ఆఫరేషన్ చేయించుకోలేని వారు ఈ నెంబర్ కి కాల్ చేయమని పోస్టు చేసిన లారెన్స్..అందరికి షేర్ చేయండి..

తాను రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని నిరూపించుకున్నాడు నటుడు ,దర్శకుడు రాఘవ లారెన్స్.ఇప్పటివరకు  ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన లారెన్స్ ఎందరో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాడు..తన అభిమాని ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కోరికేంటో తెలుసుకుని సొంత ఇల్లు కట్టించి ఆ కుటుంబానికి ఇచ్చాడు..ఇలా చెప్పుకుంటూ పోతే లారెన్స్ చేసిన సేవలు  ఎన్నో..ఎన్నేన్నో…

జల్లికట్టు వివాదంలో తన వంతు సపోర్ట్ అందించిన లారెన్స్ , ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి, తన గొప్ప మనసుని నిరూపించుకుని…అందరి మనన్ననలు పొందారు. ‘ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రాఘవ లారెన్స్ ఇప్పటికి ఎంతో మంది పిల్లలకి ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. ఇప్పటి వరకూ ఆయన తన ట్రస్ట్ ద్వారా 141 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా శివాని అనే పాప హార్ట్ లో హోల్ ఉండటంతో ఆ పాపకి ఆపరేషన్ చేయించాడు. “141వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది.ఒక ఏడాది వయసు ఉన్న శివాని అనే పాప.. హార్ట్‌లో హోల్ ఉండటంతో ఆపరేషన్ నిర్వహించాము. పాప ప్రస్తుతం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందానికి థ్యాంక్స్” చెబుతూ..ఆ పాప ఆపరేషన్ సక్సెస్ అయినందుకు ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు లారెన్స్ .

“అంతేకాకుండా ఇంకెవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటే 09790750784, 09791500866 నంబర్ల ద్వారా మా ట్రస్ట్ ని కాంటాక్ట్ చేయండి” అని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. లారెన్స్ లాగా మనం ఆ చిన్నారులకు ఏం చేయలేకపోవచ్చు…కాని ఈ విషయాన్ని షేర్ చేసి మనవంతు సాయం చేద్దాం…  హ్యాట్సాఫ్ లారెన్స్…

Comments

comments

Share this post

scroll to top