దుష్ట శ‌క్తుల‌ను పార‌ద్రోలే శ‌క్తి నిమ్మ‌కాయ‌ల‌కు ఉందా..?

నిమ్మ‌కాయ‌ల్లో దాగి ఉన్న ఔష‌ధ గుణాల గురించి అంద‌రికీ తెలిసిందే. వీటిని త‌ర‌చూ తీసుకుంటే ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, పోష‌క ప‌దార్థాలు నిమ్మ‌కాయ‌ల్లో ఉన్నాయి. అయితే దీన్ని దిష్టి కోసం, పూజ‌ల్లో ఎందుకు వాడుతారు? ఇంటి గుమ్మానికి, షాపుల్లో దీన్ని ఎందుకు క‌డ‌తారు? తెలుసుకుందాం రండి.

ఆరోగ్యాన్ని కలిగించే ఔష‌ధ గుణాల‌తోపాటు నిమ్మ‌కాయ‌ల్లో కొన్ని అద్భుత శ‌క్తులు దాగి ఉన్నాయ‌ట‌. అందుకోస‌మే అనేక మంది తాంత్రికులు, అఘోరాలు దుష్ట శ‌క్తుల‌ను పార‌ద్రోలేందుకు నిమ్మ‌కాయ‌ల‌ను ఎక్కువ‌గా వాడే వార‌ట‌.

అనేక మంది త‌మ త‌మ ఇండ్లు, దుకాణాల్లో నిమ్మ‌కాయ‌ల‌ను గుమ్మాల‌కు క‌డ‌తారు. ఎందుకో తెలుసా? వీటి వ‌ల్ల ఆయా ప్రాంతాల్లోకి దుష్ట శ‌క్తులు ప్ర‌వేశించ‌కుండా ఉంటాయ‌ట‌.

lemon-black-magic

పురాత‌న కాలంలో విడిపోయిన ప్రేయ‌సీ ప్రియులను క‌లిపేందుకు నిమ్మ‌కాయ‌ల శ‌క్తిని ఉప‌యోగించుకునేవార‌ట‌. ఇందుకోసం వారు పూజ‌లు కూడా చేసేవార‌ట‌.

దిష్టిని పార‌ద్రోలే శ‌క్తి నిమ్మ‌కాయ‌ల‌కు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అందుకే నివాసాల‌కు, షాపుల‌కు, వాహ‌నాల‌కు నిమ్మ‌కాయ‌ల‌ను ఎక్కువ‌గా క‌డ‌తారు.

నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు వ‌ర్తించ‌వ‌ట‌.

ఆత్మ‌ల‌ను త‌రిమికొట్టే శ‌క్తి నిమ్మ‌కాయ‌ల‌కు ఉంద‌ని నమ్ముతారు. అందుకే ఒక‌ప్పుడు ద‌య్యం ప‌ట్టిన వారికి మంత్ర‌గాళ్లు నిమ్మ‌కాయ‌ల‌తో పూజ‌లు చేసేవారు.

ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని దాన్ని 4 స‌మాన భాగాలుగా క‌త్తిరించి ఇల్లు లేదా షాపులో నాలుగు వైపులా ఆ ముక్క‌ల‌ను ఉంచాలి. అలా అవి ఎండిపోయే వ‌ర‌కు వాటిని అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఆ ఇల్లు లేదా షాపు వారికి అన్ని విధాలుగా మంచే జ‌రుగుతుంద‌ట‌.

four-lemon-pieces

Comments

comments

Share this post

scroll to top