బ్లడ్ లో లెడ్, అచ్చం మ్యాగీ లాగా!!

లెడ్ శాతం ఎక్కువగా ఉందని మ్యాగీని సరిహద్దుల దాకా తరిమికొట్టాం. అయితే ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. పోలీసుల బ్లెడ్ లో కూడా అధిక శాతం లెడ్ ఉందని తాజాపరిశోధనలో తేలింది. కర్ణాటక కాలుష్య నివారణ మండలి వినతిమేరకు నేషనల్‌ రెఫరల్‌ సెంటర్‌ ఫర్‌ లెడ్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌ ఇండియా (ఎన్‌ఆర్‌సిఎల్‌పిఐ) సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది.

led in police blood due to traffic

 

సాధారణంగా  నగరంలో నివసించే ప్రజలలో 5 మైక్రో గ్రాముల సీసం పరిమాణం ఉండడం సామాన్యమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ మధ్యన దుమ్ము,ధూళితో విధులు నిర్వహించే పోలీసులలో సీసం పరిమాణం అత్యధికంగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ట్రాఫిక్‌ పోలీసులు విషతుల్యమైన సీసం బారిన పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.ట్రాఫిక్ పోలీసుల రక్తం సేకరించి పరీక్ష చేయగా అందులో  1.38 శాతం రక్తంలో సీసం పరిమాణం ప్రమాదపుటంచులలో ఉందన్న విషయం తెలిసింది. పరీక్షలు చేయించుకున్న పోలీసులలో 3.3 నుంచి 10 మైక్రో గ్రాములు ఉందన్న అంశం వెల్లడైంది.

auto releasing polution

 

ఎండా ఉంటు, వానా ఉండదు డ్యూటీ చేస్తూనే ఉండాలి దానికి తోడు కాలం చెల్లిన  వాహనాల నుండి వచ్చే పొగను పీల్చుతుండాలి ఇది ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ. తినే పదార్థాన్నే తరిమిన మన అధికారులు,  రొడ్డు పై దర్జా గా పొగను వదులూపోతున్న వాహనాలను మాత్రం అంతగా పట్టించుకోకపోవడం బాధాకరం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top