లేట్ వచ్చినందుకు మహిళా ఉద్యోగిని అతను కాలితో త‌న్నాడు? అది కాస్తా CCTV లో రికార్డ్ అయ్యింది!

కర్ణాటకలో ఓ ఉద్యోగినిపై ఆమె పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలోనే దాడి జరిగింది. సహచర అధికారి ఒక్కసారిగా లేచి ఆమెను అమానుషంగా తన్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది. రాయ్‌చూర్‌ జిల్లాలోని సింధనూరు సిటీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎస్సీఎంసీ) కార్యాలయంలో శరణప్ప అనే వ్యక్తి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే కార్యాలయంలో పుల్‌టైమ్‌ ఉద్యోగినిగా నస్రీన్‌ అనే ముస్లిం మహిళ పనిచేస్తున్నది.

ఈ నెల 10వ తేదీన ఆమె పవిత్ర రంజాన్‌ మాసపు ఉపవాస దీక్షలో ఉండి.. కార్యాలయానికి రాగా ఉన్నపళంగా శరణప్ప ఆమెపైకి వెళ్లి కాలితో తన్నాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించినా..కనికరించకుండా అతను ఈ దాడి చేశాడు. అతను ఎందుకిలా చేశాడన్న దానిపై కారణాలు ఇంకా తెలియరాలేదు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు శరణప్పను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top