ప్రాణాలు విడుస్తూ మేయర్ దంపతుల పలికిన చివరి మాటలు.."వద్దురా వదిలేయ్ రా నీ మేనత్తని రా"..!?

గ్రీవెన్స్ డే లో ప్రజల నుండి వినతీ పత్రాలు తీసుకుంటున్న చిత్తూరు మేయర్ ఛాంబర్లోకి బురఖా ధరించిన వచ్చిన వ్యక్తి నేరుగా మేయర్ అనురాధ వద్దకు వెళ్లాడు, వెళ్లడంతోనే హ్యండ్ బ్యాగ్ లోని రివాల్వర్ తీసి అనురాధకు టార్గెట్ చేశాడు… తనను కాల్చడానికి సిద్దమైన వ్యక్తిని చూసి అరేయ్ నేను నీ మేనత్తని రా.. వద్దురా వదిలేయ్ రా అంటూ చేతులు జోడించి వేడుకుంది అనురాధ, తనను కాల్చడానికి వచ్చిన మేనల్లుడి కాళ్లను పట్టుకోడానికి సైతం ముందుకు వంగిందంట కానీ అంతలోనే అతడు కాల్పులు జరపడం, బుల్లెట్ సరిగ్గా పాయింట్ బ్లాక్ లోకి దూసుకెళ్లడం అనురాధ అక్కడిక్కడే ప్రాణాలు వదలడం జరిగిపోయాయి.

-858753861899054384030189

మరోవైపు భార్యను రక్షించడానికి ప్రయత్నించిన మోహన్ పై బురఖాతో వచ్చిన మరో వ్యక్తి కత్తి దూయడంతో దాని నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీశాడు.  బయటకు పారిపోతున్న తన మేనమామ మోహన్ పై కూడా మేనల్లుడు చింటూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మోహన్ కడుపులోకి ఓ బుల్లెట్ దూసుకువెళ్లింది. అయినప్పటికీ మోహన్ బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టాడు. ఇదే సమయంలో కాపు కాచుకుని కూర్చున్న మరో ముగ్గురు చింటూ అనుచరులు అతడిని చుట్టుముట్టారు . రెప్పపాటులో మొత్తం ఐదుగురు మోహన్‌ను చుట్టుముట్టి కత్తులతో దారుణంగా ఇష్టమొచ్చినట్టు పొడిచారు. కత్తి పోట్లకు గురయ్యి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ మోహన్ తన అనుచరులతో..మీ అక్కను, నన్ను దారుణంగా చంపేస్తుంటే.. ఏం చేస్తున్నార్రా? అంటూ పడిపోయాడు.

18CTR27_1

Comments

comments

Share this post

scroll to top