అక్కడ కిలోల్లో “లాప్టాప్”లు…50 వేల లాప్టాప్ 5 వేలకే..! ఎక్కడో తెలుసా.? ఎందుకలా.?

కిలో ల్యాప్ టాప్ ఐదువేల రూపాయలు… రెండు కిలోలు…పదివేలు..మూడు కిలోలు ల్యాప్ టాప్లు… హే ఆపవయ్యా అవేమైనా కూరగాయలు అనుకుంటున్నారా కిలోలెక్కన అమ్మడానికి..నిజం అండీ ల్యాప్ టాప్ లే కాదు,మొబైల్ ఫోన్స్ కూడా కిలోలెక్కన కొనుక్కోవచ్చు..చెవుల్లో పువ్వులు పెట్టడానికి మేమే దొరికామా అని తిట్టుకోకండి..నిజంగా వేలకు వేలు విలువచేసే ల్యాప్టాప్లు,మోబైల్ ఫోన్లు అతితక్కువ రేటుకి కొనుక్కోవచ్చు..ఎక్కడో తెలుసుకోండి..
ఇలా తక్కువ రేటుకి కిలోలెక్కన అమ్మే షాపులు ఎక్కడో కాదు మన దేశరాజధాని ఢిల్లీలోనే ఉన్నాయి.ఇక్కడ ఒక  మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ల్యాప్‌టాప్‌లను కిలో లెక్కన విక్రయిస్తారు.ఈ మార్కెట్ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో ఉంది. షోరూమ్‌లలో రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకూ ఉంటే ల్యాప్‌టాప్‌లను ఇక్కడ తూకం వేసి అమ్మేస్తుంటారు. మంచి కండీషన్లో ఉన్న ల్యాప్‌టాప్‌లు కిలో రూ. 5 వేల చొప్పున ఇక్కడ లభ్యమవుతాయి. ఈ మార్కెట్ దేశంలోనే అత్యంత చవకైన మార్కెట్‌గా పేరొందింది. ఇక్కడ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు మొదలైనవాటిని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నూతన డివైజెస్‌తో పాటు సెకెండ్ హ్యాండ్‌వి కూడా లభ్యమవుతాయి. ఇలాంటి దుకాణాలు ఇక్కడ లెక్కకు మించి ఉన్నాయి. అయితే ఇక్కడ వేటినైనా కొనుగోలు చేసేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం మనకే మంచిది. ఇక్కడ కేవలం రూ. 7 వేలకే సెకెండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ లభిస్తుందట.అంతేకాదు వీటిపై డిస్కౌంట్ కూడా ఇస్తారట..మరింకందుకు ఆలస్యం..ఛలో ఢిల్లీ…

Comments

comments

Share this post

scroll to top