ఉప ముఖ్యమంత్రి కానున్న క్రికెటర్.!?

బీహార్ లో జరిగిన ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పాటై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు బీహార్ ముఖ్యమంత్రిగా బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీమైదాస్ లో మధ్యాహ్నం రెండు గంటలకు నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నాడు. ఈ ఎన్నికల్లో  ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు సాధించగా, బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓటమిలో క్రియాశీల పాత్ర పోషించింది ఆర్జేడీ. అయితే ఈ ఎన్నికలలో పోటీచేయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ తన ఇద్దరు తనయులు ప్రతాప్ యాదవ్,తేజస్వి యాదవ్  లను ఎన్నికలలో పోటీచేయించి వారి గెలుపకు కారకుడయ్యాడు.

అయితే ఎన్నికలలో మహాకూటమి  విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండాలని అందరూ భావించడంతో, మరో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని తన చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్ కు ఇవ్వాలని నితీష్ కుమార్ తో లాలూ చర్చలు జరిపారట. దీనికి ఆర్జేడీ నేతలు తమ మద్దతును తెలిపినట్లు సమాచారం. ఇక లాలూ పెద్ద కుమారుడు ప్రతాప్ యాదవ్ కు మంత్రి పదవిని ఇచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  అయితే తేజస్వీ యాదవ్ టిట్వంటీ క్రికెట్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్  తరఫున ఆడాడు… ఇతను మంచి ఆల్ రౌండర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top