ఇండియ‌న్ యాప్స్‌లో డిఫ‌రెంట్ .. లైవ్ లోకోతో ప్లే అండ్ ఎర్న్

ఇండియాలో ఐడియాస్‌కు కొద‌వ‌లేదు. లెక్కలేనంత ప్ర‌తిభ క‌లిగిన ఔత్సాహికులు ఎంద‌రో ఉన్నారు. స్టార్ట‌ప్‌లు..ఆంట్ర‌ప్రెన్యూర్స్ గా ఎదిగేందుకు కేంద్ర ప్ర‌భుత్వం, ఆయా రాష్ట్రాలు వెన్ను ద‌న్నుగా నిలుస్తున్నాయి. కొత్త అంకురాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. మ‌న తెలివికి చిన్న ప‌రీక్ష పెట్టి..డ‌బ్బులు ఇస్తే ఎంత బావుంటుందో క‌దూ ..అలాంటి ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిందే లోకో యాప్. ఆదాయంతో పాటు ఏకంగా విజ్ఞానం పెంపొందించు కోవ‌చ్చు దీంతో. మొబైల్ క్విజ్ షోను గౌర‌వ్ క‌పూర్ డెవ‌ల‌ప్ చేశాడు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు ..ఎక్క‌డి నుంచైనా ఆప‌రేట్ చేయొచ్చు. కావాల్సింద‌ల్లా నెట్ క‌నెక్టివిటీ, కాస్తంత మెద‌డుకు ప‌దును పెడితే చాలు..ఆడుతూనే ఎర్నింగ్ చేయొచ్చ‌న్న‌మాట‌.

సామాజిక దిగ్గ‌జాల్లో రిజిష్ట‌ర్ అయిన వాళ్లు కూడా ఈ యాప్ ద్వారా ఆడేయొచ్చు. డ‌బ్బులు పోగేసుకోవ‌చ్చు. ఫేస్ బుక్ , లింక్డ్ ఇన్, రెడ్డిట్, వాట్స్ యాప్, ట్విట్ట‌ర్‌లో వాడుకోవ‌చ్చు. నాలెడ్డ్ మీకెంతుందో చూసుకోవ‌చ్చు. ప‌నిలో ప‌నిగా మెద‌ళ్లు పాద‌ర‌సంలా ప‌నిచేస్తాయి. బాడీకి కావాల్సిన జోష్ ..సంపాదించిన డ‌బ్బులతో వ‌స్తాయి. ఆట‌కు ఆట‌..మెద‌డ‌కు మేత‌..ఇంకో వైపు కాసులు కొల్ల‌గొట్ట‌వ‌చ్చు. యు ప్లే..దె వే టాగ్ లైన్ తో దీనిని ఏర్పాటు చేశాడు అభిషేక్ మాధ‌వ‌న్. ఈ సంస్థ‌కు సిఇఓగా ఉన్నారు. ఇదే త‌ర‌హా యాప్ అమెరికాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. హెచ్ క్యూ ట్రివియా క్విజ్ యాప్ ను వినే ఫౌండ‌ర్స్ రుస్ యుసుపోవ్ , కోలిన్ క్రోల్ లు డెవ‌ల‌ప్ చేశారు. లోకో యాప్ ద్వారా రియ‌ల్ క్విజ్..రియ‌ల్ క్యాష్ పొందేలా రూపొందించారు.

ఈ క్విజ్ రోజుకు రెండు సార్లు ప్లే చేయొచ్చు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు తిరిగి రాత్రి 10 గంట‌ల‌కు వారంలో ఆడే అవ‌కాశం ఉంటుంది. వీకెండ్స్‌లో ఒక్క‌సారి అది రాత్రి 10 గంట‌ల‌కు ఆడుకునే వీలు క‌ల్పించారు. షో టైమ్ యాప్ లాగానే ఉంటుంది ఈ యాప్. ఉబెర్ హిట్ టీవీ కూడా ఇలాంటి లైవ్ క్విజ్‌లు నిర్వ‌హించింది. స్టార్ టీవీ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి పేరుతో చేప‌ట్టిన ప్రోగ్రాం కోట్లాది రూపాయ‌ల‌ను ఆర్జించేలా చేసింది. వూ వాంట్స్ టు బి ఏ మిలియ‌నీర్ ..? పేరుతో ప్రోగ్రాం రూపొందించిన ఆట లెక్క‌లేనంత ఆదాయం స‌మ‌కూర్చి పెట్టింది. లైవ్ లోనే ఈ యాప్ ద్వారా గౌర‌వ్ కపూర్ హోస్ట్‌గా ఉంటారు. 10 మ‌ల్టిపుల్ ఛాయిస్ క్వ‌క్ష‌న్స్ అడుగుతారు. ఎవ‌రైతే స‌రిగ్గా స‌మాధానం చెబుతారో వారికి పే టిఎం ద్వారా డ‌బ్బులు వారి ఖాతాల్లోకి జ‌మ అయిపోతాయి డ‌బ్బులు.

ఇక్క‌డ ల‌క్ష‌లు వ‌స్తాయ‌నుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే..రోజు 12 వేల 500 రూపాయ‌లు మాత్ర‌మే. ఇందులో ఎంత మంది విన్న‌ర్స్ అవుతారో వారికి ఆ డ‌బ్బుల‌ను స‌మానంగా పంచుతారు. 2017 న‌వంబ‌ర్ నెల‌లో లోకో యాప్ ను ప్రారంభించారు. ఆండ్రాయిడ్ వెర్ష‌న్ డిసెంబ‌ర్‌లో ప్రారంభ‌మైంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి లోకో యాప్ ను ల‌క్షా 20 వేల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఇండియాలో అత్యంత వేగంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ గా లోకో పేరు తెచ్చుకుంది. రోజుకు 10 వేల చొప్పున ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ట్రాఫిక్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. రోజు రోజుకు ఈ యాప్‌కు డిమాండ్ పెరుగుతోంది. మ‌రో 30 వేల మంది డౌన్లోడ్ చేసుకోవ‌చ్చ‌ని అంచ‌నా.

ఒక‌వేళ అలా జ‌రిగితే ఇన్ స్టాల్‌ను నిలిపి వేస్తామంటున్నారు మాధ‌వ‌న్. సైన్ అప్ అయిన వాళ్లు రెఫ‌రెన్స్ చేస్తే ..వారికి అద‌నంగా డ‌బ్బులు ఇస్తున్నారు. లోకో యాప్ ఇంగ్లీష్, హిందీ వెర్ష‌న్స్ లో ల‌భిస్తుంది. త్వ‌ర‌లో తెలుగు, త‌మిళ్‌లో కూడా అందుబాటులోకి తీసుకు వ‌చ్చేందుకు సంస్థ ప్ర‌య‌త్నం చేస్తోంది. దేశంలోని చిన్న ప‌ట్ట‌ణాల నుంచి కూడా లోకో యాప్. 1.5 మిలియ‌న్ డెయిలీ యూజ్ చేస్తున్నారు. గూగుల్ స్టోర్ లో టాప్ ఫైవ్ గేమింగ్ యాప్స్‌ల‌లో లోకో యాప్ టాప్‌లో ఒక‌టిగా నిలిచింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి రూల్స్ , హౌ టూ ప్లే లాంటివి అన్నీ ఉన్నాయి ఇందులో . పే టిం ను ఈ యాప్‌కు అనుసంధానం చేసుకోవాలి. వీక్లీ బేసిస్ ప‌ద్ధ‌తిన డ‌బ్బులు జ‌మ చేస్తుంది లోకో యాప్ కంపెనీ.

Comments

comments

Share this post

scroll to top