మనవల్ని ఎత్తుకోవాల్సిన వయసులో కొడుకు కావాలంటకర్ణాటకలో కీచక తండ్రి!!

అతడో తండ్రి. తనకి ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. అయితే కొడుకు చిన్న వయసులోనే మరణించాడు. పెద్ద కూతురికి పెళ్లి కూడా చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా…తనకి వారసుడు కావాలని లేటు వయస్సులో తన ముర్ఖత్వపు ఆలోచనతో రెండో పెళ్లి చేసుకుని, మొదటి భార్యను, అలాగే పిల్లలను పట్టించుకోవడం మానేసాడు.

కర్ణాటకలోని బెళగావి దగ్గర కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ పాటిల్‌కి 25 ఏళ్ళ క్రితం మహాదేవి అనే మహిళతో పెళ్లైంది.అదే గ్రామంలో పాటిల్ తన భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాడు. జీవితంలో అతనికి ఏం దుర్బుద్ది పుట్టిందో ఏమో కానీ కొడుకు చిన్నప్పుడే చనిపోవడంతో వారసుడు కావాలని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మొదటి భార్య పిల్లలను పట్టించుకోవడం మానేసాడు. కొత్త కాపురాన్ని కూడా సొంతూరు నుండి బెళగావికి మార్చేసాడు.

మొదటి భార్య మహాదేవి మాత్రం నర్సు ఉద్యోగం చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. రాను రాను అమ్మాయిల చదువు, కుటుంబ పోషణ ఆమెకు భారంగా మారడంతో ఇద్దరు కూతుళ్లు తండ్రిని తీసుకురావడానికి ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు కూతుళ్లు. గ్రామస్తులు కూడా అమ్మాయిలకు మద్దతుగా నిలిచారు. బాళెగౌడకు బుద్ధి చెప్పాలని పోలీసులను డిమాండ్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు

Comments

comments

Share this post

scroll to top