ఈ భిక్షగాడు "లా" చదువుతున్నాడు, లాయర్ కావడమే అతని లక్ష్యమట!

ఓ భిక్షగాడు తానడుక్కున డబ్బులతో ఏం చేస్తాడు..? మా అంటే కడుపునిండా తిని ఫుట్ పాత్ పక్కన పడకేస్తాడు, ఇంకా లేదంటే సారా పాకెట్  నిశాలో జోగుతుంటాడు. కానీ ఈ శివ్ సింగ్ అందరిలాంటి భిక్షగాడు కాదు.  బెగ్గింగ్ ను తన లక్ష్యాన్ని సాధించే సాధనంగా ఉపయోగిస్తున్నాడు..  48 ఏళ్ళ శివ్ సింగ్  రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలో గల గంగాపూర్ లో తెల్లవారుజామునే రోడ్లను ఊడుస్తూ, జనం దగ్గర డబ్బులడుక్కుంటుంటాడు. అలా అడుక్కున్న డబ్బులతోనే… రాజస్థాన్ యూనివర్సిటీలో చేరి తనకిష్టమైన,  తన లక్ష్యమైన “లా” కోర్సు లో చేరాడు, ఎలాగైనా లాయర్ కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

మనోడి దిన చర్యగా కూడా చాలా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది.  ఉదయం మూడు గంటలకే లేచి..రోడ్లను ఊడ్చుకుంటూ, జంక్షన్లో ఆగే కార్ల అద్దాలు తూడుచుకుంటూ డబ్బులు అడుక్కుంటాడు. మధ్యాహ్నం  3  కాగానే లా  కాలేజ్ లకు వెళ్ళి. ప్రొఫేసర్ చెప్పే వాటిని  నోట్ చేసుకుంటాడు . ఇంటికొచ్చాక మళ్లీ కాలేజ్ లో ప్రోఫేసర్ చెప్పిన పాఠాలను మరోసారి చదువుతాడు. మరోవిషయం ఏంటంటే ఇప్పటి వరకు శివ్ సింగ్  ఒక్క రోజు కూడా కాలేజ్ కు డుమ్మా కొట్టలేదు. క్లాస్  ఉంటే కాలేజ్ లో,  క్లాస్ లేకపోతే లైబ్రరీలో “లా” పుస్తకాలతో  బిజీగా గడుపుతాడు శివ్ సింగ్.

shiv-singh-750x500

ఈ వయసులోనూ చదువు కోసం ఇంతలా పరితపిస్తున్న శివ్ సింగ్ న్యాయశాస్త్రం పూర్తిచేసి, కోర్టులో లాయర్ గా ఉన్నత పదవి సంపాదించి, ఉన్నత స్థానంలో నిలవడమే తన లక్ష్యమని చెబుతాడు. దాని కోసం అడుక్కోడాన్నే వృత్తిగా ఎందుకెంచుకున్నాడని అడగాలనిపిస్తుంది కానీ అతని లక్ష్యం కోసం….. తనకు తెలిసిన  మార్గాన్ని ఎంచుకున్నాడు లే అనిపిస్తుంది. ఎందకంటే దొంగతనం కంటే అడుక్కోడం ఉత్తమమే కదా… త్వరగా శివ్ సింగ్ తన లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుందాం.!

Comments

comments

Share this post

scroll to top