతం చోటు చేసుకుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. అదేమిటంటే…

shiva-face

గూగుల్ శాటిలైట్లు ఈ ప‌ర్వ‌తాల‌ను ఫొటోలు తీసిన‌ప్పుడు ఆ కొండ‌ల‌పై శివుని ముఖం క‌నిపించింద‌ట‌. ఫొటోల్లో శివుని ముఖాన్ని కూడా స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చంటూ దానికి చెందిన ఫొటోలు కొన్ని ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. శివుడి బొమ్మ కనిపించిన‌ప్పుడే గూగుల్ శాటిలైట్లు ప‌లు కోణాల్లో తీసిన ఫొటోల్లోనూ శివుడి ముఖం స్ప‌ష్టంగా క‌నిపిస్తుందంటూ ప‌లువురు ఆ ఫొటోల‌ను చూసి చెబుతున్నారు. సాధార‌ణంగా ఏదైనా మేఘం అడ్డం వ‌చ్చిన‌ప్పుడు దాని నీడ భూమిపై ప‌డుతుంది క‌దా, అలాగే ఆ కొండ‌ల‌పై ఆ ముఖం క‌నిపించిందంటూ ప‌లువురు దీన్ని కొట్టి పారేస్తున్నారు. కానీ కొంద‌రు మాత్రం సాక్షాత్తూ శివుడే ఆ కొండ‌ల్లో ఉన్నాడ‌ని, అందుకే ఆయ‌న ముఖం అక్క‌డ క‌నిపించింద‌ని చెబుతున్నారు. అన్ని సోష‌ల్ సైట్ల‌లోనూ ఈ ఫొటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..!

shiva-god-face

Comments

comments

Share this post

scroll to top