ప్రమోషన్స్ బాగా చేసారు..మరి సినిమా హిట్టా..? “లండన్ బాబులు” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

Movie Title (చిత్రం): లండన్‌ బాబులు (London Babulu)

Cast & Crew:

 • నటీనటులు: ర‌క్షిత్‌(ప‌రిచ‌యం), స్వాతి, ఆలి, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, స‌త్య‌ ధ‌న‌రాజ్‌, అజ‌య్ ఘోష్, సాయి, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు
 • సంగీతం: కె
 • నిర్మాత: మారుతి దాసరి
 • దర్శకత్వం: చిన్ని కృష్ణ

Story:

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Review:

వీడు తేడా’,’బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు చిన్ని కృష్ణ ఎంచుకున్నది ఓ తమిళ్ సినిమా రీమేక్ అయినప్పటికీ మన తెలుగు నేటివిటీ తో ఎంటర్ టైనింగ్ గా దాన్ని మలిచాడు. మెసేజ్ తో కూడిన స్టోరీని సింపుల్ అండ్ స్వీట్ గా తెరకెక్కించి దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకూ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేస్తుంది. అలా ఒక రీమేక్ సినిమా అనే ఫీలింగ్ కలగకుండా సినిమాను డీల్ చేశాడు దర్శకుడు.
రక్షిత్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాడు. రక్షిత్ క్యారెక్టర్, ఫస్టాఫ్ లో వచ్చే సత్య కామెడీ, సెకండ్ హాఫ్ లో అలీ-సత్య కృష్ణ మధ్య వచ్చే కామెడీ సీన్స్, క్యారెక్టర్స్, సాంగ్స్, రక్షిత్-స్వాతి మధ్య వచ్చే సీన్స్, ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో జరిగే అవకతవకలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా, అక్కడక్కడ కాస్త బోర్ కొట్టించే సీన్స్ సినిమాకు మైనస్.

Plus Points:

 • కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే
 • రక్షిత్ నటన
 • కామెడీ
 • సినిమాటోగ్రఫీ
  బ్యాగ్రౌండ్ స్కోర్
 • డైలాగ్స్

Minus Points:

 • ఎడిటింగ్
 • కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం.

Final Verdict:

ఓ చక్కని మెసేజ్ తో కూడిన ఫన్ మూవీగా ‘లండన్ బాబులు’ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది .

AP2TG Rating: 3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top