లోకం – గీతోప‌దేశం

ఈ లోకానికి దేవుడు ఇచ్చిన వ‌రం. అద్భుత‌మైన కానుక‌.శ్రీ‌కృష్ణుడు ఉప‌దేశించిన జీవిత సార‌మే భ‌గ‌వ‌ద్గీత‌. ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తిదీ ఇందులో ఉంది. గీతలో లేనిదంటూ ఏమీ లేదు. ప్రపంచంలోని ప్ర‌తి భాష‌లోకి గీతోప‌దేశం అనువ‌దించ‌బ‌డింది. గోర‌ఖ్ ప్రెస్ త‌క్కువ ధ‌ర‌లో ప్ర‌తి భార‌తీయుడికి .ప్ర‌తి కుటుంబానికి చేరుకునేలా పుస్త‌కాల‌ను ముద్రించింది. అందేలా.చ‌దువుకునేలా చేసింది. ఎన్నో ఆల‌యాలు శ్రీ‌కృష్ణుడి పేరుతో వెలిశాయి. ఏకంగా ఇస్కాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ లోక‌మంత‌టా విస్త‌రించింది. స‌ముద్రంలా అల్లుకు పోయింది. ఆకాశంలా వెలుగు దివ్వెల‌ను ప్ర‌స‌రింప చేస్తోంది. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను భ‌గ‌వ‌ద్గీత ప్ర‌భావం చేసినంత‌గా ఇంకే గ్రంథం చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

bhagavath geetha

మ‌హాత్మా గాంధీ చేతిలో ఎప్పుడూ భ‌గ‌వ‌ద్గీత ఉండాల్సిందే. అంత‌గా ఆయ‌న ప్ర‌భావితం అయ్యారు. జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తి స‌మ‌స్య‌కు గీత ప‌రిష్కారం చూపిస్తుంది. ఏ ముహూర్తంలో శ్రీ‌కృష్ణుడు ఉపేద‌శం చేశాడో అదే మార్గ‌ద‌ర్శ‌గా.దీపదారిగా చ‌రిత్ర‌లో నిలిచి పోయింది. స్వాతంత్ర పోరాట స‌మ‌యంలో బాల‌గంగాద‌ర్ తిల‌క్ భ‌గ‌వ‌ద్గీతను అనువాదం చేసి.కోట్లాది ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా చేశారు. కొన్ని త‌రాలు గ‌డిచినా.టెక్నాల‌జీ మారినా.అంత‌రిక్షంలోకి వెళ్లినా భ‌గ‌వ‌ద్గీత మార‌లేదు. దాని సారం నిత్య వ‌సంత‌మై చిగురిస్తూనే ఉన్న‌ది. ఎంద‌రికో వెలుగులు పంచుతోంది. గురువులా బోధిస్తుంది. తండ్రిలా హెచ్చ‌రిస్తుంది. త‌ల్లిలా లాలిస్తుంది. స్నేహితుడిలా దారిని చూపిస్తుంది. ప్ర‌తి సంద‌ర్భంలోను.ప్ర‌తి సంఘ‌ట‌న‌లోను భ‌గ‌వ‌ద్గీత ఒక చేతిక‌ర్ర‌లా మ‌న‌కు ఉప‌యోగ ప‌డుతుంది. దేశంలోని ప్ర‌తి గుడిలో గీతోప‌దేశం వినిపిస్తూనే ఉంటుంది. కోట్లాది భ‌క్తుల హృద‌యాల మైదానాల మీద చెర‌గ‌ని ముద్ర వేసింది.గీత‌. గీత అంటే ఉప‌దేశం మాత్ర‌మే కాదు.ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డే అల‌. కెర‌టాలు క‌ష్టాల‌లాగా క‌మ్ముకుంటాయి. కానీ ఒక్క‌సారి గీతోప‌దేశం విన్నా.మ‌న‌స్సు పెట్టి చ‌దివితే అది ఇచ్చే ఆనందం.సంతోషం.శ‌క్తి.ఇంకేదీ ఈ లోకంలో ఇవ్వ‌దు. తెలుగులో భ‌గ‌వ‌ద్గీత‌కు అత్యంత ప్రాచుర్యం తీసుకువ‌చ్చిన ఘ‌న‌త అమ‌ర గాయ‌కుడు ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర్‌రావు గారికే ద‌క్కుతుంది. గీత ప్ర‌పంచ‌మంత‌టా వ్యాపించాల‌నే ఉద్ధేశంతో ఎన్నో ప్రాజెక్టులు న‌డుస్తున్నాయి. వేలాది మంది రీసెర్చ్ చేస్తున్నారు. ఒక్కో ప‌దం.అత్యంత శ‌క్తివంత‌మైన‌ది.బ‌లాన్ని ఇచ్చేదిగా పేరొందింది.

పుట్టుక‌.చావు స‌మాన‌మేన‌ని.స‌మ‌దృష్టితో చూస్తే అంతా మ‌ట్టేన‌ని తెలియ చేస్తుంది భ‌గ‌వ‌ద్గీత. కార్పొరేట్ కంపెనీలు.స‌క్సెస్ సాధించిన వ్య‌క్తులు, వ్యవ‌స్థ‌లు , సంస్థ‌లు. వ్యాపార‌వేత్త‌లు.గెలుపొందిన విజేత‌లపై గీత ప్ర‌భావితం చేసిందే. అందులోని వాక్యాల‌ను ప్ర‌తి షాపు ముందు రాసి పెట్టి ఉండ‌డం దానికున్న ప్రాధాన్య‌త‌ను తెలియ చేస్తుంది. వ్య‌క్తిత్వ వికాస నిపుణులంతా గీత‌ను మ‌రిచి పోలేమంటారు. మ‌నిషి ఎలా ఉండాలో.ఎలా జీవించాలో.ఎలా నేర్చుకోవాలో.ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో.ఎలా ప‌ది మందికి స్ఫూర్తి దాయ‌కంగా మ‌స‌లు కోవాలో .గీత నేర్పించినంత ఏదీ నేర్ప‌దంటారు.ఓ సంద‌ర్భంలో మెంటార్స్‌.ట్రైన‌ర్స్‌.వ్య‌క్తిత్వ వికాస నిపుణులు.ర‌చ‌యిత‌లు.

జీవితంలో పైకి వ‌చ్చిన ప్ర‌తి వారిలో ఏదో ఒక ప్ర‌త్యేక‌త దాగి వుంటుంది. ఏ రంగంలో ఉన్న వారైనా స‌రే వారంతా ఎప్పుడో ఒక‌ప్పుడు గీత‌ను చ‌దవ‌డమో.లేక విన‌డ‌మో.లేక ఆక‌ళింపు చేసుకోవ‌డమో చేసి.ఉంటారంటారు.గంగాద‌ర‌శ‌ర్మ‌. ఈ దేశం ఇంకా విలువ‌ల‌తో.సంస్కృతి, సాంప్ర‌దాయాల‌తో విరాజిల్లుతున్న‌దంటే .భ‌గ‌వ‌ద్గీత వ‌ల్ల‌నే. ఏ ఒక్క‌టి లేద‌ను కోవ‌డానికి ఏమీ లేదు.స‌మ‌స్తం వుంది అందులో.కావాల్సింద‌ల్లా తోడుకోవ‌డ‌మే. మ‌న‌ల్ని మ‌నం సంస్క‌రించు కోవాల‌న్నా.మ‌న‌ల్ని మ‌నం విజేత‌లుగా మ‌ల్చుకోవాల‌నుకున్నా గీత చూపించినంత దారి ఏదీ చూపించ‌దు. చీక‌టి నుండి వెలుతురులోకి.వెలుతురు నుండి ప్రపంచానికి భ‌గ‌వ‌ద్గీత దారులు ప‌రిచే ఉంచింది. ఆ దారులు మ‌నం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉండేందుకు కావాల్సిన విలువ‌ల్ని స‌మ‌కూర్చి పెట్టింది. అందుకే అజ‌రామ‌రంగా వెలుగొందుతోంది.

మ‌నిషి త‌త్వాన్ని భ‌గ‌వ‌ద్గీత విశ్లేషించినంత‌గా ఏదీ చెప్ప‌లేదు. స్వంత బంధువుల‌ను యుద్ధంలో హ‌త‌మార్చ‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్న బాధ‌తో.దుఃఖంతో విల‌విల‌లాడుతున్న స‌మ‌యంలో అర్జునుడికి శ్రీ‌కృష్ణుడు బోధించిందే గీత‌గా ఈ ప్ర‌పంచానికి ల‌భించింది. దేశ వ్యాప్తంగా కృష్ణ మందిరాల‌లో ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. గుణాలు మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తాయి కానీ పుట్టుక కాదని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. సత్యము, త్యాగము, శాంతి మొదలైన గుణాలే దైవ సంపత్తు. పొగరు, కోపం, పరుషమైన ప్రవర్తన, హింస, అసత్యం అనేవి ప్ర‌మాదం. చిరిగి పోయిన బట్టలను పడేసి, మనం కొత్త బట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. అంటారు శ్రీ‌కృష్ణుడు గీతోపదేశంలో.

సాధు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. సత్యాన్ని, ధర్మాన్ని పరిరక్షిస్తూ.అందరి శ్రేయస్సును కోరుకోమని చెబుతోంది గీత. ఆ మార్గాన్ని అనుసరిస్తే జీవితం సాఫల్యమైనట్టే.క‌దూ.గీతోభ్య‌న‌మః.!

Comments

comments

Share this post

scroll to top