మేడెక్కిన దున్నపోతు, జూ నుండి బయటకొచ్చిన సింహం!!!

కొన్ని సార్లు ఊహించనవి అలా జరితిపోతుంటాయి…. ఒక్కో సారి ఆశ్చర్యానికి, ఒక్కోసారి విస్మయానికి గురికావాల్సి వస్తుంది. అలాంటివే ఆ రెండు సంఘటనలు…..

రాజస్థాన్ లో ఓ దున్నపోతు దర్జాగా మేడెక్కేసింది. ఎక్కడమైతే ఎక్కింది కానీ, ఎలా కిందకు దిగాలో అర్థం కాక చిక్కుకుపోయింది. నానాయాగీ చేసింది. ఈ ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లాలో జరిగింది. ఓ పాఠశాల భవంతి గేటు తలుపులు తీసి ఉండడంతో దున్నపోతు లోపలికి ప్రవేశించి మెట్లెక్కేసింది. పైకెళ్లిన తరువాత కిందకు దిగలేకపోయింది. స్థానికులు, పాఠశాల యాజమాన్యం ఎంతగా ప్రయత్నించినా దాన్ని కిందకు దించలేకపోయారు. చివరకు పోలీసులు అతికష్టం మీద దున్నను సురక్షితంగా కిందకు దించగలిగారు.


సింహం జూ నుండి తప్పించుకున్న ఘటన చైనా లో జరిగింది. సింహం ఉంటున్న ఎన్ క్లోజరును శుభ్రం చేయడానికి వచ్చిన ఉద్యోగిపై దాడిచేసి అతడిని చంపి సింహం తప్పించుకోగా, విషయం తెలుసుకున్న జూ రక్షక దళం దాన్ని కాల్చి చంపారు. బయటకు వచ్చిన సింహాన్ని గంట పాటు జూ అధికారులు కనిపెట్టలేకపోయారట. పార్కులోని పర్యాటకులను, సిబ్బందినీ బయటకు పంపిన అధికారులు ప్రజా భద్రత దృష్ట్యా కాల్చి చంపినట్టు వివరించారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top