ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కి ఓ స్పెషల్ ఫీచర్..మల్ని తరిమేస్తుంది.! ఎలాగో తెలుసా.? ధర ఎంత?

స్మార్ట్‌ఫోన్లంటే వాటితో ఏం చేస్తారు..? కాల్స్ మాట్లాడ‌తారు. ఎస్ఎంఎస్‌లు పంపుకుంటారు. పాట‌లు విన‌వ‌చ్చు. వీడియోలు చూడ‌వ‌చ్చు. ఫొటోలు తీసుకోవ‌చ్చు. ఇంట‌ర్నెట్ ద‌ర్శించ‌వ‌చ్చు. ఇంకా ఎన్నో ప‌నులు చేసుకోవ‌చ్చు. ఇదంతా ఓకే.. కానీ మీ స్మార్ట్‌ఫోన్‌తో దోమ‌ల‌ను త‌ర‌మ‌గ‌ల‌రా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మీ స్మార్ట్‌ఫోన్‌తో దోమ‌ల‌ను త‌ర‌మ‌గ‌ల‌రా..? అదేంటీ.. ఫోన్ తో దోమ‌ల‌ను ఎలా త‌ర‌మ‌వ‌చ్చు..? అని మీరు సందేహం వ్య‌క్తం చేయ‌వ‌చ్చు. కానీ ఇది నిజ‌మే. ఎందుకంటే అలా దోమ‌ల‌ను త‌రిమే ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ తాజాగా విడుద‌ల చేసింది. మ‌రి ఈ ఫోన్ ధ‌ర ఎంతో తెలుసా..? కేవ‌లం రూ.7,990 మాత్ర‌మే.

ఎల్‌జీ సంస్థ కే7ఐ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో మస్కిటో అవే అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ప్రత్యేక ప్యానెల్ నుంచి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ వస్తాయి. అవి దోమలను తరిమేస్తాయి. అయితే ఈ తరంగాలు మానవులకు ఏ మాత్రం హాని చేయవని ఎల్‌జీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే…

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచ‌ర్లు ఎల్‌జీ కే7ఐ లో ఉన్నాయి. దీన్ని మ‌రో వారం రోజుల్లో స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Comments

comments

Share this post

scroll to top