బాల్య వివాహాలు,ఇష్టం లేని పెళ్లిళ్ల వలన చాలా వరకూ నెగటివ్ రిజల్స్టే వస్తాయి..ఎప్పుడు ఏదో ఒక గొడవలు లేదంటే ఇష్టంలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు వినాల్సొస్తుంది.అలాంటి పెళ్లిళ్లవలన వ్యక్తులనే కాదు కుటుంబాలను కూడా కోల్పోవలసి వస్తుంది…ఒక యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేసారనే సాకుతో ఇంటిల్లి పాదిని హత్య చేసింది.భర్తని చంపాలనుకుని ప్లాన్ వేయండంతో,అది బెడిసికొట్టి..దానికి కుటుంబం మొత్తం బలైపోయింది..పాకిస్తాన్ లోని ముజఫర్ గఢ్ లో…
పాకిస్తాన్ లో ని ముజఫర్ గఢ్ జిల్లకు చెందిన ఆసియాకు చిన్నతనంలోనే పెళ్లి చేసారు..ఒకవైపు ఇష్టం లేని పెళ్లి,మరొవైపు ఆ సియా మరికతన్ని ప్రేమించడంతో..ఏమి చేయలేని పాలుపోని స్థితి ఆసియాది.ఎట్టకేలకు భర్తతో కాపురం చేయడం ఇష్టం లేకఎలా అయినా అతన్ని వదిలించుకోవాలనకుంది..అతడి చావే తన సమస్యకు పరిష్కారం అని భావించిన ఆసియా విషం కలిపిన పాలు అతడికి ఇచ్చింది. కానీ అతడు ఆరోజు ఎందుకో ఆ పాలు తాగలేదు. అయితే అవే పాలను తోడు వేసి పెరుగు చేసి, ఆ పెరుగుతో లస్సీ చేసింది. ఆ లస్సీని భర్తకు, అతని కుటుంబ సభ్యులకు అందజేసింది. విషం కలిపిన లస్సీ తాగి భర్తతోపాటు మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసియా, ఆమె ప్రియుడు, మరో మహిళ కలిసి ఈ హత్యాకాండకు ప్రణాళిక వేసినట్టు పోలీసులు చెప్తున్న సమాచారం.
చిన్నవయసులో పెళ్లి చేయడం, అత్తారింట్లో కష్టాలు, వివాహేతర సంబంధాల కారణంగా పాకిస్థానీ మహిళలు కొన్ని సార్లు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుంటారు అని వార్తల సారాంశాం.పాకిస్థాన్ అనేకాదు ప్రపంచంలో ఎక్కడైనా స్త్రీకి తన కంటూ ఒక మనసుంటుంది.అంతే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్ధిక స్వాతంత్రం కోరుకుంటున్నారు.తమ కాళ్లపై తాము నిలబడాలని ఆలోచిస్తున్నారు.అలా కాకుండా పెళ్లి అనే ముకుతాడు వేస్తే కొందరు మాత్రమే దానికి అడ్జస్ట్ అయి బతుకుతున్నారు.మరికొందరు ఎదిరించి తమ జీవితంలో కోల్పోయిన దాన్ని సాధించుకుంటున్నారు..ఇంకోందరు ఆసియాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇతరుల లైఫ్ స్పాయిల్ చేయడంతో పాటు వారి జీవితాలను కూడా పోగొట్టుకుంటారు.