లిజీ పేరు చెప్తే ఈ కాలం వారు గుర్తు పట్టకపొవచ్చు కానీ …ముందు తరం సినీప్రేక్షకులు మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు..సుమన్ తో నటించిన 20వ శతాబ్దం,ఆత్మబందు సినిమాల హీరోయిన్ గా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే..వాస్తవానికి ఆమె మళయాలి నటి..తెలుగులో ఎనిమిది సినిమాల వరకూ చేసారు..అందులో ఆరు సినిమాలు సూపర్ హిట్టే..పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన లిజీ మళ్లీ తెలుగు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు..
అలనాటి నటీమనులు చాలామంది పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పి..మళ్లీ కొంతకాలం తర్వాత ఆర్దిక కారణాలు,నటన మీద ఇష్టం ఇలా అనేక కారణాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు..వారిలో శ్రీదేవి,నదియా,పూర్ణిమా,కాంచన ఇలా ఎందరో ఉన్నారు..వారిలో ఇప్పుడు లిజీ కూడా చేరబోతున్నారు.దర్శకుడు ప్రియదర్శన్‌తో పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయింది. ఇందులో అలనాటి హీరోయిన్స్ కుష్బూ, ఇంద్రజ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తున్నారా ? అని ఆలోచించుస్తున్నారా ? ఎక్కువ ఆలోచించకండి..ఆమె నటిస్తున్నది ఏ సినిమాలో అంటే నితిన్,మేఘాఆకాశ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమాలో…మరి పవన్ కళ్యాణ్ సినిమాలో అంటారేంటి అనుకుంటున్నారా..ఈ సినిమాను పవన్, త్రివిక్రమ్ లు నిర్మిస్తున్నారు. అదీ విషయం..
“25 ఏళ్ల తరువాత మళ్లీ సినిమాల్లోకి ప్రవేశిస్తున్నాను. కీలక పాత్ర పోషిస్తున్నాను. ఈ సినిమా న్యూయార్క్‌లో జరిగిన షెడ్యూల్లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. భయంగా అనిపించినా థ్రిల్లింగ్ వుంది “అంటూ ఆమే స్వయంగా పేస్బుక్ లో పోస్టు పెట్టారు..కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఆనాటి లిజీ అభిమానులకు ఇది శుభవార్తే…