ఒకపక్క హిట్లు లేవు అని బాధ పడుతుంటే…ఇప్పుడు “లావణ్య త్రిపాఠి” కి 3 కోట్ల జరిమానా.! ఎందుకు?

‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన చొట్టబుగ్గ చిన్నది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే కుర్రకారుని కట్టిపడేసింది. ఆ తరవాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. చీరలు, ఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ కితాబులందుకుంది. కానీ ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ‘మిస్టర్’, ‘రాధ’, ‘యుద్ధం శరణం’ సినిమాలు లావణ్యకు పెద్దగా పేరేమి తెచ్చిపెట్టలేదు. లావణ్య తాజాగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రంలో నటిస్తున్నప్పటికీ కెరీర్‌పై లావణ్యకు దిగులు పట్టుకుంది.

దీనికి తోడు లావణ్య త్రిపాఠికి కోలీవుడ్‌ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన ‘100%లవ్‌’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. కానీ అప్పటికే నిర్మాతలకు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. దాంతో లావణ్యపై ఆ రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాలు అంటున్నాయి. మరోపక్క ఈ చిత్రంలో కథానాయికగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేం షాలిని పాండేను ఎంపికచేసుకున్నారు. జరిమానా విషయమై లావణ్య నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

Comments

comments

Share this post

scroll to top