ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 10 అంద‌గ‌త్తెలైన న‌టీమ‌ణులు ఎవరో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది సుంద‌రాంగులు ఉన్నారు. వారిలో కొంద‌రు న‌టీమ‌ణులుగా చెలామ‌ణీ అవుతుంటే కొంద‌రు మోడ‌ల్స్‌గా, ఇంకొంద‌రు ఇంకొన్ని రంగాల్లో పాపుల‌ర్ అవుతూ వ‌చ్చారు. అయితే అంద‌రిలోక‌న్నా న‌టీమ‌ణుల‌కే ఎక్కువ పాపులారిటీ ల‌భిస్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాగా అందంగా ఉండే న‌టీమ‌ణులకు ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకుంటే అస‌లు టాప్ 10 సుంద‌రీమ‌ణులు ఎవ‌రుంటారు ? అంటే ఆ లిస్ట్ త‌యారు చేయ‌డం చాలా క‌ష్ట‌మే అవుతుంది. కానీ ఓ సంస్థ శ్ర‌మ‌కోర్చి స‌ర్వే చేసి మ‌రీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 10 న‌టీమ‌ణుల్లో అత్యంత అంందంగా ఉన్న‌దెవ‌రో జాబితాలో చెప్పింది. ఆయా న‌టీమ‌ణులకు ఉన్న పాపులారిటీ, వారి స‌క్సెస్ రేట్ వంటి అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ సంస్థ టాప్ 10 అంద‌గ‌త్తెలైన న‌టీమ‌ణుల‌ను ఎంపిక చేసింది. మ‌రి వారెవ‌రో చూద్దామా..!

1. సెలీనా గోమెజ్
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 10 అంద‌గ‌త్తెలైన న‌టీమ‌ణుల్లో అమెరికాకు చెందిన‌ సెలీనా గోమెజ్‌కు మొద‌టి స్థానం ద‌క్కింది. ఈమె సింగ‌ర్‌గానే కాక‌, న‌టిగా కూడా మంచి గుర్తింపు పొందింది.

2. లిజా సొబెరానో
ఫిలిప్పినో అమెరిక‌న్ అయిన ఈ సుంద‌రి న‌టిగా, మోడ‌ల్‌గా గుర్తింపు పొందింది. అంద‌గత్తెల జాబితాలో ఈమెకు రెండో స్థానం వ‌చ్చింది.

3. నానా ఇమ్ జిన్-అ
ద‌క్షిణ కొరియాకు చెందిన ఈమె న‌టిగా, మోడ‌ల్‌గా, సింగ‌ర్‌గా మంచి గుర్తింపు సాధించింది. అలాగే సుంద‌రాంగుల జాబితాలో ఈమెకు 3వ స్థానం ద‌క్కింది.

4. దీపికా ప‌దుకునె
ఈమె గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ అందగ‌త్తెలైన న‌టీమ‌ణుల జాబితాలో 4వ స్థానం ద‌క్కిన దీపిక నటిగానే కాదు మంచి మోడ‌ల్‌గా కూడా రాణిస్తోంది.

5. పిక్సీ లాట్
ఆంగ్ల సింగ‌ర్‌, సాంగ్ రైట‌ర్‌, న‌టిగా ఈమె మంచి గుర్తింపు పొందింది. అంద‌గ‌త్తెల జాబితాలో ఈమెది 5వ స్థానం.

6. ప్రియాంక చోప్రా
హాలీవుడ్ సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ మంచి గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రాకు అంద‌గ‌త్తెలైన నటీమ‌ణుల జాబితాలో 6వ స్థానం ద‌క్కింది.

7. అడ్రియానా లిమా
బ్రెజిల్‌కు చెందిన ఈమె మంచి న‌టి మాత్ర‌మే కాదు, మోడ‌ల్ కూడా. ఈమెకు అంద‌గ‌త్తెల జాబితాలో ద‌క్కిన స్థానం 7.

8. ఆంబ‌ర్ హెర్డ్
అమెరికాకు చెందిన ఈమె అనేక సినిమాల్లో న‌టించి రాణించింది. ఇప్పుడు అంద‌గత్తెల జాబితాలో 8వ స్థానాన్ని సంపాదించింది.

9. ఎమిలియా క్లార్క్
లండ‌న్‌కు చెందిన ఈ న‌టి అనేక సినిమాల్లో న‌టించి న‌టిగా చ‌క్క‌ని గుర్తింపును పొందింది. అంద‌గ‌త్తెలైన న‌టీమ‌ణుల జాబితాలో ఇప్పుడు ఈమెకు 9వ స్థానం ద‌క్కింది.

10. పియా వ‌ర్ట్జ్‌బ్యాక్‌
ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈమె అక్క‌డ అనేక సినిమాల్లో న‌టించి పేరు తెచ్చుకుంది. అంద‌గ‌త్తెలైన న‌టీమ‌ణుల జాబితాలో ఈమెకు 10వ స్థానం ద‌క్కింది.

Comments

comments

Share this post

scroll to top