ప్రేమకు కామానికి మద్య వ్యత్సాసాన్ని తెల్పిన "లజ్జా" ట్రైలర్

లజ్జ’. ఈ టైటిల్ కొంచెం వినడానికి ఎలాగో ఉన్నా తన సినిమాతో  ప్రేమకు, కామానికి మధ్య వ్యత్యాసాన్ని చూపించబోతున్నాడు దర్శకుడు నరసింహ నంది. నరసింహ నంది 2008లో  ‘1940లో ఒక గ్రామం’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నరసింహా నంది , అదే  సినిమాతో జాతీయ అవార్డును,నంది అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ‘కమలతో నా ప్రయాణం’ సినిమాను చేశాడు. మళ్ళీ ఇన్నిరోజుల తర్వాత ‘లజ్జ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘పెళ్లి తర్వాత తన భర్త ప్రేమ తనకు మాత్రమే దక్కాలనుకుంటుంది అతని భార్య,అలాంటి సమయంలో భార్య భర్తనుండి సరైన  ప్రేమను పొందకపోతే ఆ తర్వాత ఆమె ఆలోచనలు ఎటువైపు మళ్ళుతాయి’ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమా మొత్తం ఒక హిందూ యువతి, ఇద్దరు ముస్లిం యువకుల మధ్య నడుస్తుందట. హీరోయిన్ గా మధుమిత నటిస్తుండగా, ఇతర పాత్రలలో శివ,వరుణ్ నటిస్తున్నారు. వనమాలి సాహిత్యం అందిస్తుండగా, సుక్కు సంగీతాన్ని అందించాడు.తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయగా ఈ టీజర్ ప్రేక్షుకులను ఆకట్టుకుంటోంది. ‘కామంకోసం వచ్చావా ప్రేమకోసం వచ్చావా’ ,’కామంతో నిండిన ప్రేమలో దాపరికాలు ఉంటాయేమో కానీ,స్నేహంతో నిండిన సావాసంలో దాపరికాలు ఉండవు’అనే డైలాగ్స్ బాగున్నాయి.

Watch Lajja Teaser:

Comments

comments

Share this post

scroll to top