గతంలో భారతీయులు పవిత్రంగా పూజించే లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలను డోర్ మ్యాట్ లపై ముద్రించి హిందువుల మనోభావాలను దెబ్బతీసారు.. ఆ ఘటన తరువాత మళ్ళీ భారతీయ జాతీయ పతాకాన్ని, మహాత్ముడి ముఖచిత్రాన్ని చెప్పులపై ముద్రించి భారతీయుల ఆగ్రహానికి గురయ్యింది ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్..ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వినాయకుడిపై యాడ్ చేసింది మరొక సంస్థ…హిందువులు పవిత్రంగా కొలిచే గణేషుడికి మాంసం తినిపించారు ఆ యాడ్ లో..
ఆస్ట్రేలియాకు చెందిన మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా(MLA) అనే కంపెనీ ‘వి లవ్ అవర్ లాంబ్’ పేరుతో ఒక యాడ్ రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో గణేశుడితో పాటు జీసస్, బుద్ధ, థార్, యూధ తదితరులు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేస్తుంటారు. అందులో లాంబ్(గొర్రె మాంసం)ను చూపిస్తూ.. దాని గురించి మాట్లాడుకుంటారు. చివరకు ‘ది మీట్ వి కెన్ ఆల్ ఈట్ (ఈ మాంసం మేమంతా తినొచ్చు)’ అని చెప్పడంతో యాడ్ ముగుస్తుంది.మాంసం యాడ్‌లో వినాయకుడిని చూపించడంతో పాటు, ఇతర మతాల దేవుళ్లను చూపించడంతో ఇది వివాదాస్పదంగా మారింది. యాడ్‌ను తొలగించాలని ఆస్ట్రేలియాలోని భారత కమ్యూనిటీ డిమాండ్ చేస్తోంది. సోషల్‌మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది.
ఈ యాడ్ అనేది ఐకమత్యం గురించి చెప్పేది మాత్రమే అని.. లాంబ్పై అందరూ ఒకటిగా ఉంటారు అని చెప్పడమే తమ ఉద్దేశమని సంస్థవారు చెప్తున్న యాడ్ పై మీరూ ఓ లుక్కేయండి.
Watch Video:
https://www.youtube.com/watch?v=f8kuoFGgj8s