ఎం.ఎస్.నారాయణ గారి వర్థంతి సందర్భంగా ఆయన గురుంచి కొన్ని విషయాలు మీకోసం.!!

ఎమ్.ఎస్.నారాయణ గారు ఏప్రిల్ 16 1951 లో జన్మించారు, జనవరి 23 2015 న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు, ఆయన మరణం హాస్య ప్రపంచానికి తీరని లోటు, ఇప్పటికి ఆయన మన మధ్య లేరంటే నమ్మశక్యం కాదు, ఆయనంటే అందరికీ ఇష్టమే, బ్రహ్మానందం గారి తరువాత సీనియర్ కమెడియన్స్ లో ఎక్కువగా పాపులర్ అయ్యింది ఎమ్.ఎస్ గారే.

M.S గా పిలువబడే ఆయన పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. ఎమ్.ఎస్.నారాయణ గారు దాదాపు 700 చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు, తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు. సినిమాల్లోకి రాకముందు ఎమ్.ఎస్.నారాయణ గారు భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యారు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశారు కథా రచయితగా తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క.

ఎమ్.ఎస్.నారాయణ గారు పేరు తెచ్చుకున్న కొన్ని సంభాషణలు :

సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు (బన్ని)

ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి (అతడు)

ఏం చేస్తున్నావ్ , ఏం చేస్తున్నావ్ , అని మాటిమాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను (నువ్వు నాకు నచ్చావ్)

అమ్మా … నీ కళ్ళేవీ? (నువ్వు నాకు నచ్చావ్)

షేక్ ఇమామ్ (శివమణి)

ప్యాక్ అప్ (పటాస్)

ఎమ్.ఎస్.నారాయణ గారికి నంది అవార్డులు తెచ్చిన సినిమాలు :

ఉత్తమ హాస్యనటుడు – శివమణి, 2003.

ఉత్తమ హాస్యనటుడు – దూకుడు, 2011.

ఇంకా ఆయన చెప్పిన చాలా డైలాగ్స్ ఇప్పటికి జనాల మదిలోనే ఉన్నాయి, దూకుడు లో ఎమ్.ఎస్.నారాయణ గారు చేసిన స్పూఫ్ ఎవర్ గ్రీన్. హాస్యమే కాదు, పిల్ల జమిందార్ సినిమాలో ఆయన చేసిన ఎమోషనల్ సీన్స్ కానీ, బుజ్జిగాడు లో ఎమోషనల్ సీన్స్ కానీ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాయి. ఆయన ఎప్పటికి మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

 

Comments

comments

Share this post

scroll to top