కొన్ని నెలలుగా టీవిల్లో యాడ్స్ లో,రోడ్లపై హోర్డింగ్స్ లో ,బస్ లు ,ఆటోలు,ఆఖరికి కనిపించే ప్రతి గోడ పైన అతని ఫోటోలే…అతనే లలితా జ్యువెలరీ కిరణ్ కిమార్..ఆ యాడ్ తర్వాత ఎన్నో ట్రాల్స్,అతడి గుండు నుండి మాటల వరకూ దేన్ని వదిలిపెట్టకుండా ప్రతిది నవ్వుకోవడానికి వాడుకున్నారు.. కానీ ఇప్పుడు లలితా జ్యువెలరీ విజయం వెనుక కిరణ్ కృషి ఉంది.. లలితా జ్యూయలర్స్ కి 1999లో మూసేసే పరిస్థితి వస్తే..అన్నం పెట్టిన సంస్థ మూతపడకుండా లలితా జ్యూయలర్స్ను టేకోవర్ చేసి..ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చారు..
స్కూల్ అంటే తెలీదు బీద కుటుంబం నుండి వచ్చిన కిరణ్ కి జీవితం విలువ తెలుసు.ఎన్ని ఆటుపోట్లు,ఛీత్కారాలు ఎదుర్కోకపోతే ఈ స్థాయికి వచ్చుంటారు.. పొట్ట చేత పట్టుకుని రాజస్థాన్ నుండి నెల్లూరొచ్చిన అతను.. తల్లి చేతి గాజులతో వస్తువులు చేసి వాటిని అమ్ముదామని చెన్నయ్ వెళ్లి అక్కడ లలితా లో వాటిని అమ్మి అక్కడ ఆర్డర్స్ తీసుకుని ఇంటికొచ్చిన అతనే ..ఈరోజు టీవీల్లో…ఫ్లెక్సీ ల్లో కనిపించే లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్.. ఈ యాడ్ లో కనపడకముందే కిరణ్ ఒక సినిమాలో తెరపై కనిపించారు.అది కూడా సూపర్ స్టార్ రజిని కాంత్ మూవీ..రజిని,అనుష్క,సోనాక్షి సిన్హా కాంబినేషన్లో వచ్చిన లింగా మూవీలో వచ్చే చిన్న సీన్లో కిరణ్ కుమార్ ను మనం చూడొచ్చు..ఆ వీడియో మీకోసం చూడండి.
watch video here:
https://www.youtube.com/watch?v=B3claOJhXCg