విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్, ఆరాచకమైన ట్రైలర్ సామి.. వర్మ ధైర్యానికి దండం పెట్టాలి.!!

వర్మ వర్మ.. మరీ ఇంత బహిరంగంగా ఎలా సామి.. రామ్ గోపాల్ వర్మ అంటేనే సెన్సేషన్, ఎప్పుడు వివాదాల నడుమ నడిచే వర్మ, ఈ సారి పెద్ద వివాదం లో నడవటం కాదు, ఉరుకుతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్ ఎటాక్ చెయ్యడానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తో సిద్ధం అయ్యాడు.

ట్రైలర్ తో అరాచకం సృష్టించాడు… :

వాలెంటైన్స్ డే స్పెషల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేసాడు వర్మ, ఈ ట్రైలర్ చుసిన జనులందరి మదిలో ఒకటే ఆలోచన, ఈ అరాచకం ఏంటండీ అని.. రామ్ గోపాల్ వర్మ ముక్కుసూటి మనిషి అని అందరికి తెలుసు, కానీ ఇంత డైరెక్ట్ గా చూపిస్తాడు అని ఎవ్వరు అనుకోలేదు, వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే, ట్రైలర్ లో వర్మ చూపించిన ప్రకారం అయితే చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం లో విలన్, మరి హీరో ఎవరు అనేది సినిమా చూసాకే అర్ధం అవుతాది. లక్ష్మి పార్వతి ఎంట్రీ నుండి విసరాయ్ హోటల్ ఎదురుగా చెప్పులు విసిరే స్కీన్ల వరకు ట్రైలర్ లో చూపించాడు వర్మ. సినిమా లవర్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లు.. :

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసాక తెలుగు తమ్ముళ్లు వర్మ పైన ఫైర్ అవుతున్నారు, ఇప్పటికే విడుదలైన పాటల ద్వారా తెలుగు తమ్ముళ్ళకి ఫుల్ గా కోపం వచ్చింది, ఈ ట్రైలర్ చూసాక వారు కోపం తో ఊగిపోతున్నారు, అయితే వరం మాత్రం, ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతా అని చెబుతున్నాడు, రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనం సృష్టిస్తాదో మరి కొన్ని రోజుల్లో తేలనుంది.

Watch Trailer :

Comments

comments

Share this post

scroll to top