పెద్ద శ‌బ్దాలు వ‌చ్చే ప్రాంతంలో ఎక్కువ‌గా ఉంటున్నారా..? అయితే మీకు పిల్ల‌లు పుట్ట‌ర‌ట తెలుసా..?

ధూమ‌పానం, మ‌ద్య‌పానం, స్థూల‌కాయం, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి, ఆందోళ‌న‌ వంటి కార‌ణంగా చాలా మంది పురుషుల్లో నేడు శృంగార సామర్థ్యం త‌గ్గ‌డ‌మే కాదు, వారికి సంతానం క‌లిగే అవ‌కాశాలు కూడా స‌న్న‌గిల్లుతున్నాయి. అయితే ఇవే కాదు, సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది ఏమిటంటే… మ‌రో అంశం కూడా పురుషుల్లో సంతాన లేమికి కార‌ణ‌మ‌వుతుంద‌ట‌. అదేమిటంటే… ధ్వ‌ని కాలుష్యం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీని వ‌ల్ల కూడా పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గుతోంద‌ట. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు త‌గ్గుతున్నాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

కొరియాలోని సియోల్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ సైంటిస్టు బృందం 2006 నుంచి 2013 వ‌ర‌కు 2,06,492 మంది పురుషుల‌ను ప‌రిశీలించింది. వారి ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, చేసే ప‌ని వంటి అన్ని అంశాల‌ను సేక‌రించి ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని అప్‌డేట్ చేస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలో తెలిసిందేమిటంటే… వారిలో 3293 మందికి సంతానం క‌లిగేందుకు అవ‌కాశాలు లేవ‌ని గుర్తించారు. వారంతా రోజూ 55 డెసిబ‌ల్స్ క‌న్నా ఎక్కువ ధ్వ‌ని ఉండే ప్ర‌దేశాల్లో ఎక్కువ సేపు గ‌డుపుతూ ఉండ‌డం వ‌ల్ల ఆ ధ్వ‌ని కాలుష్యం వారిపై ప్ర‌భావాన్ని చూపింద‌ట‌. దీంతో వారి హార్మోన్ల‌లో తేడా వ‌చ్చి, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటికి గురై వారికి సంతానం క‌లిగే అవ‌కాశం త‌గ్గిందట‌.

ఈ క్ర‌మంలో ఈ ప‌రిశోధ‌న‌ను బ‌ట్టి ఆ సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఎవ‌రైనా 55 డెసిబ‌ల్స్ క‌న్నా ఎక్కువ సౌండ్ వ‌చ్చే ప్ర‌దేశంలో రోజులో ఎక్కువ భాగం గ‌డుపుతూ ఉంటే జాగ్ర‌త్త ప‌డాల‌ని వారంటున్నారు. ఎక్కువ సేపు పెద్ద శ‌బ్దం విన‌డం వ‌ల్ల సంతానం సాఫ‌ల్య‌త అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయ‌ని, క‌నుక 55 డెసిబ‌ల్స్ క‌న్నా త‌క్కువ శ‌బ్దం వ‌చ్చే ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో గ‌డ‌పాల‌ని వారు అంటున్నారు. అవును మ‌రి, పెద్ద శ‌బ్దంతో ఎప్ప‌టికైనా మ‌న ఆరోగ్యానికి చేటే క‌లుగుతుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top