మొబైల్ నంబ‌ర్ల‌ను ఆధార్ నంబ‌ర్ల‌కు లింక్ చేసుకోవ‌డం ఎలాగో తెలుసా..?

ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్‌సెల్‌, టెలినార్‌, బీఎస్ఎన్ఎల్‌… తాజాగా జియో… ఇవ‌న్నీ మ‌న దేశంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న మొబైల్ నెట్‌వ‌ర్క్ కంపెనీలు ఎవ‌రైనా ఏ కంపెనీకి చెందిన నెట్‌వ‌ర్క్‌ను అయినా వాడ‌వ‌చ్చు. అది వినియోగ‌దారుల ఇష్టం. అయితే ఇందులో అన్ని కనెక్ష‌న్లను వాడేవారు ఉన్నారు. ఒక్కొక్క‌రు 2, 3, 4 సిమ్‌ల‌ను కూడా మెయింటెయిన్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే ఎన్ని సిమ్‌లు ఉన్నా… మీరు వెంట‌నే వాటిని మీ ఆధార్ నంబ‌ర్‌కు లింక్ చేసుకోవాలి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. లేదంటే ఆ నంబ‌ర్ల‌న్నీ డీ యాక్టివేట్ అయిపోతాయి.

కేంద్ర ప్ర‌భుత్వం మొన్నా మ‌ధ్య‌నే ఓ కొత్త రూల్‌ను తీసుకువ‌చ్చింది తెలుసు క‌దా. అదేనండీ… కొత్త‌గా ఎవ‌రు సిమ్ కార్డులు తీసుకున్నా క‌చ్చితంగా ఆధార్ కార్డు నంబ‌ర్‌ను ఇవ్వాల్సిందేనని. ఇప్ప‌టికే జియో తాను ఇష్యూ చేసిన, చేస్తున్న సిమ్‌ల‌కు ఆధార్ నంబ‌ర్‌నే ఐడీగా తీసుకుంటున్నాయి. అదే కోవ‌లో మిగ‌తా కంపెనీలు కూడా వినియోగ‌దారుల నుంచి ఆధార్ నంబ‌ర్లు తీసుకుని కొత్త సిమ్ నంబ‌ర్లు ఇస్తున్నాయి. అయితే ఇక‌పై కేవ‌లం కొత్త వాటికే కాదు, ఇప్ప‌టికే ఉన్న పాత నంబ‌ర్ల‌ను వాడుతున్న వారు కూడా త‌మ ఆధార్ నంబ‌ర్ల‌ను సిమ్ కార్డుల‌కు అనుసంధానించాలి. వ‌చ్చే సంవ‌త్స‌రం అంటే 2018 ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు అందుకోసం కేంద్రం గ‌డువు విధించింది. ఆ లోప‌ల మొబైల్ నంబ‌ర్ల‌కు ఆధార్‌ను అంద‌రూ అన‌సంధానించుకోవాల్సిందే. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌క్రియ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • దేశంలో ఉన్న ఏ నెట్‌వ‌ర్క్‌కు చెందిన వినియోగ‌దారుడు అయినా సంబంధం కంపెనీ స్టోర్‌కు వెళ్లాలి. వెళ్లేట‌ప్పుడు ఆధార్ కార్డును ప‌ట్టుకెళ్లాలి. అక్క‌డ వారు త‌మ‌కు సిమ్ నంబ‌ర్ల‌ను ఆధార్ కార్డుకు అనుసంధానించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో స్టోర్ సిబ్బంది ఆ ఆధార్ నంబ‌ర్‌ను సిమ్ కార్డు నంబ‌ర్‌కు అనుసంధానం చేస్తారు. ఈ క్ర‌మంలో వినియోగ‌దారుడి మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని సిబ్బందికి చెప్పాలి. ఆ త‌రువాత బ‌యోమెట్రిక్ ప‌రిక‌రం ద్వారా ఆధార్ వెరిఫై చేయాలి. దీంతో సీడింగ్ ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. ఆ త‌రువాత రోజున స‌ద‌రు టెలికాం కంపెనీ నుంచి వినియోగ‌దారుడికి మెసేజ్ వ‌స్తుంది. దానికి ఎస్ అంటే Y అని రిప్లై ఇవ్వాలి. దీంతో ఆధార్ అనుసంధానం ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. పూర్త‌యిన‌ట్టు వినియోగ‌దారుడి మొబైల్‌కు ఎస్ఎంఎస్ వ‌స్తుంది.
  • ఆధార్ నంబ‌ర్ ను ఫోన్ నంబ‌ర్‌కు లింక్ చేయ‌డానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన ప‌నిలేదు. అది ఫ్రీ.
  • ఆధార్ నంబ‌ర్ ను ఫోన్ నంబ‌ర్‌కు లింక్ చేసుకోవ‌డం కోసం క‌చ్చితంగా స్టోర్‌కు వెళ్లాల్సిందే. ఆన్‌లైన్‌లో ఈ ప్ర‌క్రియ చేయ‌డం లేదు. క‌నుక ఇలాంటి సైట్లు ఏవైనా క‌నిపిస్తే వాటిని ఓపెన్ చేయ‌కండి.
  • ఒక‌టి క‌న్నా ఎక్కువ సిమ్ కార్డుల‌ను వాడుతున్న వారు కూడా అన్నింటినీ ఒకే ఆధార్ నంబ‌ర్‌కు లింక్ చేయ‌వ‌చ్చు. కాక‌పోతే అందుకు స్టోర్ సిబ్బందిని ముందుగానే అడ‌గాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top