ఫేమస్ మ్యాజిక్కుల వెనుకున్న లాజిక్స్ ఇవి. తెలుసుకోండి ఒక్కొక్కటి.

అబ్ర‌కద‌బ్ర‌… అబ్ర‌క‌దబ్ర‌… అంటూ చేతులాడిస్తూ గాలి లోంచి గులాబీ పూలు తీయడం… వాటిని వీక్ష‌కులు స‌రిగ్గా చూసే లోపే పావురంగానో, కుందేలుగానో, పిట్ట‌గానో మార్చేయ‌డం. మ‌ళ్లీ వాటిని గాలిలోనే మాయం చేయ‌డం. గాలిలో ప‌డుకోవ‌డం, క‌త్తితో కోసిన‌ట్టు విడ‌దీయ‌డం… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా? అదేనండీ మ్యాజిక్‌. మ‌నం చిన్న‌త‌నంలో వాటిని చూసి ఎంత‌గా ఎంజాయ్ చేస్తాయో పెద్దయ్యాక వాటి గురించిన ర‌హ‌స్యం తెలిస్తే అది వేరుగా ఉంటుంది. అప్ప‌టి మ‌న అమాయ‌క‌త్వం, ఇప్ప‌టి నేర్ప‌రిత‌నం చూసి మ‌న‌కు మ‌న‌మే ఆశ్చ‌ర్య‌పోతాం. అయితే ఎన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచినా, ఎంద‌రు మెజిషియ‌న్‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చినా కొన్ని మ్యాజిక్‌లు మాత్రం ఇప్ప‌టికీ ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌క మాన‌వు. అలాంటి మ్యాజిక్‌ల వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
వ్య‌క్తిని క‌ట్ చేసి విడ‌దీసిన‌ట్టుగా ప్ర‌ద‌ర్శించే మ్యాజిక్‌లో మోడ‌ల్ ముందుగా ఓ చెక్క పెట్టెలోకి ప్ర‌వేశిస్తుంది. అందులో వీక్ష‌కుల‌కు క‌నిపించ‌ని రెండు బ్లాక్‌లు ఉంటాయి. ఒక బ్లాక్‌లో ఒక మోడ‌ల్ ముందుగానే ఉంటుంది. అనంత‌రం వీక్ష‌కులు చూసే స‌మ‌యంలో మ‌రో మోడ‌ల్ ప్ర‌వేశిస్తుంది. మెజిషియ‌న్ మంత్రం చదివి ఆ పెట్టెను క‌ట్ చేసిన‌ట్టుగా విడ‌దీయ‌గానే పెట్టెలోని ఒక బ్లాక్‌లో ఉండే మోడ‌ల్ త‌ల బ‌య‌ట‌కు పెట్టి చిత్రంలో చూపిన విధంగా బ్లాక్‌లో స‌ర్దుకుంటుంది. మ‌రో మోడ‌ల్ త‌న కాళ్ల‌ను మాత్ర‌మే బ‌య‌ట పెట్టి మ‌రో బ్లాక్‌లో అడ్జ‌స్ట్ అవుతుంది. అయితే దీన్ని చూసే వీక్ష‌కుల‌కు మాత్రం నిజంగా ఆ మోడ‌ల్ క‌ట్ చేయ‌బ‌డ్డ‌ట్టుగానే ద‌ర్శ‌న‌మిస్తుంది.
1
ఇక గాలిలో ప‌డుకున్న‌ట్టుగా చూపించే మ‌రో మ్యాజిక్ విష‌యానికి వ‌స్తే గుండ్రంగా ఉండే స్థూపాకార బాక్స్‌లో ముందుగా మోడ‌ల్ ప‌డుకుంటుంది. మెజిషియ‌న్ మంత్రం చ‌ద‌వ‌గానే గాలిలో ప‌డుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. అయితే ఆ బాక్స్‌లో మోడ‌ల్ కింద ఓ దృఢ‌మైన మెట‌ల్ రాడ్ ఉంటుంది. దీనికి స‌పోర్ట్‌గా ఉండే మ‌రో ఆధారం క‌నిపించ‌డ‌కుండా మెజిషియ‌న్ త‌న కాళ్ల‌ను అడ్డంగా పెడ‌తాడు. ఈ నేప‌థ్యంలోనే వీక్ష‌కుల‌కు ఆ మోడ‌ల్ గాలిలో ప‌డుకున్న‌ట్టు ద‌ర్శ‌న‌మిస్తుంది.
2
ఇక దేహాన్ని విడ‌దీసిన‌ట్టుగా చూపించే మ‌రో మ్యాజిక్‌లో మోడ‌ల్ పైన చెప్పిన‌ట్టుగా రెండు బ్లాక్‌లలా ఉండే చెక్క పెట్టెలోకి ప్ర‌వేశిస్తాడు. అయితే కేవ‌లం ఒక మోడ‌ల్ మాత్ర‌మే ఈ బాక్స్‌లోని ఒక బ్లాక్‌లో ఉంటాడు. రెండ‌డో బ్లాక్‌లో ఎవ‌రూ ఉండ‌రు. మెజిషియ‌న్ చేతులూప‌గానే మొద‌టి బ్లాక్‌లో ఉన్న మోడ‌ల్ త‌న కాళ్ల‌ను పైకి తీసుకుని బాక్స్‌లో స‌ర్దుకుంటాడు. ఇక రెండో బ్లాక్ నుంచి కృత్రిమ‌మైన పాదాల‌ను బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తారు. ఇది చూప‌రుల‌కు నిజంగా కాళ్లు క‌ట్ చేయ‌బ‌డ్డాయేమోన‌న్న భావ‌న‌ను క‌లిగిస్తుంది.
3
గాలిలో మోడ‌ల్ పడుకున్న‌ట్టుగా చూపించే మ్యాజిక్ గురించి పైన తెలుసుకున్నాం. స‌రిగ్గా దాన్ని పోలిన మ‌రో మ్యాజిక్ కూడా ఉంది. కాకపోతే పైన చెప్పిన మ్యాజిక్‌లో గుండ్ర‌ని స్థూపాకార బాక్స్ ఉంటుంది. ఇక ఈ మ్యాజిక్‌లో మోడ‌ల్ కింద ఒక చెక్క‌, దానికి స‌పోర్ట్‌గా కంటికి క‌నిపించ‌ని ఆధారం ఉంటాయి.
4
ఈ చిత్రం చూశారా. ఇలాంటి వారు వీధుల్లో మీకు ఎప్పుడైనా క‌నిపించారా? అయితే ఇప్పుడు ఆ మ్యాజిక్ వెన‌క ఉన్న ర‌హ‌స్యం తెలుసుకుందాం. ఒక ప్ర‌త్యేక‌మైన ఆధారం క‌లిగిన డ్రెస్‌ను ధ‌రించినందువ‌ల్లే ఆ వ్య‌క్తులు అలా గాలిలో ఉండ‌గ‌లుగుతారు. ఆ డ్రెస్‌లో ఆ వ్య‌క్తులు సులభంగా ఇమిడిపోతారు.
5
మోడ‌ల్ శ‌రీరంలో మ‌ధ్య భాగాన్ని పూర్తిగా ప‌క్క‌కు జ‌రిపి చూపించే ఈ మ్యాజిక్‌ను గ‌మ‌నించారా. అయితే నిజంగా మోడ‌ల్ శరీరం అలా క‌ద‌ల‌దు. చిత్రంలో చూపిన‌ట్టుగా న‌లుపు రంగులో ఉండే గీత‌ల్లాంటి ప్ర‌దేశంలో మోడ‌ల్ స‌రిగ్గా ఇమిడిపోతాడు. అక్క‌డ అత‌నికి త‌గినంత ప్ర‌దేశం ఉంటుంది.
ఇక చివ‌రిగా మైకేల్ జాక్స‌న్ డ్యాన్స్ ట్రిక్‌. ఇదేమీ మ్యాజిక్ కాదు. కానీ ఆ స్థాయిలో  ఆ డ్యాన్స్ ఉంటుంది. ఇందులో ఉన్న మ‌ర్మ‌మేమిటంటే డ్యాన్స‌ర్ ధ‌రించే ఓ ప్ర‌త్యేక‌మైన షూస్ డ్యాన్స్ ఫ్లోర్‌కు సుల‌భంగా ప‌ట్టుకుని ఉండేలా రూపొందించ‌బ‌డ‌తాయి. ఈ నేప‌థ్యంలోనే డ్యాన్స‌ర్ ఆ షూస్‌ని ధ‌రించి ఆ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేసినా ప‌డిపోకుండా ఉంటాడు.
t16q7g3kc9nalur1jz1a

Comments

comments

Share this post

scroll to top