ల్యాప్‌టాప్‌ల‌ కు ఉండే ఈ చిన్న రంద్రం దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

ల్యాప్‌టాప్‌లు కొనే ముందు ఫీచర్స్, ర్యామ్, స్టోరేజ్, చిప్ చూసి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసాక ల్యాప్‌టాప్‌లో ఉండే అన్ని పోర్ట్స్, హోల్స్ గురించి మనం తెలుసుకుంటాం లేదా మనకు తెలిసి ఉంటుంది, కానీ ల్యాప్‌టాప్‌లో ఉండే ఒక చిన్న రంధ్రం గురించి మీలో చాలా మందికి తెలిసుండక పోవచ్చు.

లాక్ కర్ దో.. :

ల్యాప్‌టాప్‌ల‌కు వెనుక లేదా ప‌క్క‌ల‌కు ఓ స్లాట్ లేదా రంద్రం ఉంటుంది, అయితే అది నిజానికి స్లాట్ లేదా హీట్ బయటకి వెళ్ళడానికి ఉండే రంద్రం కాదు. అది ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ఉంచిన ఓ లాక్‌. ఆ రంద్రం తో లాక్ చేసుకోడం ఎలా అని అనుకుంటున్నారా. ఆ స్లాట్ కి బైక్‌ను పోలిన ఓ వైర్ లాక్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. ఈ వైర్ లాక్ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతోంది. ల్యాప్‌టాప్ లాక్‌లు రూ.100 మొద‌లు రూ.వేయి వర‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ల్యాప్‌టాప్‌ను లాక్ చేసుకునేందుకు అది ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని మొద‌ట కెన్సింగ్‌ట‌న్ అనే కంపెనీ త‌యారు చేసింది, అందుకే ఆ లాక్‌ను కెన్సింగ్‌ట‌న్ లాక్ అని పిలుస్తారు.

ఏ లాక్‌ను కొన్నా దాన్ని మాత్రం ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. దానికి ఉండే చిన్న‌పాటి పిడిని ల్యాప్‌టాప్‌కు ఉన్న లాక్ స్లాట్‌లో అమ‌ర్చాలి. అనంత‌రం రెండో చివ‌ర‌ను వేరే స్థిరంగా ఉండే ఏదైనా పోల్ లేదా వస్తువు లేదా కంప్యూట‌ర్ టేబుల్‌కు ఉండే కాళ్ల‌కు అమర్చాల్సి ఉంటుంది. దీంతో ల్యాప్‌టాప్ లాక్ అయిపోతుంది. ఇక దాన్ని ఎవ‌రూ తీసుకెళ్లేందుకు అవ‌కాశం ఉండ‌దు.

ఈ లాక్ ఉంటె ఇంట్లో మీరు లేని సమయం లో ల్యాప్‌టాప్ ను దొంగలైయ్యాలి అంటే ఇబ్బంది ఏర్పడుతుంది, ఆఫీస్ లో మీరు లేనప్పుడు ఎవరైనా మీ ల్యాప్‌టాప్ ని అపహరించాలని ప్రయత్నించినా, ఈ లాక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ కి ఈ లాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలం లో వచ్చే ల్యాప్‌టాప్స్ అన్నిటికి ఈ లాక్ స్లాట్ సౌకర్యం ఉంది.

Comments

comments

Share this post

scroll to top