వాళ్ల‌కేమో జీతాలు మ‌న‌కేమో క‌ష్టాలు – దేశంలో మ‌న‌మే ఎక్కువ.!

త‌రాలు మారినా .తెలంగాణ‌కు స్వేచ్ఛ ల‌భించినా ఇంకా వ‌ల‌స‌లు ఆగ‌లేదు.వెత‌లు తీర‌లేదు. ల‌క్ష‌కు పైగా కొలువులు ఖాళీలున్నా వేల‌ల్లో భ‌ర్తీ చేయ‌క పోవ‌డంతో నిరుద్యోగులు ల‌బోదిబోమంటున్నారు. కోటి ఎక‌రాలకు సాగు నీరందించాల‌న్న ల‌క్ష్యంతో కొత్త స‌ర్కార్ కృత నిశ్చ‌యంతో ఉన్న‌ది. ఎన్నిక‌ల్లో ఓట్లు వేసేందుకు ప‌ట్ట‌ణాల నుండి ప‌ల్లెల్లోకి వ‌చ్చిన జ‌నం తిరిగి బ‌తుకు దెరువు కోసం వ‌ల‌స బాట ప‌ట్టారు. 70 ఏళ్ల‌లో కాంగ్రెస్‌, టీడీపీ , టీఆర్ ఎస్ పాలించినా ప్ర‌జ‌ల బ‌తుకుల్లో మార్పులు రాలేదు. 98 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నం ఓట్లేసి గెలిపించినా స‌మ‌స్య‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయి. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ భోళాశంక‌రుడు. బంగారు తెలంగాణ ల‌క్ష్యంగా ప‌రిపాల‌న కొన‌సాగుతోంది. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అమాంతం పెంచేశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసేశారు. ఆరుగాలం శ్ర‌మిస్తూ పంట పండించే రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర రాక నానా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఇంకొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్య‌ర్థులు ఏజ్ బార్ దాటి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

migrants from telangana

ఇండియాలోనే అత్య‌ధికంగా అల‌వెన్సుల‌ను అంద‌జేస్తోంది గులాబీ స‌ర్కార్‌. నెల నెలా అందే వేత‌నాలు, అల‌వెన్సులు, ప్ర‌యాణ భ‌త్యాలు, టూర్స్‌.ఎన్నో సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నారు. వీళ్ల వ‌ల్ల ఎలాంటి లాభం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తి నెలా 2 లక్ష‌ల 50 వేల రూపాయ‌లు ఒక్కో ఎమ్మెల్యేకు చెల్లిస్తోంది ప్ర‌భుత్వం. దీనిలో మూల వేత‌నం, ఇత‌ర రాయితీలు అంటే ఇంటి అద్దె, ప్ర‌యాణ భ‌త్యం, వైద్య ఖ‌ర్చులు క‌లిపి ఉన్నాయి. ప‌దేళ్ల గ‌ణాంకాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే వంద శాతం కంటే ఎక్కువ‌గా పెరిగాయి. మూల వేత‌నం 12 వేల నుండి 20 వేల‌కు పెంచితే.రాయితీలు 83 వేలుంటే.2 ల‌క్ష‌ల 30 వేలుగా మార్చారు. వీరి వేత‌నాలు పెంచ‌డం వ‌ల్ల రాష్ట్ర బ‌డ్జెట్‌పై 43 కోట్ల భారం ప‌డింది. వేత‌నాలు, సౌక‌ర్యాల పెంపుద‌ల‌లో దేశంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంటే.ఢిల్లీ స‌ర్కార్ 2 లక్ష‌ల 10 వేల‌తో రెండో స్తానంలో ఉన్న‌ది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్ర‌కారం జీతాల‌ను పెంచుకునే సౌక‌ర్యం ఆయా రాష్ట్రాలకు స‌ర్వాధికారాలు క‌ల్పించింది.

ప్ర‌జ‌లు స‌క‌ల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.ఇలా పెంచ‌డం వ‌ల్ల ఏం లాభం అంటూ విప‌క్షాలు ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. అయినా ప‌ట్టించుకునే వారు లేరు. ముఖ్య‌మంత్రికి 4 ల‌క్ష‌ల 21 వేలు ఉండ‌గా .మంత్రుల‌కు ఒక్కొక్క‌రికి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం ఉంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆఫిడ‌విట్‌లో మ‌న ఎమ్మెల్యేలు కోట్ల ఆస్తుల‌ను దాటారు. అయినా సౌక‌ర్యాలు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా రైలులో ప్ర‌యాణం చేస్తే ఫ‌స్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీలు చెల్లిస్తారు. విమానాల్లో ప్ర‌యాణిస్తే మొత్తం ఛార్జీల్లో నాలుగో వంతు ఇస్తారు. ఇత‌ర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేత‌నాలు ఒకేలా ఉండ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గ అల‌వెన్స్ 10 వేలు, కాంటిజెన్సీ అల‌వెన్స్ 5 వేలు, సెక్ర‌టేరియ‌ల్ అల‌వెన్స్ 5 వేలు, క‌న్వీయ‌న్స్ అల‌వెన్స్ 200, టెలిఫోన్ అల‌వెన్స్ 5,500, శాస‌న‌స‌భ‌లో సిట్టింగ్ చార్జీలు రోజుకు 2 వేలు, క‌మిటీ సిట్టింగ్ ఛార్జీలు రోజుకు 2 వేలు, స‌మావేశాల‌కు వెళ్లిన‌ప్పుడు 2 వేలు .చెల్లిస్తారు. త్రిపుర‌లో 25 వేల 980 రూపాయ‌లు త‌క్కువ‌గా ఇస్తున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులుగా పెంచుకోవ‌చ్చు కాద‌న‌లేం.కానీ ఇప్ప‌టికీ తాగేందుకు నీళ్లు లేవు.బ‌తికేందుకు ప‌నులు లేవు.న‌డిచేందుకు రోడ్లు లేవు.ప‌ల్లెలు ఇంకా స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకున్నాయి. అన్నం పెట్టే అన్న‌దాత‌లు అన్న‌మో రామ‌చంద్ర అంటున్నారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు బ‌ల‌వుతున్నారు. ఇంకా పెంచుతూ పోతే బ‌డ్జెట్ మ‌రింత భార‌మ‌వుతుంది. అది ప్ర‌జ‌ల‌కు ప‌న్నుల రూపేణా మోత మోపెడ‌వుతుంది. ఏలిన వారు ఆలోచిస్తే మంచిదేమోన‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

Comments

comments

Share this post

scroll to top