లెక్కల పాఠాలు చెప్పమంటే ప్రేమ ఫార్ములాలు నేర్పిన గురువు ఫలితంగా ఏమైందో చూడండి.?

విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సివ గురువులు ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు. బుక్కులోని పాఠాలు చెప్పమంటే ప్రేమ కథలు చెబుతూ తమ వక్ర
బుద్దిని బయటపెడుతున్నారు. ఫలితంగా ఎంతో విలువైన ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చలా వ్యవహారిస్తున్నారు.

ఆయనో లెక్కల మాస్టారు. మ్యాథ్స్ లో ఫార్ములాలకి బదులు క్లోజ్‌నెస్- అట్రాక్షన్= ఫ్రెండ్షిప్, క్లోజ్‌నెస్+ అట్రాక్షన్= రొమాంటిక్ లవ్, అంటూ మహిళ కళశాలలో విద్యార్థినిలకు ప్రేమ ఫార్ములాలను నేర్పించాడు. ఓ విద్యార్థిని తను చెబుతున్న ప్రేమ పాఠాలను ఫోన్లో భందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తన బాగోతం బయటపడింది.

హరియాణలోని కర్నాల్ లో జరిగింది ఈ ఘటన. స్థానిక మహిళల కళశాలలో

మేథమేటిక్స్ బోధిస్తున్న చరణ్ సింగ్ కొన్నాళ్లుగా ఇటువంటి లవ్
ఫార్ములాలు చెబుతున్నాడు. ఆ ఫార్ములాలను బోర్డుపై రాసి మరీ విద్యార్థినులను వేధిస్తూ చంపేస్తున్నాడు. అయితే అతడు చెబుతున్న పాఠాలకి కొందరు అమ్మాయిలు నవ్వారు. కొందరు ఇబ్బంది పడ్డారు. అయినా కూడా నవ్విపోదురు గాక నాకేమి సిగ్గనట్టు ఆ లవ్ గురువు పట్టించుకోలేదు.

యవ్వనంలో ఉన్నప్పుడే చేయ్యాల్సిన పనులు చేయాలని. ఆ తరువాత ఎంత బాధపడిన లాభం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా భార్యాభర్తలు వృద్దాప్యంలో అడుగుపెట్టాక వారి మధ్య ఆకర్షణ తగ్గిపోతుందంటూ ఆ తరువాత వాళ్లు కేవలం స్నేహితుల్లా ఉంటారని.. ఏదేదో చెప్పుకొచ్చాడు.

దీంతో విసుగెత్తిన ఓ అమ్మాయి అతడు చెబుతున్న ప్రేమ పాఠాల వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దంతో వైరల్ అయినా ఆ విడియో చివరికి ఆ మాస్టారు ఉద్యోగం ఉడిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభం ఈ విషయంపై అతడు క్షమాపణ చెప్పిన లాభం లేక పోయింది.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top