బాహుబలి-2 లో ప్రభాస్ తో “కట్టప్ప” స్థానంలో దేశాటనకు వెళ్ళింది ఎవరో తెలుసా..? 16 ఆసక్తికర విషయాలు ఇవే..!

త్రివిక్రమ్,మహేశ్ కాంభినేషన్లో వచ్చిన అతడు సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు.ఆ సినిమాకు నిర్మాత మురళీమోహన్..తనే స్వయంగా ఆనాటి అందాల నటుడు శోభన్ బాబు దగ్గరకు వెళ్లి ,సినిమాలోని నాజర్ క్యారెక్టర్ చేయాల్సిందిగా బ్లాంక్ చెక్ ఇచ్చారు..కానీ శోభన్ బాబు దాన్ని తిరస్కరించడంతో నాజర్ చేత ఆ క్యారెక్టర్ చేయించారు.శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి ఏకైక రీజన్ తనని సిని ప్రేక్షకులు ఆనాటి సోగ్గాడిగానే గుర్తుపెట్టుకోవాలనేది శోభన్ బాబు కోరిక..వయసు పెరుగుతున్న కొద్ది తన రూపం మారుతుండడంతో ,అది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అతను సినిమాలకు దూరం అయ్యారు..ఇలాంటి ఇంట్రస్టింగ్ టాపిక్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో…

రవితేజ ఇప్పుడు స్టార్ హీరో కాని..సినిమాల్లో అతని లైఫ్ స్టార్ట్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్ గా..నాగార్జున,టబు నటించిన నిన్నే పెళ్లాడతా మూవీకి కూడా రవితేజ అసిస్టెంట్ గా చేశారు.ఆ సినిమాలో బైక్ రేస్ సీన్లో నాగార్జున హెయిర్ ఎగిరినట్టుగా బాగా కనపడేలా ఫ్యాన్ పట్టుకున్న వారిలో రవి ఒకడు…

గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చనిపోతాడు తెలుసు కదా..ఆ సీన్లో నరేష్ యాక్టింగ్ చూస్తే ఏడుప్పొచ్చేస్తుంది..నరేష్ చనిపోయే సీన్ తీసిన రోజునే నరేష్ పుట్టిన రోజట..

ఈగ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు రమేశ్ క్యారెక్టర్ కి ముందుగా రవితేజని అనుకున్నాట్ట రాజమౌలి.కానీ ఆ సీన్ ని కామెడీగా ముగించాలనుకున్న జక్కన్న తాగుబోతు రమేష్ ని తీసుకున్నార్ట.రవితేజని తీసుకునుంటే రవికి ఉన్న ఇమేజ్ కొద్దైనా సమంతా,రవితేజ ఒక్కటైనట్టు చూపించాల్సోచ్చేది.

తాము డైరెక్ట్ చేసిన సినిమాలో చిన్న క్లిప్పింగ్ లో అయినా డైరెక్టర్లు కనపడడం సహజం..ఇటీవల సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డిలో ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి యాక్ట్ చేసారు తెలుసా..కానీ సందీప్ ముఖం కనపడదు.. ఎక్కడ అని టెన్షన్ పడకండి.ముస్సోరిలో చదువుకుంటున్న అర్జున్ దగ్గరకు ప్రీతి వచ్చిన విషయాన్ని అర్జున్ కి చెప్పే వ్యక్తి రోల్ పోషించింది సందిప్ రెడ్డి వంగా నే…

మన్మదుడు క్లైమాక్స్ లో నాగార్జున నీళ్లలోకి దూకడానికి భయపడతారనేది సీన్..కానీ వాస్తవానికి నీళ్లలోకి దూకడానికి భయపడింది సోనాలి …

ఇరవైనాలుగ్గంటలూ టీవిలో కనిపిస్తున్న లలితా జ్యుయలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ఒక సినిమాలో నటించారు తెలుసా..అది కూడా సూపర్ స్టార్ రజినీ మూవి..రజని ,సోనాక్షి,అనుష్క కాంభినేషన్లో వచ్చిన లింగా మూవీలో జ్యూయలరీ షాప్ ఓనర్ గా కనిపించింది  ఈ కిరణ్ కుమారే..కావాలంటే ఈ సారి గమనించండి.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చిన ఖైదీనెం 150 మూవీ తమిళ సినిమాకత్తికి రీమేక్..దర్శకుడు మురుగదాస్.. విజయ్ తో కత్తి తీయడానికి ముందు మురుగదాస్ ఈ కథను చిరుకి వినిపించారు.బట్  రాజకీయాల్లోకి వెళ్లిన కారణం చేత మెగాస్టార్ నిరాకరించడంతో ,విజయ్ తో తీసారు మురుగదాస్..యాధృచ్చికంగా అదే సినిమా రీమేక్ తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు.

రాజమౌలి ,ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పారని మీలో ఎవరికైనా తెలుసా..ఛత్రపతి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.డబ్బింగ్ పార్ట్ కూడా..బట్ చిన్న క్లిప్ కి డబ్బింగ్ చెప్పడానికి ప్రభాస్ అందుబాటులో లేకపోవడం..సినిమా కంప్లీట్ చేయాల్సిన టైం దగ్గరకు రావడంతో రాజమౌలే ఆ  సీన్లో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పారు.

యమలీల సినిమలో మహేశ్ నటించాలనుకున్నారు.కానీ సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.తర్వాత అదే రోల్లో ఆలి నటించారు..యమలీల ఎంత పెద్ద హిట్టో మనందరికితెలుసు..

బుజ్జిగాడు సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ ఒక సీన్లో గ్లిజరిన్ లేకుండానే నటించారట..గ్లిజరిన్ లేకుండా నటించిన ఎమ్ ఎస్ నాారాయణ మన చేత మాత్రం కంటి తడి పెట్టించారు.

బాహుబలి సినిమాలో శివుడు క్యారెక్టర్లో  ప్రభాస్ శివలింగం ఎత్తే సీన్ అప్పటికి ప్రభాస్ కి షోల్డర్ ఫ్య్రాక్చర్ అయి ఆపరేషన్ అయింది.

మిస్టర్ నూకయ్య సినిమాలో డూప్ లేకుండా ఫైట్ సీన్ చేశారు మంచు మనోజ్..ఆ సీన్లో కాలు ఫ్య్రాక్చర్ అవ్వడంతో ఆరునెలల పాటు ఆ సినిమా షూటింగ్ పెండింగ్ అయింది.

బుజ్జిగాడు సినిమా కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడి పెంచారు.దానికోసం ఆయన డైట్ రూల్స్ ఫాలో అయ్యేవారు.తలైవా సాంగ్ షూట్ చేసేప్పుడు సడన్ గా కళ్లు తిరిగి పడిపోయారు ప్రభాస్..దానికి ఎండగా ఉండడం ఒక కారణం అయితే..లైట్ డైట్..డీ హైడ్రేషన్ మరొక రీజన్.

అల్లు అర్జున్,ఎన్టీయార్ ల డ్యాన్స్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు..కానీ టెంపర్లో మీ నాన్నకు టెంపర్ అనే సాంగ్ చేసేప్పుడు ఎన్టీయార్ ..ఆర్యా 2 లో మై లవ్ ఈజ్ గాన్ సాంగ్ చేసేప్పుడు అల్లు అర్జున్ ..ఇద్దరూ హై ఫీవర్ తో బాదపడుతున్నారు.

బాహుబలి సినిమాలో కట్టప్ప,బాహుబలి దేశాటనకు బయలుదేరతారు.కానీ ఆ సీన్లో కట్టప్ప లాగా తలకు పాగా కట్టుకు గుర్రంపై దేశాటనకు బయల్దేరినట్టుగా రాజమౌలి..బాహుబలి 1 లో కూడా మనోహరి సాంగ్ లో రాజమౌలి కనిపిస్తారు.

గబ్బర్ సింగ్  సినిమాలో కెవ్వుకేక సాంగ్ తర్వాత కనపడేది పవన్ కళ్యాన్ అనుకుంటారు చాలామంది..కానీ అది పవన్ కాదు ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్.

Comments

comments

Share this post

scroll to top