“షోయబ్ మాలిక్”తో పెళ్లికి ముందే…”సానియా మీర్జా” కు ఇతనితో ఎంగేజ్మెంట్ అయ్యింది తెలుసా.? మరెందుకు కాన్సల్?

ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఈమె గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటుంది. అయితే టెన్నిస్‌ క్రీడాకారిణిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడు సానియా మీర్జాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఎన్నో టైటిళ్లను ఆమె సాధించడంతో టెన్నిస్‌ క్రీడలో పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010 ఏప్రిల్‌ 12న వివాహం చేసుకుంది. అయితే నిజానికి మీకు తెలుసా..? సానియా మీర్జాకు షోయబ్‌ మాలిక్‌తో వివాహం కాక ముందు మరొక వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ అయింది. కానీ ఆ వివాహం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఎందుకంటే…

షోయబ్‌ మాలిక్‌తో సానియాకు పెళ్లి కాక ముందు తన చిన్న నాటి స్నేహితుడు సోహ్రబ్‌ మీర్జాతో ఎంగేజ్‌మెంట్‌ అయింది. అయితే ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా సోహ్రబ్‌ తండ్రి సానియాతో అన్నాడట. పెళ్లాయ్యక టెన్నిస్‌ ఆడరాదని. ఈ విషయం సానియాకు నచ్చలేదు. ఆ క్రమంలోనే ఆస్ట్రేలియాలో జరిగిన టెన్నిస్‌ టోర్నమెంట్‌కు కూడా సానియా వెళ్లింది. అయితే అప్పుడే అక్కడ పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా టూర్‌లో ఉంది. ఆ జట్టుతో పాకిస్థాన్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. అదే సమయంలో ఆ జట్టు క్రీడాకారుడు అయిన షోయబ్‌ మాలిక్‌ తో సానియాకు పరిచయం ఏర్పడింది.

అంతే…. షోయబ్‌ మాలిక్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో సానియా సోహ్రబ్‌తో జరిగిన తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంది. అనంతరం షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకుంది. ఆ తరువాత కూడా టెన్నిస్‌ మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. అదీ.. ఆమె మొదటి ఎంగేజ్‌మెంట్‌ వెనుక ఉన్న విషయం. అవును మరి.. ఆడ, మగ ఎవరికైనా కెరీర్‌ ముఖ్యం కదా. పెళ్లి అయినా , కాకున్నా కెరీర్‌ కొనసాగించాల్సిందే. దాన్ని ఎవరూ ఆపరాదు. ఆపితే రిజల్ట్‌ ఇలాగే ఉంటుంది..!

 

Comments

comments

Share this post

scroll to top