బాత్ రూంలో ట్యాప్ నుంచి నీరు లీక్ కాకూడ‌దట‌. అలా అయితే వాస్తు ప‌రంగా ఏమ‌వుతుందో తెలుసా..?

వాస్తు అంటే వాస్తే మ‌రి. కేవ‌లం ఇంటికి మాత్ర‌మే కాదు, అందులో ఉండే బాత్‌రూమ్‌ల‌కు కూడా వాస్తు వ‌ర్తిస్తుంది. బాత్‌రూంలు ఇంట్లో ఎన్ని ఉన్నా, బ‌య‌ట ఎన్ని ఉన్నా క‌చ్చితంగా వాస్తు వాట‌న్నింటికీ వ‌ర్తిస్తుంది. ఈ క్రమంలోనే బాత్‌రూంల‌లో కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాటి వ‌ల్ల ఆ ఇంట్లో ఉంటున్న వారంద‌రికీ అనారోగ్యంగా ఉండ‌డ‌మో లేదంటే డ‌బ్బు ఎప్పుడూ వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చ‌వ‌డ‌మో జ‌రుగుతూ ఉంటుంది. మ‌రి అలా కాకుండా ఉండాలంటే ఎవ‌రైనా బాత్‌రూం విష‌యంలో పాటించాల్సిన సూచ‌న‌లు ఏమిటో, వాటిలో ఉండే వాస్తు దోషాల‌ను ఎలా తొల‌గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బాత్‌రూంలో ఉండే వాస్తు దోషం పోవాలంటే అందులో ఎప్పుడూ ఒక నీలం రంగు బ‌కెట్‌ను ఉంచాలి. ఎందుకంటే ఈ రంగుకు వాస్తు శాస్త్రంలో బాగా ప్రాముఖ్య‌త ఉంది. దీంతో ఈ రంగు ఉన్న బ‌కెట్‌ను బాత్‌రూంలో ఉంచితే అప్పుడు ఇంట్లో ఉన్న నెగెటివ్ శ‌క్తి పోతుంది. పాజిటివ్ శ‌క్తి ఉత్ప‌న్న‌మ‌వుతుంది. త‌ద్వారా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే పోతాయి. డ‌బ్బు వృథాగా ఖ‌ర్చు కాదు. అయితే ఆ బ‌కెట్‌లో ఎల్ల‌ప్పుడూ నిండుగా నీటిని నింపి మాత్రం పెట్టాలి. దీంతో పాజిటివ్ శ‌క్తి మ‌రింత పెరుగుతుంది.

2. బాత్‌రూం డోర్‌కు ఎదురుగా లోప‌ల అద్దాన్ని ఉంచరాదు. అలా ఉంచితే ఇంట్లో ఉండే నెగెటివ్ శ‌క్తి బాత్‌రూం లోప‌లికి వెళ్లి ఎదురుగా ఉన్న అద్దం నుంచి ప్ర‌తిబింబించి మ‌ళ్లీ ఇంట్లోకే ఆ నెగెటివ్ శ‌క్తి వ‌స్తుంది. క‌నుక అలా చేయ‌రాదు. బాత్‌రూంలో ఏదో ఒక వైపు అద్దాన్ని పెట్టుకోవ‌చ్చు. కానీ డోర్ ఎదురుగా మాత్రం అద్దాన్ని పెట్ట‌రాదు.

3. బాత్‌రూంను వాడ‌గానే వెంట‌నే డోర్‌ను క్లోజ్ చేయాలి. డోర్‌ను ఎల్ల‌ప్పుడూ క్లోజ్ చేసే ఉంచాలి. లేక‌పోతే బాత్‌రూంలో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ ఇంట్లోకి వ‌స్తుంది. అది అంద‌రికీ అనారోగ్యాల‌ను క‌లిగిస్తుంది.

4. బాత్‌రూంలోనే కాదు, ఇంట్లో ఇత‌ర ప్ర‌దేశాల్లో ట్యాప్ ఎక్క‌డ ఉన్నా దాన్నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. లేదంటే నీటి లీక్ లాగానే డ‌బ్బు కూడా వృథాగా ఖ‌ర్చ‌వుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

5. ట్యాప్‌ను అలాగే తిప్పి ఉంచి నీటిని వేస్ట్ చేయ‌రాదు. చేస్తే డ‌బ్బులు వృథాగా ఖ‌ర్చ‌వుతాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు ఆరోగ్యం బాగుండ‌దు.

6. బాత్‌రూంను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అందులో నెగెటివ్ ఎన‌ర్జీ పెరిగిపోతుంది. అలా పెరిగిన త‌రుణంలో అది ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న‌వారి ఆరోగ్యం పాడ‌వుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు వస్తాయి.

Comments

comments

Share this post

scroll to top