లలితా జ్యువెల్లరీ షోరూంలో దొంగతనం…ఎలా జరిగిందో తెలుస్తే షాక్..! ఇద్దరు మహిళలు వచ్చి..

సరే.. సరే.. ఒప్పుకుంటాం.. మీరు మార్కెటింగ్‌లో కింగ్‌లు కావచ్చు. జనాలను ఆకర్షించేలా యాడ్స్‌ తీయవచ్చు.. అదే స్థాయిలో బంగారం అమ్మకాలు జరపవచ్చు. లాభాలను కూడా గడించవచ్చు. అది మీ తెలివికి సంకేతమే. కానీ.. ప్చ్‌.. ఏం చేస్తాం.. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. మనం ఎంత తెలివికల్ల వారమైనా ఒక్కోసారి మనల్ని బురిడీ కొట్టించేవారు కూడా ఉంటారు. అవును, నిజమే. ఇంతకీ మేం ఏం చెబుతున్నామో ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చినట్టుంది కదా..! అవునండీ… అదే సంస్థ.. లలిత జ్యువెల్లరి.. ఇంతకీ ఏంటి విషయం.. మళ్లీ ఆ గుండు ఆయన ఇంకో కొత్త యాడ్‌ను తీశారా..? కొంపదీసి..? అని అడగబోతున్నారా..? అయితే అది కాదులెండి. ఇది వేరే విషయం.. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే…

లలితా జ్యువెల్లరీకి చెందిన షోరూం ఒకటి హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉంది కదా. అది చాలా పెద్ద షోరూం. అయితే అందులో తాజాగా చోరీ జరిగింది. ఏంటీ.. నమ్మలేకుండా ఉన్నారా..? అయినా మేం చెబుతోంది నిజమే. అంత సెక్యూరిటీ ఉంటుంది, చుట్టూ ఎప్పుడూ జనాలు ఉంటారు, సిబ్బంది కూడా బాగానే ఉంటారు, అయినా చోరీ ఎలా జరిగింది..? కొంపదీసి షాపుకు రాత్రి పూట కన్నం వేశారా..? అంటే.. అది కాదు. పగటి పూటే చోరీ జరిగింది. ఇది మరీ విడ్డూరమైన విషయం. ఇంతకీ అసలు చోరీ ఎలా జరిగిందో తెలుసా..?

బురఖా వేసుకున్న ఇద్దరు మహిళలు సదరు లలితా జ్యువెల్లరీ షోరూంలోకి వచ్చి నగలు చూపించమన్నారు. అందులో ఒక నెక్లెస్‌ సెలెక్ట్‌ చేశారు. అనంతరం దానికి చెందిన డూప్‌ రోల్డ్‌ గోల్డ్‌ నెక్లెస్‌ను దాని స్థానంలో పెట్టారు. ఆ తరువాత ఇంకేముందీ.. అసలు నెక్లెస్‌తో అక్కడి నుంచి ఉడాయించారు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..? గతంలో ఆ మహిళలే ఓ సారి అక్కడికి వచ్చి నగలు చూపించమని చెప్పి ఒక నెక్లెస్‌ను తీసుకున్నారు. దాన్ని మెడలో వేసుకుని సెల్పీలు దిగారు. తరువాత నెక్లెస్‌ కొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వారు ఆ నెక్లెస్‌కు గాను డూప్లికేట్‌ నెక్లెస్‌ను అచ్చం దాన్ని పోలిన విధంగానే ఉండేలా తయారు చేయించారు. దాన్నే షాపుకు తీసుకెళ్లారు. అలా వారు షాపుకు వెళ్లగానే మళ్లీ అదే నెక్లెస్‌ ను చూపించమన్నారు. అనంతరం ఆ ఒరిజినల్‌ నెక్లెస్‌ స్థానంలో డూప్లికేట్‌ నెక్లెస్‌ పెట్టారు. తరువాత కొంత సమయం పాటు వేచి చూసి అక్కడి నుంచి ఉడాయించారు. ఇదీ జరిగింది.. దీంతో షాపు వారు నిర్ఘాంతపోయారు. అనంతరం వారు జరిగిన దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఆ దొంగలను పట్టుకుంటారో లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top