జయలలిత డెత్ మిస్టరీ గురించిన డీటైల్స్ మా దగ్గరున్నాయ్ :లీజియన్‌ క్రూ

జయలలిత డెత్ మిస్టరీ గురించిన డీటైల్స్ మా దగ్గరున్నాయ్…మేం నోరు విప్పితే భారతదేశంలో రాజకీయ అలజడే అంటూ బాంబు పేల్చింది హ్యాకింగ్ సంస్థ లీజియ‌న్ క్రూ. గతంలో రాహుల్ గాంధీ, విజయ్ మాల్యాలా ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన సదరు సంస్థ…..తాజాగా అపోలో ఆసుపత్రికి సంబంధించిన స‌ర్వ‌ర్లు అన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్నామ‌ని చెపుతోంది. దేశంలోని రాజ‌కీయ ప్రముఖులు, కీల‌క జ‌ర్న‌లిస్ట్ ల స‌మాచారం సైతం త‌మ గుప్పిట్లో ఉంద‌ని సంచ‌ల‌నం వార్త‌ను బ‌హిర్గతం చేసింది. వాషింగ్ట‌న్ పోస్ట్ కు అందిన ఛాటింగ్ ద్వారా…లీజియన్ క్రూ అనే హ్యాకింగ్ సంస్థ ఈ విషయాలను తెల్పింది.

bigg

లీజియన్‌ క్రూ (ఎల్‌సీ) చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. 

  • అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు అన్ని త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయి.
  • అందులో భారత దేశ‌ రాజకీయ ప్రముఖులు, బ‌డా వ్యాపారులు, సినీ హీరోల‌ డేటా ఉంది.
  • జ‌య‌ల‌లిత మ‌ర‌ణానికి సంబంధించిన పూర్తి స‌మాచారం మేము హ్యాక్ చేశాం.
  • ఈ స‌మాచారాన్ని బ‌య‌ట‌కి చెపితే.. భారత్‌లోఅల‌జ‌డి రేగ‌డం ఖాయం.
  • క‌ల్లోల వాతావ‌ర‌ణాన్ని సృష్టించే స‌మాచారం త‌మ గుప్పిట్లో ఉంద‌ని షాక్ కు గురి చేసింది లీజియ‌న్ గ్రూప్.
  • లీజియ‌న్ గ్రూప్ చెప్పిన‌ట్టుగానే జ‌రిగితే చెన్నై అపోలో గుట్టు ర‌ట్ట‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. త‌మిళ‌నాడుతో పాటుగా దేశ వ్యాప్తంగా రాజ‌కీయ అల‌జ‌డి రేగ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది.
  • అయితే ఈ సమాచారం విడుదలపై మాత్రం ఎల్‌సీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి వివరాలివ్వలేదు. కానీ, పలు భారత సర్వర్ల నుంచి సేకరించి, క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా ఉందని మాత్రం చెప్పింది. ఈ సంస్థ చాలాకాలంగా ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను హ్యాక్‌ చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, వివాదాస్పద పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా, జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్‌ కుమార్‌ వంటి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసింది కూడా ఈ సంస్థ‌నే కావ‌డం గ‌మ‌నార్హం.

Comments

comments

Share this post

scroll to top