ఎన్టీఆర్ కు అత్తగా నటించమని “త్రివిక్రమ్” అడిగితే…”లయ” ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో తెలుసా.?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు..కాని ఎన్టీయార్ ,త్రివిక్రమ్ కాంభినేషన్లో రాబోతున్న సినిమాలో నటించమని  స్వయంగా త్రివిక్రమే  సంప్రదించినా ఒకప్పటి నటి యాక్సెప్ట్ చేయకపోవడం విశేషం..ఇంతకీ త్రివిక్రమ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయని నటి ఎవరనుకున్నారు లయ..ఆవిడ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే…

అజ్ణాతవాసి ప్లాప్ తో   త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నారు త్రివిక్రమ్.అందుకే  ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నాడు.అందులో భాగంగానే ఒకప్పటి పరిచయంతో నటి లయను సంప్రదించారట…వీరిద్దరికి ఎప్పుడు పరిచయం అంటే లయ మొదటి సినిమా స్వయంవరం కి త్రివిక్రమే రచయిత…లయని ఎన్టీయార్ కి అత్తగా నటించాలని కోరారట త్రివిక్రమ్..

స్వయంవరం సినిమాతో టాలివుడ్ కి పరిచయమైన నటి లయ.తన అభినయంతో అందరిని ఆకట్టుకుంది..స్వయంవరం తర్వాత ప్రేమించు,టాటా బిర్లా మధ్యలో లైలా,మిస్సమ్మలాంటి అనేక సినిమాల్లో నటించింది.పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయింది..ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది.ఇద్దరు పిల్లలు,భర్తతో హాయిగా కుటుంబ జీవితాన్ని గడుపుతుంది.హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వడం,మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం సర్వసాధారణం.సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి పాత్ర రావాలని కోరుకుంటారు..త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కంటే పెద్ద ఛాన్స్ ఏముంటుంది..కాని లయ త్రివిక్రమ్ సినిమాలో నటించనని చాలా సున్నితంగా చెప్పేసింది.

డైరెక్టర్ గారు.. నా వయస్సెంతో తెలుసా? ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఎలా చేయగలను..నాకు సినిమాల్లో బాగా గ్యాప్ వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటించినా మంచి క్యారెక్టర్ చేయాలి కానీ ఈ అత్త క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించిందట లయ. దీంతో త్రివిక్రమ్ బిక్కమొఖం వేశారట. ఇప్పటికే నదియా, ఖుష్భూ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు త్రివిక్రమ్ లయ దృష్టికి తీసుకెళ్ళారట. అదంతా నాకు తెలుసు.. కానీ నేను మీరు చెప్పే క్యారెక్టర్లో అస్సలు నటించలేను. దయచేసి క్షమించడంటూ సున్నితంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిందట లయ.ఇప్పుడు ఇదే విషయం టాలివుడ్లో హాట్ టాపిక్ గా మారింది

Comments

comments

Share this post

scroll to top