ఇంటి వ‌ద్ద‌కే ఆరోగ్య సేవ‌లు – దూసుకెళుతున్న స్టార్ట‌ప్‌లు

ఆరోగ్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ టెక్నాల‌జీ పెరిగాక రోగుల‌కు డాక్ట‌ర్ల‌కు మ‌ధ్య సంబంధాలు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాయి. టెలికాన్ఫ‌రెన్స్ ద్వారా అనుభ‌వం క‌లిగిన వైద్యులు , ఇత‌ర సిబ్బంది ఎల్ల‌వేళలా అందుబాటులో ఉంటున్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డి నుంచైనా సేవ‌లు అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. కాక‌పోతే కొంచెం ఖ‌ర్చ‌వుతుంది అంతే. ఒక‌ప్పుడు ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా లేక ఆరోగ్య ప‌రంగా ఇబ్బందులు ఎదురైతే చాలు కార్పొరేట్ ఆస్ప‌త్రుల వ‌ద్ద‌కు ప‌రుగులు తీసేవారు. అక్క‌డికి వెళ్ల‌డం..జేబులు ఖాళీ చేసుకోవ‌డం బాధితులు మ‌రింత భారాన్ని పెంచేదిగా ఉండేది. దీంతో వీరిని గ‌మ‌నించిన నిపుణులు, ఐటీ ఎక్స్‌ప‌ర్ట్స్ కొత్త ర‌కంగా ఆలోచించారు. మెరుగైన సేవ‌లు అందించేందుకు కొత్త స్టార్ట‌ప్‌లు లెక్క‌లేన‌న్ని పుట్టుకువ‌చ్చాయి.

ఎన్నో అంకురాలు దేశ వ్యాప్తంగా ప్రారంభ‌మైనా ..ప‌ది హెల్త్ రంగానికి చెందిన స్టార్ట‌ప్‌లు స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నాయి. ప్రివెంటివ్ హెల్త్ కేర్, అన‌లిటిక్స్, పాథాల‌జీ, ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసెస్ ( అత్య‌వ‌స‌ర సేవ‌లు ) , త‌దిత‌ర వాటికి సంబంధించిన అంకురాలే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యాయి. రాను రాను హెల్త్ కేర్ రంగానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు పెరుగుతూ వ‌స్తోంది. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ అంచ‌నాల ప్ర‌కారం 1.2 శాతం పెరిగింది. అమెరికా 17 శాతంగా ఉంటే చైనా 5.5 శాతం న‌మోదైంది. వేయి మంది సిటిజ‌న్స్‌కు 1.1 చొప్పున ప‌రుపులు ఉన్నాయ‌ని ఐఎంసీ పేర్కొంది. ఇంకా ఆరోగ్య రంగంలో వ‌స‌తులు పెర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్య‌త క‌ల్పించింది. 12వ పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో 2022 నాటికి 3 శాతానికి చేరుకోవాల‌న్న‌ది టార్గెట్‌గా నిర్ణ‌యించారు. ప‌బ్లిక్ అండ్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దీనిని అనుసంధానం చేస్తే..మ‌రింత‌గా సేవ‌లు అందించేందుకు వీల‌వుతుంద‌ని స‌ర్కార్ అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇంట‌ర్నెట్ ఆధారిత సేవ‌లు పెర‌గ‌డం వ‌ల్ల వైద్య సేవ‌లు మ‌రింత సులువుగా, వేగంగా ల‌భ్య‌మ‌వుతున్నాయి. 2016 వ‌ర‌కు ఇండియాలో హెల్త్ కేర్ రంగానికి సంబంధించి జ‌రిగిన వ్యాపారం 100 బిలియ‌న్లు ఉండ‌గా 2020 సంవ‌త్స‌రం నాటికి అది 280 బిలియ‌న్ల‌కు చేరుకుంటుంద‌ని ఐఎంసీ పేర్కొంది. డిఫ‌రెంట్ ఐడియాస్‌తో అంకురాలు స‌క్సెస్ కావ‌డం, ప‌లువురికి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించ‌డం జ‌రుగుతోంది. విజ‌య‌వంతంగా న‌డుస్తున్న అంకురాల‌ను చూస్తే ఇలా ఉన్నాయి.

పూణే కేంద్రంగా ప‌నిచేస్తున్న లైవ్ హెల్త్ స్టార్ట‌ప్ వేగంగా దూసుకెళుతోంది. సేవ‌ల్లో అన్నిటికంటే ముందంజ‌లో ఉంటోంది. ఈ స్టార్ట‌ప్‌ను 2013లో స్టార్ట్ చేశారు. మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్టం ద్వారా రోగుల‌కు డేటా సేవ‌లందిస్తోంది. రోగుల‌కు సంబంధించిన శాంపిల్స్ తీసుకోవ‌డం, పేటియంట్ రికార్డులు న‌మోదు చేయ‌డం, ప‌రీక్ష‌లు వ‌చ్చాక రిపోర్టులను భ‌ద్ర ప‌ర్చ‌డం, బిల్లింగ్, సేవ‌లు అన్నీ ఇందులో ల‌భ్య‌మ‌వుతున్నాయి. వీట‌న్నింటిని చేయాలంటే ఎక్కువ ఖ‌ర్చు, అద‌న‌పు స‌మ‌యం కావాల్సి వ‌చ్చేది. త‌క్కువ ఖ‌ర్చు, నాణ్య‌వంత‌మైన సేవ‌లు లైవ్ హెల్త్ ద్వారా అందుతోంది. మిలియ‌న్ల మంది రోగులు దీనిని యాక్సెప్ట్ చేయ‌డంతో ఈ స్టార్ట‌ప్‌కు ఎదురే లేకుండా పోయింది. డాక్ట‌ర్లు దీనినే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. నిధులు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్నాయి.

లిబ్రేట్ స్టార్ట‌ప్ డాక్ట‌ర్ల‌కు చేదోడుగా ఉంటోంది ఈ సంస్థ‌. కేవ‌లం ఫోన్ల ద్వారానే అన్ని రిపోర్టులు డాక్ట‌ర్ల‌కు అందుబాటులో ఉంచుతోంది. ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థ ప‌నిచేస్తోంది. సౌర‌భ్ అరోరా, రాహుల్ నారంగ్ లు క‌లిసి దీనిని ప్రారంభించారు 2013లో డాక్ట‌ర్లు, రోగుల‌కు మ‌ధ్య అనుసంధానంగా ఉంటోంది. వారి మ‌ధ్య నెల‌కొన్న సంభాష‌ణ‌లు, డాక్ట‌ర్లు అందించిన సూచ‌న‌ల ఆధారంగా డేటా న‌మోదు చేస్తారు. వెంట‌నే వివ‌రాలు న‌మోదు అవుతాయి. దీని వ‌ల్ల ఏ రోగికి ఏం మందులు వాడాలో, ఎంత స‌మ‌యం వారికి కేటాయించాలో సులువవుతుంది. దేశ వ్యాప్తంగా ల‌క్ష మంది డాక్ట‌ర్ల‌ను లిబ్రేట్ సంస్థలో న‌మోదై ఉన్నారు. ఏ రోగానికైనా సేవ‌లు అందించేందుకు..వీరు రెడీగా ఉన్నారు. నిర్మ‌యి స్టార్ట‌ప్ బ్రెస్ట్ క్యాన్స‌ర్ బాధితుల ప‌ట్ల క‌ల్ప‌త‌రువుగా మారింది. ఆడ‌వాళ్ల‌కు కొంత ఏజ్ వ‌చ్చాక రొమ్ము క్యాన్స‌ర్ కు గుర‌వుతారు. దీనిని గ‌మ‌నించిన నిర్మ‌యి సంస్థ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీ ద్వారా సేవ‌లందించేందుకు బెంగ‌ళూరు కేంద్రంగా స్టార్ట‌ప్‌ను ప్రారంభించింది.

ఎవ‌రైతే బాధితులున్నారో వారికి అయిదు సార్లు త‌క్కువ ఖ‌ర్చుతో ట్రీట్‌మెంట్ తో పాటు అన్ని ప‌రీక్ష‌లు నిర్మ‌యి ద్వారా అందుకోవ‌చ్చు. 2016లో ప్రారంభ‌మైన ఈ స్టార్ట‌ప్ త‌క్కువ స‌మ‌యంలోనే స‌క్సెస్ సాధించింది. ప్రాక్టో..దేశంలోనే పేరొందిన హెల్త్ కేర్ సంస్థ‌. అన్ని సేవ‌లు ఒకే చోట ల‌భించేలా చేసింది ఈ సంస్థ‌. 2007లో దీనిని ప్రారంభించారు. 10 ఏళ్లుగా స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తోంది. అపాయింట్‌మెంట్స్, క‌న్స‌ల్టేష‌న్స్, హెల్త్ రికార్డులు, ఇన్సూరెన్స్‌, మందులు ఇవ్వ‌డం లాంటి సేవ‌లన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 1500 మందితో బెంగ‌ళూరులో ప్రారంభ‌మైన ఈ ప్రాక్టో దేశంలోని 38 న‌గ‌రాల‌కు విస్త‌రించింది. అంతేకాకుండా సింగ‌పూర్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ , బ్రెజిల్ దేశాల‌కు విస్త‌రించింది. ల‌క్ష మంది వైద్యులు వివిధ విభాగాల్లో సేవ‌లందిస్తున్నారు. 25 మిలియ‌న్ల రోగులు ప్రాక్టో ద్వారా సేవ‌లు పొందుతున్నారు.

ఇది కూడా లాభాల బాట ప‌ట్టింది. ఎమ‌ర్జెన్సీ..ఇదో డిఫ‌రెంట్ స్టార్ట‌ప్. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసెస్ ను యాప్ ద్వారా అంద‌జేస్తుంది ఈ సంస్థ‌. 3 ల‌క్ష‌ల మంది ఈ యాప్ ద్వారా సేవ‌లు పొందారు. క‌ష్ట‌కాలంలో ఎంతో మందిని ప్రాణాలు పోకుండా కాపాడింది ఎమ‌ర్జెన్సీ స్టార్ట‌ప్. పోర్టీ స్టార్ట‌ప్ హెల్త్ కేర్ రంగంలో టాప్‌లో ఉంటోంది. డాక్ట‌ర్స్‌, మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ రోగుల వ‌ద్ద‌కే వెళ్లి సేవ‌లందించేలా చేస్తుంది ఈ సంస్థ‌. ఈఎంఆర్ ఫ్లాట్ ఫాం మీద ప‌నిచేస్తుంది. 2013లో ప్రారంభ‌మైన ఈ స్టార్ట‌ప్ 21 సిటీస్‌ల‌లో సేవ‌లందిస్తోంది. రోగుల‌కు ఇబ్బందులు లేకుండా స్టెమ్ థెర‌పీ ద్వారా చికిత్స‌లు అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది అడ్వాన్స్ సెల్స్ స్టార్ట‌ప్‌. నోయిడా కేంద్రంగా విపుల్ జైన్ ఈ స్టార్ట‌ప్‌ను స్టార్ట్ చేశాడు. ఆర్గాన్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ అనేది ఇందులో ముఖ్యం. డ‌య‌బెటీస్, పార్కిన్స‌న్స్, ఆల్జీమీర్స్, ఆర్థ‌ర్టీస్, స్ట్రోక్ అండ్ హార్ట్ డిసీసెస్ కు ఇది అనుసంధానంగా ప‌నిచేస్తుంది.

లాబోరేట‌రీ ట్రీట్‌మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. 55 ఆస్ప‌త్రుల్లో ఈ సేవ‌లు అందుకోవ‌చ్చు. అంధ‌త్వాన్ని నివారించే దిశ‌గా ప‌నిచేస్తున్న ఫోర‌స్ హెల్త్ స్టార్ట‌ప్. 2010లో ఇది ప్రారంభ‌మైంది. త్రినేత్ర పేరుతో కంటి స‌మ‌స్య‌లు ఉన్న వారికి చేదోడుగా ఉంటోంది ఈ సంస్థ‌. క్ష‌ణాల్లో రోగులకు సంబంధించిన రిపోర్టులు అంద‌జేస్తుంది. బెంగ‌ళూరు కేంద్రంగా ప్రారంభ‌మైన ఈసంస్థ ఇప్ప‌టికే 1300 కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. 2 మిలియ‌న్ల ప్ర‌జ‌ల‌కు కంటి జ‌బ్బులు లేకుండా చేసింది ఈ సంస్థ‌. పిల్ల‌ల పాలిట దైవంగా ప‌నిచేస్తోంది బెంగ‌ళూరులోని అడ్ర‌స్ హెల్త్ స్టార్ట‌ప్. ఇది ఉచితంగా వైద్య సేవ‌లు అంద‌జేస్తోంది. మిత్రా బ‌యోటెక్ ..త‌క్కువ ఖ‌ర్చుతో క్యాన్స‌ర్ కేర్, మందుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది ఈ స్టార్ట‌ప్‌. 2009లో డాక్ట‌ర్ మాలిక్ సుంద‌రం, డాక్ట‌ర్ ప్ర‌దీప్ కె. మ‌జుందార్‌లు దీనిని ప్రారంభించారు. స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి దాకా స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తోంది.

Comments

comments

Share this post

scroll to top