దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం ఏంటి ?? ఏ నూనెతో వెలిగిస్తే ఎలాంటి లాభాలు వస్తాయి ??

హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు . అంతేకాక,శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము.

అస్సలు దీపం వెలిగించటం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో తెలుసా ? దీపం వెలిగించడం వల్ల పరిసరాల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయినా విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలానే ఉంటాయి. వీటి వల్ల రక్త కణాలు ఉత్తేజ పడతాయి.

దీపాలను వివిధ రకాల నూనెలతో వెలిగిస్తారు, మరి ఏ నూనెతో వెలిగిస్తే ఎలాంటి లాభం పొందుతామో చూద్దాము..
ఆవు నెయ్యి : ప్రకాశవంతమైన, పరలోక ఆనందం, సంపద మరియు ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది.
నూనె : కీర్తి, సంతోషకరమైన కుటుంబ జీవితం మరియు తెలివి పెరగడానికి సహాయపడుతుంది.
వేప నూనె: వేప నూనెతో దీపం పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది.
నువ్వుల నూనె : ఊహించని ప్రమాదాలు మరియు అడ్డంకులను తొలగిస్తుంది.
కూరగాయల నూనె లేదా ఏ సువాసన నూనె : దాని సువాసన వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top