జోహార్ ఎన్టీఆర్ అంటున్న ఫ్యాన్స్ .. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫుల్ రివ్యూ & రేటింగ్.?

వివాదాల నడుమ మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది, హైదరాబాద్ లో మార్నింగ్ షోస్ కి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమా విషయానికి వస్తే, వర్మ తాను చెప్పాలనుకుంది సూటిగా చెప్పాడు, ఈ సినిమా వల్ల అన్న గారి జీవిత చరిత్ర మొదలు నుండి ఆరంభం వరకు ప్రేక్షకులు తెలుసుకున్నారు, కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు చేసినాక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూస్తే అన్న గారి జీవిత చరిత్ర మొత్తం తెలుసుకున్నట్టే.

కథ.. :

ఎన్టీఆర్ గారి జీవితం లో లక్ష్మి పార్వతి ప్రవేశించాక ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేది అసలు కథ, క్లుప్తంగా చెప్పాలంటే 1989లో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీపార్వతి ఆయన దెగ్గరకు వస్తారు. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌, జీవిత చరిత్ర రాసేందుకు అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతిపై కొద్ది రోజుల్లొనే అసత్య ప్రచారాలు మొదలవుతాయి.

ఆ అసత్య ప్రచారాలన్నీ ఎన్టీఆర్‌ దాకా రావటంతో ఆయన లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకోబోతున్నట్లు మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో పబ్లిక్ గా ప్రకటిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు, ఓ పత్రికా అధినేతతో కలిసి లక్ష్మీ పార్వతిపై చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీతో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సీఎం అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న అల్లుడు, కుట్రలకు తెరతీస్తాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారు. సీయం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయటంతో ఆయన ఎంతో బాధకు లోనవుతారు, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

నటీనటులు.. :

ఈ సినిమాలో నటీనటుల వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు, ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర లో నటించిన విజయ్ కుమార్ అద్భుతంగా నటించారు, విజయ్ కుమార్ కి ఇది మొదటి సినిమా నే అయినా ఎక్కడ బెణుకు లేకుండా అద్భుతంగా అన్నగారి పాత్రలో ఇమిడిపోయారు. లక్ష్మి పార్వతి పాత్ర లో నటించిన యజ్ఞశెట్టి కూడా ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన ఆయన అల్లుడి పాత్రలో శ్రీ తేజ్ బాగా నటించాడు, సినిమా మొత్తం ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది, మిగిలిన నటీనటులు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

వర్మ.. సంగీతం.. :

వర్మ దర్శకత్వం ఈ సినిమా కు ప్లస్ పాయింట్, నేపధ్య సంగీతం అద్భుతంగా ఇచ్చారు కళ్యాణ్ మాలిక్. పాటలు కూడా బాగున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా వర్మ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు, ఇకపైన అయినా పిచ్చి పిచ్చి సినిమాలు తియ్యకుండా ఈ తరహాలోనే జనాలను ఆకట్టుకొనే సినిమాలు వర్మ మరెన్నో తియ్యాలని వర్మ అభిమానులు అంటున్నారు, సినిమా అయిపోయాక అన్న గారి అభిమానులు జోహార్ ఎన్టీఆర్, జిందాబాద్ ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ప్లస్ పాయింట్స్.. :

నటీనటుల నటన
నేపధ్య సంగీతం
దర్శకత్వం

మైనస్ పాయింట్స్.. :

కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించే సన్నివేశాలు..

 రేటింగ్  : 3 / 5

 

 

Comments

comments

Share this post

scroll to top