ఈ ఫోటోలో మీ లైఫ్ దాగుంద‌ని మీకు తెలుసా? ఒక్క‌సారి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి.!

అడుగ‌డుగునా క‌ష్టాల‌ను ఎదుర్కుంటూ ఎలా జీవించాలి.? బంధాలు , బంధుత్వాలు వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి.? స‌మాధానాలు దొర‌క‌ని ఇలాంటి ప్ర‌శ్న‌లెన్నో మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.! అయినా మ‌న‌కు తోచిన రీతిలో మ‌న బ‌తుకు బండిని న‌డిపిస్తూనే ఉంటాం. అయితే నిజంగా జీవితం గురించి ఇంతగా ఆలోచించాలా? టెన్ష‌న్ లేని లైఫ్ ను లీడ్ చేయ‌డ‌మెలా? దీని కోసం యండ‌మూరి బుక్స్ చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేదు, రోండా బ్రైన్ థియ‌రీని అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నాలేదు…జ‌స్ట్ ఈ రెండు చిత్రాల‌ను చూడండి…జీవితం మీద మీకే ఓ క్లారిటీ వ‌స్తుంది.!

ఫోటో…1 ఇందులో ఏం క‌నిపించింది.
జిగ్ జాగ్ ( మెలిక‌లు తిరిగి) గా ఉన్న గీత‌లే క‌నిపించాయా?

ఫోటో 2 ఇందులో ఏం క‌నిపించింది.
జిగ్ జాగ్ గా ఉన్న లైన్ మీద రెండు డాట్స్ క‌నిపించాయి…అంతేగా….కానీ మ‌న‌లో కొంద‌రికి…ఈ లైన్స్ లో ఓ ప‌దం క‌నిపించింది. మ‌న‌కు మాత్రం జిగ్ జాగ్ గీత‌ల మీద రెండు డాట్స్ యే క‌నిపించాయి. ఇదే మ‌నం లైఫ్ ను ఏ యాంగిల్ లో చూస్తున్నామో చెప్పే చిన్న ఉదాహ‌ర‌ణ‌. గ‌జిబిజిలో కూడా ఓ అర్థ‌వంత‌మైన ప‌దాన్ని గ‌మ‌నించిన వారు లైఫ్ ను చ‌క్క‌గా లీడ్ చేస్తార‌ని అర్థం..గ‌జిబిజి గీత‌ల‌నే గ‌మ‌నించిన వారు , వారి లైఫ్ ను అర్థవంతంగా న‌డ‌ప‌ట్లేద‌ని అర్థం.

ఆ జిగ్ జాగ్ గీత‌పై రెండు డాట్స్ పెట్ట‌డం వ‌ల్ల అది మినిమ‌మ్ (Minimum) అయ్యింది. అంటే స‌రిగ్గా వెత‌కాలే కానీ…ఆ గ‌జిబిజిలోనే ఓ అర్థం దాగుంది, జీవితం కూడా అంతే…అంతా అర్థంకాన‌ట్టే ఉంటుంది, కానీ ప్ర‌తిదానికి స‌మాధానం అందులోనే ఉంటుంది. జ‌స్ట్ మ‌న దృష్టికోణం, స‌మ‌స్య‌ను మ‌నం చూసే విధానం అంతే తేడా. సో…క‌ష్టానికి భ‌య‌ప‌డ‌కు…ఎదురొడ్డి పోరాడు. క‌ష్ట‌మే నీ కృషికి స‌లాం చేస్తూ సైడ్ అయిపోతుంది.!!

Comments

comments

Share this post

scroll to top